S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 00:14

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 29: ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో దుర్గగుడి అధ్వర్యంలో నిత్యం భక్తులకు అమలు చేస్తున్న ఉచిత నిత్యాన్నదాన పథకంలో భోజనాలు బేష్‌గా ఉన్నాయని ఉన్నతాధికారుల బృందం దుర్గగుడి ఇన్‌చార్జ్ ఇవో అజాద్‌కు కితాబు ఇచ్చారు.

04/30/2016 - 00:13

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 29: ఎంసెట్ ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద నిర్వహించిన కరపత్రాల ప్రచారంతో పలు రోడ్లు అపరిశుభ్రంగా తయారయ్యాయి. పలు ఇంజనీరింగ్, ఇతర కళాశాలలకు చెందిన కరపత్రాలు రోడ్లపై దర్శనమిచ్చిన వైనాన్ని పరిశీలిస్తే అసలు నగరంలో లిట్టర్ ఫ్రీ చర్యలు అమలులో ఉన్నాయా లేదాన్న సందేహం కలుగకమానదు.

04/29/2016 - 23:56

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 29: వేసవిలో దాహార్తితో ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రూ.3 కోట్లతో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. స్థానిక తాలూకాఫీసు సెంటరు, వెల్లమిల్లి స్టేజ్‌ల వద్ద విపత్తు నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు.

04/29/2016 - 23:55

ద్వారకాతిరుమల, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన చిన వెంకన్న ఆలయంలో ఆదివారం నుండి సెల్‌ఫోన్ నిషేధాన్ని అమలు చేయనున్నారు. ఆలయ భద్రతతోపాటు భక్తుల ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడం, అలాగే దేవతా మూర్తులపై భక్తులు దృష్టి ఉంచేలా ఆలయ పరిసరాల్లో సెల్‌ఫోన్లను నిషేధించారు. ఇప్పటికే ఆలయ ప్రాకారంలో జామర్లను ఏర్పాటు చేసినా అవి కొన్ని నెట్‌వర్క్‌లను పూర్తిగా నియంత్రించలేక పోతున్నాయి.

04/29/2016 - 23:55

ఏలూరు, ఏప్రిల్ 29: ఏలూరు కార్పొరేషన్ వ్యవహారాలన్నీ విడ్డూరంగా కొనసాగుతున్నాయి. విమర్శలు వెల్లువెత్తినా వాటిని పక్కనపెట్టి మరీ తనదైన శైలిలోనే ముందుకు వెళుతోంది. ఇంతకుముందు లేని విధంగా ప్రస్తుత పాలకవర్గంలో డిప్యూటీ మేయర్ పదవిని నలుగురికి పంచారు. వారిలో మొదట ఈ స్థానంలో కొలువుతీరిన చోడే వెంకటరత్నం గడువు జనవరి 2తో పూరె్తైంది.

04/29/2016 - 23:54

భీమవరం, ఏప్రిల్ 29: భీమవరం పట్టణంలోని వివిఆర్ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ బోర్డు తిప్పేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనితో శుక్రవారం బాధితులంతా ఆ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరికొందరు లబోదిబోమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన వివిఆర్ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ భీమవరంలో 2010లో టౌన్ రైల్వేస్టేషన్ వద్ద కార్యాలయాన్ని ప్రారంభించింది.

04/29/2016 - 23:54

దేవరపల్లి, ఏప్రిల్ 29: జిల్లా రాజకీయాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించి, రాజకీయ నాయకునిగా కాక, రాజనీతిజ్ఞునిగా పేరొందిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామికి జిల్లాలో నేడు అక్షర నీరాజనం జరగనుంది. పదవులకు కాక విలువలకు కట్టుబడిన నేతగా యర్రా సమున్నతంగా నిలిచారు.ఎందరో మహామహులు జిల్లా రాజకీయాలను శాసించినా, జిల్లా రాజకీయ చరిత్రలో అజాత శత్రువుగా యర్రాకున్న స్థానం ఆయనదే.

04/29/2016 - 23:53

ఏలూరు, ఏప్రిల్ 29: వేసవి దృష్ట్యా ప్రజల ఉపయోగార్ధం అయిదు లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ విజయగౌరిని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు.

04/29/2016 - 23:52

నల్లజర్ల, ఏప్రిల్ 29: ఎట్టి పరిస్థితుల్లో జన్మభూమి కమిటీలను రద్దు కానివ్వమని, ఈ కమిటీల వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఈ కమిటీలు మరింత పకడ్బంధీగా పనిచేసేలా కృషిచేస్తామని జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. నల్లజర్లలో శుక్రవారం ఏర్పాటుచేసిన నాయకత్వ శిక్షణా శిబిరానికి ముళ్లపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

04/29/2016 - 23:52

బుట్టాయగూడెం, ఏప్రిల్ 29: తాగునీటికోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కొందరు ఆకతాయిలు చేసిన పని వందలాది మందిని దాహార్తికి గురిచేసింది. బుట్టాయగూడెం వార్డు మెంబర్ అందుగుల మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అంబేద్కర్ కాలనీ వద్ద పంచాయతీ ఏర్పాటుచేసిన చేతి పంపుపై సుమారు 1500 మంది తాగునీటికోసం ఆధారపడ్డారు.

Pages