S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/20/2017 - 20:48

1959లో విజయా సంస్థ నిర్మించిన అద్భుత చిత్రం -అప్పుచేసి పప్పుకూడు. చక్కటి మెలోడ్రామా, సునిశితమైన హాస్య సన్నివేశాలు, సంభాషణలతో రంజింపచేస్తుంది. చెల్లి కాపురాన్ని సరిదిద్దడానికి అన్న ఎన్టీఆర్ వేసే చిత్రమైన వేషాలు కడుపుబ్బ నవ్విస్తాయి. మరదలితో వివాహం కోసం స్నేహితుడికి సహాయం చేస్తూ రేలంగి ఆడే నాటకం, ఆస్తులు లేకున్నా ధనవంతుడినన్న బిల్డప్ ఇచ్చేందుకు పేద జమీందార్ పడే అప్పుల తిప్పలు..

03/20/2017 - 20:46

‘తెలుగు వీర లేవరా/ దీక్షబూని సాగరా/ దేశమాత స్వేచ్ఛకోరి/ తిరుగుబాటు చేయరా’.. -శ్రీశ్రీ రాసిన పాట తెలుగు జాతికి, తెలుగు భాషకు స్ఫూర్తి. అల్లూరి సీతారామరాజు తెలుగుజాతికి నిత్య స్ఫూర్తి. బ్రిటీష్ మూకలపై సీతారామరాజు ఎంత ఆవేశం ప్రదర్శించాడు, గిరిజనుల్లో ఎలాంటి స్ఫూర్తి రగిల్చాడో చెప్పడానికి శ్రీశ్రీ రాసిన నాలుగు పంక్తుల పాట చాలు.

03/20/2017 - 20:44

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

03/13/2017 - 21:38

హీరో అయితే గొప్పేంటంట? ఇప్పుడు నాక్కూడా హీరో స్థాయి స్టార్‌డమ్ వచ్చేసింది అంటూ చెబుతోంది బాలీవుడ్ హాట్ బాంబ్ కంగనా రనౌత్. సహజంగా ఏ నటి అయినా బాలీవుడ్‌లో టాప్‌హీరోలు ఖాన్ త్రయంతో నటించాలని కోరుకుంటారు. కానీ కంగనా రనౌత్ మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తోంది. సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్‌ల గొప్పతనం ఏంటంట?

03/13/2017 - 21:34

చందమామ రావె.. జాబిల్లి రావె అంటూ బిడ్డను చంకనెత్తుకొని తల్లులు గోరు ముద్దలు తినిపించే సన్నివేశాలు కనిపించేవి ఒకప్పుడు. చందమామను అద్దంలో చూపేవరకూ బాల రాముడు పాలబువ్వ తినేవాడు కాదనీ పురాణాల్లోను, పుస్తకాల్లోనూ చదువుకున్నాం. సందర్భానుగుణంగా చందమామను చూపించే సన్నివేశాలు ఒకప్పటి తెలుగు సినిమాల్లో చాలానే ఉండేవి. ఇప్పుడూవున్నా -అప్పుడప్పుడనే చెప్పాలి.

03/13/2017 - 21:32

మాటలు: రావూరు
పాటలు: బివిఎస్ ఆచార్య, దైతా గోపాలం, రావూరు
నృత్యం: వెంపటి సత్యం
ఛాయాగ్రహణం: తంబు,
ఎడిటింగ్: ఎన్‌కె గోపాల్
సంగీతం- డి బాబూరావు, బాలమురళీకృష్ణ, వేణు, మల్లిక్
**

03/13/2017 - 20:50

ఇరానీ అత్యంత వేగంగా చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసినప్పటికీ, చిత్రం సంగీతం రెండూ కూడా సూపర్‌హిట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఏడు పాటలను చిత్రీకరించారు. మొట్టమొదట రికార్డయిన పాటలను డబ్ల్యుఎం ఖాన్ పాడారు. రికార్డింగ్ యంత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వచ్చిన ఖాన్, ఆర్దేషిర్ అనుమతితో ఫకీరు వేషం వేసి ‘పుస్తు’ భాషలో పాట పాడటం గమనార్హం.

03/13/2017 - 20:48

అవి హైదరాబాద్‌కు తెలుగు సినిమా తరలివస్తున్న రోజులు. అక్కినేని నాగేశ్వరరావు పూర్తిగా హైదరాబాద్‌కు కుటుంబంతో సహా వచ్చేశారు. ఇకనుంచి నటించబోయే చిత్రాల షూటింగ్‌లు హైదరాబాద్‌లోనే జరుపుకొంటాయని ప్రకటించారు. దాంతో అక్కినేనితో సినిమాలు నిర్మించే సంస్థలు తమ చిత్రాల నిర్మాణాన్ని హైదరాబాద్‌లోనే కొనసాగించటం మొదలుపెట్టారు.

03/13/2017 - 20:46

ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బోయ్‌ఫ్రెండ్స్, ఈడోరకం ఆడోరకం చిత్రాలతో గ్లామర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హెబాపటేల్ మున్ముందు మరింత గ్లామర్‌ను వెండితెరపై పండించడానికి సిద్ధమవుతోందా? ఈ స్టిల్ చూస్తే అవుననే అనిపిస్తుంది. అలా ఎలా? చిత్రంతో తెరంగేట్రం చేసినా, కుమారి 21ఎఫ్‌తో హెబ్బా అందరికీ పరిచయమైంది.

03/13/2017 - 20:45

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై డి రామానాయుడు అందించిన ఆణిముత్యం ‘ప్రేమమందిరం’. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా గ్లామర్ క్వీన్ జయప్రద హీరోయిన్‌గా నటించిన చక్కని ప్రేమకథా చిత్రం. నిజానికి అలా చెప్పడం కంటే, రాజా జమీందారీ వ్యవస్థలో నడిపిన ప్రేమ కథా కావ్యం అనడం సబబు.

Pages