S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

12/11/2017 - 18:42

‘‘ఎన్నోసార్లు.. ఎన్నో విధాలుగా మనం నచ్చిన వాళ్లని ప్రేమిస్తూనే వుంటాం. అయితే మన ప్రేమ సక్సెస్ అయినప్పుడే నిజమైన ఆనందం. అలాంటి ఆనందాలు ఎప్పుడూ దొరకలేదు. ప్రేమలో ఐదుసార్లు నేను ఓడిపోయా. ప్రేమించానని చెప్పిన వాళ్లందరూ చివరికి మరోదారి చూసుకోవడంతో ఐదుసార్లు ఓటిమిని ఎదుర్కొన్నాను’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది నటి లక్ష్మీరాయ్.

12/11/2017 - 18:41

ఏంటి.. అప్పుడే నాకు పెళ్లి వయసు దాటిపోయిందా? ఎక్కడికి పోయినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. వినీ వినీ బోర్ కొట్టేసింది. సల్మాన్‌ఖాన్‌ను అడిగినట్టు నన్ను అడుగుతారెందుకు? నేను ఒకప్పుడు అజయ్‌దేవ్‌గన్‌వల్లే నాకు పెళ్లి కాలేదని జోక్‌గా మాట్లాడితే, దాన్ని సీరియస్‌గా తీసుకుని సీరియల్ సీరియళ్లుగా రాసేశారు. కానీ చివరికి నేను దేనిగురించి మాట్లాడాను అన్నది అందరికీ అర్థమైంది.

12/11/2017 - 18:40

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ సినిమాలు రూపొందించే సంజయ్‌లీలా భన్సాలీ తాజాగా ఓ రైటర్ కథను తీసుకున్నారు. సాహిర్ లూథియాన్వి, ఆయన ప్రేయసి అమృతా ప్రీతమ్ కథను సినిమాగా రూపొందించే ప్రయత్నంలో వున్నారు. ఈ సినిమా కోసం మొదట ఇర్ఫాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రాలను ఎంపిక చేసుకున్నారు. కానీ కాల్షీట్లు కుదరకపోవడంతో ఇప్పుడు అభిషేక్ బచ్చన్, పరిణీతి చోప్రాలు కెమెరాముందుకు వచ్చారు.

12/11/2017 - 18:38

అప్పట్లో చిలిపి పిల్లలా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన జెనీలియా గుర్తుందిగా! హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి చిత్రాలతో చక్కటి నటనను కనబరిచిన ఈ అమ్మడు వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది.

12/11/2017 - 18:25

దంగల్ చిత్రం గుర్తుంది కదా! ఆ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ చూసినపుడు అమీర్‌ఖాన్‌తోపాటుగా వున్న వాళ్లందరూ అబ్బాయిలనుకుంటారు చూసినవాళ్లు. కానీ సినిమా చూశాకే అర్థమవుతుంది వారు అమ్మాయిలని. అందులో కూతురుగా నటించిన జైరా వశీం కూడా మొదట అబ్బాయిగానే గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందిన ఈ అమ్మడు, అమీర్‌ఖాన్‌తో సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రంలో కూడా నటించింది.

11/20/2017 - 19:21

హాలీవుడ్‌లో ఆస్కార్ రేంజ్ ఫిలిం మేకర్ హార్వే విన్‌స్టీన్ ఏకంగా 40 మంది కథానాయికల్ని లైంగికంగా వేధించాడన్న వార్త విని ప్రపంచం విస్తుపోయింది. అలాంటి దుర్మార్గులు ఇంకా ఎందరో సినీ పరిశ్రమల్లో వున్నారన్న నిజం తెలిస్తే మరింతగా ఆశ్చర్యపోవడం ఖాయం. అంతెందుకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఈ ప్రహసనం యథేచ్చగా సాగేదేనని మన కథానాయికలే లీక్ చేసేస్తున్నారు.

11/06/2017 - 19:21

మొబైల్, ట్యాబ్, ఆన్‌లైన్ గేమ్స్, వీడియో గేమ్స్.. ఇవన్నీ ఈ తరం బాలల్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో తెలియంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా బాల్యాన్ని కబలిస్తున్న డిజిటల్ వ్యసనాలకు ఎందరో పిల్లలు బానిసలవుతున్నారు. ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని అల్లాణి శ్రీ్ధర్ స్వీయ దర్శకత్వంలో ‘డూ డూ ఢీ ఢీ’ (మా ఊరికొండ) చిత్రం రూపుదిద్దుకుంది.

10/30/2017 - 19:54

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఓ వైపు స్టార్ హీరోలతో నటిస్తూనే మరోవైపు కుర్ర హీరోలను వదలడంలేదు. అలాగే గత కొన్ని రోజులుగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న నయన, రహస్యంగా వివాహం చేసుకున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు జోరందుకున్నాయి.

10/30/2017 - 19:53

‘బాహుబలి’ సినిమా తరువాత అనుష్క క్రేజ్ తగ్గినట్టుంది. ఈ సినిమా కోసం ఐదేళ్లు కేటాయించిన అనుష్క ఆమధ్య రెండు చిత్రాలను మాత్రమే చేసింది. ప్రస్తుతం ‘్భగమతి’ చిత్రంలో నటిస్తున్న అనుష్కకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడంలేదు. దాంతో ఆమె ఫోకస్ మలయాళంపై పడింది. తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుండడంతో మలయాళంలో ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

10/23/2017 - 20:13

మహానటి సావిత్రి జీవిత గాథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసి స్వర్ణ యుగ ప్రేక్షకులు ఆనందపడుతున్నారు. ఆమె అభిమానులు అంటే అప్పటి ప్రేక్షకులందరూ ఆ చిత్రం ‘మహానటి’ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం. ఆమె సాదా సీదా నటి కాదు. నటనకే భాష్యం చెప్పగల నటి. నవరసాలను అలవోకగా ప్రదర్శించగల గొప్పనటి. భారతదేశ చలన చిత్రరంగం గర్వించదగ్గ నట శిఖరం. నటనలో పండిపోయి తన అపూర్వ నటన తో మహానటి అనిపించుకున్నది.

Pages