S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 23:19

అల్లాదుర్గం, నవంబర్ 21: అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామంలో 13 మందికి అతిసార వ్యాధి సోకి అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. కొందరు సంగారెడ్డి, మరికొందరు హైదరాబాద్, పెద్దశంకరంపేట, మరొకరు అల్లాదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలివెళ్లారు. రాంపూర్ గ్రామానికి చెందిన తిప్పల కిష్టయ్యకు అతిసార వ్యాధి సోకడంతో అల్లాదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు.

11/21/2016 - 23:19

సిద్దిపేట, నవంబర్ 21 : ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన దరఖాస్తులను 30రోజులకు మించి ఉన్న దరఖాస్తులను ఈనెల 24లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం జెసి హన్మంత్‌రావు, ఇతర అధికారులతో కలసి ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు.

11/21/2016 - 23:18

శివ్వంపేట, నవంబర్ 21: ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి రైతు మృతి చెందిన సంఘటన శివ్వంపేట మండలంలోని పెద్దగొట్టిముక్కుల గ్రామంలో సోమవారం జరిగింది. కుటుంభ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి గుండం నాగేష్(28) అనే రైతు తన పొలంలో విద్యుత్ వైర్లు తెగి ఉండటంతో ఆ వైర్లు తగిలి మృతి చెందాడు. మృతుని భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌నాయక్ తెలిపారు.

11/21/2016 - 23:18

నారాయణఖేడ్ నవంబర్ 21: గత ఉప ఎన్నికలకు ముందు చేసిన వివిధ అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆ పనులు చేసిన టిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.

11/21/2016 - 23:17

మెదక్, నవంబర్ 21: మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి వికలాంగుల క్రీడాపోటీలను మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి సోమవారం ప్రారంభించారు. మెదక్ స్టేడియంలో ప్రవేశించిన జిల్లా కలెక్టర్‌కు వికలాంగులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఎవరైతే పుష్పగుచ్చాలు ఇచ్చారో ఆ పుష్పగుచ్చాలను వికలాంగులకు అందజేసి జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి వికలాంగులకు శుభాకాంక్షలు తెలిపారు.

11/21/2016 - 23:15

వికటించిన విధికి ఇది మరో విషాద సాక్ష్యం.. ఇది ప్రాకృతిక బీభత్సం కాదు, మానవ మహాపరాధం కాదు! అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బిహార్ రాజధాని పాట్నాకు వెళుతున్న రైలు ప్రయాణీకులలో 143 మంది అకాల మృత్యువునకు ఆహుతి అయిపోయారు. కాళమృత్యు కరాళ దంష్టల్రు కరకరమని నమిలిన చప్పుళ్లు దేశవ్యాప్తంగా జన హృదయ సీమలలో ప్రకంపనాలను సృష్టిస్తున్నాయి, గుండెలను పిండి చేస్తున్నాయి.

11/21/2016 - 23:11

హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు చికిత్స కోసం వచ్చే రోగులను వివిధ పరీక్షల పేరుతో భయకంపితులను చేసి జలగల్లా పీడిస్తున్నాయి. చిన్నపాటి జబ్బు చేసినా ప్రైవేటు ఆస్పత్రి మెట్లెక్కితే చాలు దోపిడీ కథ ప్రారంభమవుతుంది. రోగి నుండి పూర్తి సమాచారం సేకరించకుండానే ముందుగా ఫలానా పరీక్షలు చేయించుకుంటేనే వ్యాధి నిర్థారణ చేస్తామని వైద్యులు చెబుతుంటారు.

11/21/2016 - 23:10

పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటు ఉభయసభల్లో అర్థవంతమైన చర్చ జరిపి పరిష్కార మార్గాలను సూచించటంలో అధికార, ప్రతిపక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇరుపక్షాలు ఈ వ్యవహారాన్ని తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాయే తప్ప ప్రజల ఇబ్బందులు, వాటి నివారణకు అనుసరించవలసిన మార్గాలపై దృష్టి కేంద్రీకరించలేకపోయాయి.

11/21/2016 - 23:08

చదువు, ఉద్యోగం గురించి ఆలోచించాల్సిన వయసులో కొంతమంది యు వకులు దారి తప్పుతున్నారు. కన్నవారి కలలను సాకారం చేయాల్సిన విద్యార్థులకు నేడు ఇంటాబయట సరైన దిశానిర్దేశం లభించడం లేదు. చదువు, నైతిక విలువలు, బాధ్యతలు వంటి అంశాలపై ఇటు ఇంట్లోగాని, అటు కళాశాలల్లో గానీ యువతకు సూచనలిచ్చేవారు కరవవుతున్నారు.

11/21/2016 - 23:06

మారీచుడు బంగారులేడి రూపంలో వచ్చి సీతమ్మవారిని భ్రమింపజేసినట్లే స్వతంత్ర భారతంలో రాజకీయవేత్తలు, సినీనటులు, నిర్మాతలు, చైనా, పాకిస్తాన్ దేశాలు కలిసి ‘నల్లజింక’ను ప్రవేశపెట్టి మనల్ని భ్రమింపజేశారు. నల్లధనంపై ప్రధాని మోదీ యుద్ధం ప్రకటించాక ఎందుకోగాని కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాయావతి వంటి విపక్షనేతలు అసహనం ప్రకటిస్తున్నారు. అనగనగా యుపిలో ములాయం సింగ్ అనే ఆధునిక దశరథుడు.. ఆయనకు ఇద్దరు భార్యలు..

Pages