S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2016 - 08:14

హైదరాబాద్, నవంబర్ 24: ఎస్సీ, బిసిలకు మాదిరిగానే ఇకపై ఎస్టీ విద్యార్థులకు కూడా పోస్టు మెట్రిక్ హాస్టళ్ల నెలవారిగా నిర్వహణ ఖర్చులను చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై గురువారం ముఖ్యమంత్రి సంతకం చేశారు. క్యాంపు కార్యాలయం కొత్త భవనంలోకి గృహ ప్రవేశం చేశాక ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకం ఈ ఫైలుపైనే కావడం విశేషం.

11/25/2016 - 07:45

హైదరాబాద్, నవంబర్ 24: కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, డాక్టర్ జిగ్నేష్‌రెడ్డిల వివాహం గురువారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, పలువురు మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బిజెపి నేతలు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

11/25/2016 - 07:42

విజయవాడ, నవంబర్ 24: తిరుపతి, కృష్ణపట్నం, శ్రీ సిటీలను ట్రైసిటీగా అభివృద్ధి చేసి మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం రాత్రి సిఎంఓలో తనను కలిసిన ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ బృందంతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి యూనిట్లను తెరిచే సెల్యులర్ కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలిస్తామని అన్నారు.

11/25/2016 - 07:37

హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కరెన్సీ నోట్ల సమస్య పరిష్కారానికి తక్షణమే ఐదువేల కోట్ల రూపాయల చిన్ననోట్లను పంపించాలని కేంద్రాన్ని కోరామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇక్కడి ఎస్‌బిహెచ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 13వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ, 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం మంచిదేనని అన్నారు.

11/25/2016 - 07:33

హైదరాబాద్, నవంబర్ 24: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్ బస్తా 230 రూపాలయలకు ఇచ్చే విధంగా హౌజింగ్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. 32 సిమెంట్ కంపెనీలు, హౌసింగ్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం జరిగింది. మూడు సంవత్సరాల వరకు బస్తా సిమెంట్‌ను 230కి అమ్మేందుకు కంపెనీలు సమ్మతించాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

11/25/2016 - 07:31

విజయవాడ, నవంబర్ 24: పెద్దనోట్ల రద్దుతో ఈ వారం పది రోజుల్లోనే రూ.17కోట్ల నష్టం వచ్చిన నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం, చిల్లర సమస్యను అధిగమించేందుకు దశల వారీగా అన్ని బస్ స్టేషన్‌లలో స్వైపింగ్ మిషన్లను ప్రవేశపెట్టనున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. స్థానిక పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో గురువారం ఆయన లాంఛనంగా ఈ స్వైపింగ్ మిషన్‌ను ప్రారంభించారు.

11/25/2016 - 07:29

విజయవాడ, నవంబర్ 24: సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకోవాలని, లేకపోతే అది పెరుగుతుందే తప్ప తగ్గదని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే పరిష్కారం సులువు అవుతుందని స్పష్టం చేశారు. ‘‘మన రాష్ట్ర మహిళా శక్తిని రుజువు చేసే సమయం, అవకాశం వచ్చాయి...

11/25/2016 - 07:15

హైదరాబాద్, నవంబర్ 24: ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయం ‘ప్రగతి భవన్’ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం చేసే వేదికగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు.

11/25/2016 - 07:12

న్యూఢిల్లీ, నవంబర్ 24: పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనాన్ని పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని, అలాగే, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పన్నులు ఎగవేత ద్వారా పేరుకు పోయిన నిధులనూ రూపుమాపవచ్చునని కేంద్రం గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది.

11/25/2016 - 07:10

హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్రీయ పోలీస్ సంస్థల అధిపతుల 51వ వార్షిక సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమిలో మూడు రోజులపాటు జరుగునున్న సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు.

Pages