S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/14/2019 - 20:44

ఈనాడే బాబూ నీ పుట్టినరోజు
ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చినరోజు
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాఘవ నిర్మించిన ‘తాత-మనవడు’ చిత్రంలోనిది ఈ పాట. మనవడి (రాజబాబు) బాల్యంలో పుట్టినరోజు సందర్భంగా నానమ్మ (అంజలీదేవి) మనవడిని ఆశీర్వదిస్తూ పాట పాడే సన్నివేశం.
తండ్రి మాటకై కానకు తరలిపోయె రాఘవుడు
అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడూ

09/14/2019 - 20:44

ఊహాజనితమైన టైంమెషీన్ నేపథ్యంలో వర్తమానంనుండి భూత భవిష్యత్ కాలాలను స్పృశిస్తూ జనరంజకంగా మలచిన చిత్రరాజం ‘ఆదిత్య 369’. బ్యాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం మరియు హెచ్‌జి వెల్స్ నవల టైం మెషీన్ స్ఫూర్తితో రూపొందిన చిత్ర కథకు సైన్స్‌ఫిక్షన్, చరిత్ర, ప్రేమ, క్రైమ్ అంశాలను జోడించి ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా చిత్రీకరించారు.

09/14/2019 - 20:37

ఏం! ఊపిరున్నంతవరకూ నటించాలా? నటించడం మానేస్తే ఊపిరాగిపోతుందా? ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తూ జగ్గయ్య. సినీ పరిశ్రమలో జగ్గయ్యకో ప్రత్యేకత వుంది. ఆయన కళావాచస్పతి. రవీంద్రుడిని చదివారు. వాస్తు జ్యోతిష్యం తెలుసు. ముఖ్యంగా ఆత్రేయకి మంచి స్నేహితుడు. ఇద్దరూ కలుసుకుంటే.. తొమ్మిదింటికి ఆరంభమైన ‘గానాభజానా’ తెల్లార్లూ కొనసాగేది.

09/07/2019 - 20:52

పెద్దగా చదువుకోని కుటుంబం నుంచి రంగుల ప్రపంచంలోకి వచ్చి -నటిగా పనికిరావన్న దర్శకులు, అగ్రనటులు, తోటినటులు, నిర్మాతల నోటితోనే.. నీవే ‘మహానటి’వి అనిపించుకున్న గొప్ప కళాకారిణి సావిత్రి. మహానటి టైటిల్‌తో నిర్మించిన ఆమె జీవిత కథా చిత్రం నాకు చాలా ఇష్టం. ప్రతిభ, పట్టుదలతో ‘నట జీవితంలో’ ఎవరెస్టు శిఖరం ఎక్కిన సావిత్రి..

09/07/2019 - 20:51

నిన్న కనిపించింది/ నన్ను మురిపించింది/ అంద చందాల రాణీ ఆ చిన్నది/ ఆమె చిరునవ్వులోనే హాయున్నది
ఇది బిఏయస్ వారి ‘రాణీ రత్నప్రభ’ జానపద చిత్రం కోసం ఆరుద్ర రాసిన పాట. అద్భుత సాహిత్యాన్ని మనసువశం చేసేంత హాయిగా సాలూరి రాజేశ్వరరావు సంగీత స్వరాలు సమకూర్చారు. శ్రావ్యమైన ఘంటసాల గాత్రంలో ఆ పాట అజరామరమైంది. ఎన్‌టి రామారావు, రేలంగి, సీతారామ్, అంజలి, సియస్‌ఆర్‌లపై ఈ పాటను చిత్రీకరించారు.

09/07/2019 - 20:50

నందమూరి సోదరులు యన్టీఆర్, త్రివిక్రమరావు క్రమశిక్షణ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. వారు ఏ పనిచేసినా మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా ఉండేది. అంటే ట్రెండ్ స్టెటర్స్ అన్నమాట.

08/31/2019 - 20:51

‘విన్నావ యశోదమ్మా/ మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లరి చిల్లరి పనులు.. విన్నావ యశోదమ్మా’ అంటూ మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రాసిన పాట నాకు చాలా ఇష్టం. పాటకు తగిన కమనీయ స్వరాలు అందించారు ఘంటసాల మాస్టారు. అంతే శ్రావ్యంగా పాడింది పి లీల బృందం. నిజానికి ఈ పాట సినిమా కథకు అవసరం లేదు. లేకున్నా ఇబ్బందీ లేదు.

08/31/2019 - 20:49

యన్టీఆర్, వాణిశ్రీ కాంబినేషన్‌లో 1976 మార్చి 12న విడుదలైన సినిమా -ఆరాధన. నిరక్షరాస్యుడైన గోపి, విద్యాధికురాలైన రాధల మధ్య నడిచే ప్రేమ కథ. పల్లెటూరికి చెందిన గోపి గాయకుడు. తన మధుర కంఠం, పల్లెటూరి అమాయకత్వంతో రాధను ఆకర్షిస్తాడు. వాళ్ల ప్రేమకు ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి, ఇద్దరూ ఒక్కటయ్యారా? అన్నదే అసలు కథ. దర్శకుడు బీవీ ప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎ పుండరీకాక్షయ్య నిర్మాత.

08/24/2019 - 21:03

ఒక సినిమా విజయం సాధిస్తే తీసిన దర్శకుడినో, చేసిన హీరోనో మెచ్చుకుంటారు. కాని, వాళ్లకు ఆ చాన్స్ ఇచ్చే కథకుడు మాత్రం అజ్ఞాతంలో ఉన్నట్టే ఉంటాడు. అలాగే ఆ కథను తగిన సంభాషణలు అందించి చిత్రానికి ఓ గొప్పదనాన్ని తీసుకొచ్చేవారు, చెప్పాల్సిన కథను సింపుల్‌గా ఓ పాటతో చెప్పేవారు వీళ్లు మాత్రం తక్కువ ఆదరణ నోచుకుంటారు.

Pages