S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2020 - 01:49

రోమ్, మార్చి 22: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత మరింత జఠిలంగా మారుతోంది. దాదాపు 100 కోట్ల మంది ఇళ్లకే పరిమితమైపోయే పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 13,444కు పెరిగింది. దాదాపు 170 దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత పెరుగుతోంది. దాదాపు 35 దేశాలు లాక్ డౌన్ పరిస్థితిలోకి వెళ్లిపోయాయి.

03/23/2020 - 01:48

న్యూఢిల్లీ, మార్చి 22: ఇటీవలి సార్క్ సమావేశాల్లో ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా నియంత్రణకు సభ్య దేశాలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సందర్భంగా సార్క్ విపత్తుల నిర్వహణా కేంద్రం ఆదివారం కరోనా వైరస్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

03/23/2020 - 01:47

బెరంపూర్ (పశ్చిమ బెంగాల్), మార్చి 22: యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దేశంలోనే అత్యధిక కేసులు కేరళలో నమోదుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇజారుల్ సీక్ (30) అనే నిరుపేద వ్యక్తి ఉపాధి కోసం కేరళకు వెళ్లి జీవనోపాధి పొందుతున్నాడు.

03/23/2020 - 01:46

ముంబయి, మార్చి 22: దేశ వాణిజ్య రాజధాని ముంబయి ఆదివారం ఏడారిని తలపించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన పిలుపునకు ముంబయి ప్రజలు అనూహ్యంగా స్పందించారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ఎప్పుడు జనసమ్మర్ధంతో ఉండే ముంబయిలోని అనేక ప్రాంతాలు ప్రజల సందడి లేక నిశ్శబ్దం రాజ్యమేలింది.

03/23/2020 - 01:44

న్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటి క్యాంపస్ బయట గల ఖాళీగా ఉన్న ‘నిరసన ప్రదేశం’పైకి ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో పాటు పెట్రోల్ బాంబు విసిరాడు. యూనివర్శిటి అధికారులు, విద్యార్థులు ఈ విషయం తెలిపారు.

03/23/2020 - 06:46

వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన్ని సకాలంలో ప్రపంచ దేశాలతో పంచుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఒకవేళ చైనా కరోనా వైరస్ గురించి ముందే హెచ్చరించి ఉంటే, అమెరికా, ప్రపంచం ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇంకా బాగా సిద్ధమయి ఉండేవని ఆయన పేర్కొన్నారు.

03/23/2020 - 06:45

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కరోనా మహమ్మారిపై త్వరగా విజయం సాధించాలని భారత్‌లో చైనా రాయబారి సన్ వెయిడాంగ్ ఆదివారం ఆకాంక్షించారు. ‘కోవిడ్-19కు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధంలో తమ సేవలు అందించిన వారికి అభినందనలు.

03/23/2020 - 06:48

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) సోకిన రోగులకు చికిత్స చేసేందుకు అన్ని రాష్ట్రాలూ నిర్ధిష్ట సంఖ్యలో ప్రత్యేకంగా ఆసుపత్రులను కేటాయించనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం దేశ ప్రజలు పెద్ద ఎత్తున జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

03/23/2020 - 01:41

ముంబయి, మార్చి 22: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిగా కట్టడి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. సోమవారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆదివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఐదుగురికి మించి గుమిగూడ వద్దని ఆయన సూచించారు.

03/23/2020 - 01:35

న్యూఢిల్లీ, మార్చి 22: ప్రాణాంతక కరోనాపై పోరాడుతున్న యోధులకు యావత్ భారతం చప్పట్లు, తాళాలతో ఘనంగా అభినందనలు తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సాయంత్రం 5 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు యావత్ భారతం కోటాను కోట్ల మంది చప్పట్లతో మార్మోగింది. ఎవరికి తోచిన రీతిలో వారు దేశ వైద్య సిబ్బందికి, అత్యవసర సేవలందిస్తున్న వారికి స్పూర్తినందించే రీతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Pages