S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 04:31

డోర్నకల్, సెప్టెంబర్ 24: ముంబయ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎస్ 12 బొగీ వద్ద రైలు చక్రాల నుంచి పొగలు రావడాన్ని గమనించిన గార్ల గెట్‌మెన్ వెంటనే విషయాన్ని వరంగల్ జిల్లా డోర్నకల్ ఆర్‌ఆర్‌ఐ మాస్టర్‌కు సమాచారం ఇవ్వడంతో డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.

09/25/2016 - 04:30

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించి, వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ‘గల్ఫ్ తెలంగాణ సంస్థ’ప్రతినిధి బసంతరెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం నాడు ఢిల్లీలో బంసంతరెడ్డి విలేఖరులతో మాట్లాడారు. ఏజెంట్ల మోసాలతో, వీసా సమస్యలతో ఇరాక్‌లోని ఏరిబిల్ ప్రాంతంలో రెండు రాష్ట్రాలకు చెందినవారు చిక్కుకున్నారని చెప్పారు.

09/25/2016 - 04:29

పాపన్నపేట, సెప్టెంబర్ 24: ఏడుపాయల ఘణపురం ప్రాజెక్ట్‌లో మంజీరా పొంగిపొర్లుతూ పరవళ్లు తొక్కుతుంది. పరీవాహక ప్రాంతంలో పుష్కలంగా వర్షాలు కురియడం, సింగూర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా నీరు విడుదల అవడంతో ఘణపురం ప్రాజెక్ట్‌పై నుంచి ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ముందునుంచి ప్రమాద స్థాయిలో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీ ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

09/25/2016 - 04:20

కర్నూలు, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పార్టీ బలాబలాలపై సర్వే చేయించుకుంటున్నాయి. ప్రజల నాడి తెలుసుకునేందుకు అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైకాపాతో పాటు గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీ సైతం సర్వే చేయిస్తోంది. ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించి ప్రజాభిప్రాయం ఎలాఉందో తెలుసుకునే ప్రయత్నంలో అన్ని రాజకీయపక్షాలు నిమగ్నమయ్యాయి.

09/25/2016 - 04:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామంటూ టిడిపి, బిజెపిలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఏపి కాంగ్రెస్ నేతలు శనివారం నాడు ఢిల్లీలో ఆయన నివాసంలో సమావేశమయ్యారు.

09/25/2016 - 04:13

గుంటూరు, సెప్టెంబర్ 24: భారీ వర్షాలు, వరదలు గుంటూరు జిల్లాను అతలాకుతలం చేశాయి. వందలాది కుటుంబాలు నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో మగ్గుతున్నారు. ఇళ్లలో ఇంకా నీరు నిలిచే ఉండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వరద ఉద్ధృతికి ధాన్యం, సామగ్రి, దుస్తులు కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే పునరావాస కేంద్రాల్లో అరకొరగా అందుతున్న భోజనంతో అర్ధాకలితో గడుపుతున్నారు.

09/25/2016 - 04:11

విజయవాడ, సెప్టెంబర్ 24: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటు కొనసాగుతోంది. మూడోరోజైన శనివారం కూడా బ్యారేజీకి చెందిన మొత్తం 70 గేట్లు ఎత్తివేశారు. వీటిల్లో 40 గేట్లను 3 అడుగుల మేర, 30 గేట్లను 4 అడుగుల మేర పైకి ఎత్తి లక్షా 60వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

09/25/2016 - 04:09

ఖమ్మం, సెప్టెంబర్ 24: ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కినె్నరసాని, తాలిపేరు ప్రాజెక్టులు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని లంకాసాగర్, మసి వాగులతో పాటు పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి.

09/25/2016 - 04:08

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: గోదావరి జిల్లాల్లో గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శనివారం తగ్గుముఖం పట్టాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా పొలాలు మాత్రం నీటితో నిండిపోయి వున్నాయి. నీటి కుంటలుగా మారిన పొలాల్లోంచి నీరు తగ్గితే తప్ప రైతుల్లో ఆందోళన తప్పని పరిస్థితి నెలకొంది.

09/25/2016 - 04:08

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: అఖండ గోదావరి నదిలో పెరిగిపోయిన ఇసుక దిబ్బలను, పెరుగుమేటలను తొలగించి ఇసుక పూడిక తీసే పనులు ఎట్టకేలకు మొదలుకానున్నాయి. ఈ నెలాఖరున గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు.

Pages