S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 11:23

రియో డి జనీరో : భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మారకానా స్టేడియంలో 31వ ఒలింపిక్స్‌ క్రీడా వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 6 వేల మంది కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అభినవ్‌ బింద్రా ఆరంభోత్సవంలో జాతీయ జెండాతో భారత బృందానికి నాయకత్వం వహించాడు. ఈసారి భారత్‌ నుంచి రికార్డు స్థాయిలో 118 మంది ఒలింపిక్స్‌ బరిలోకి దిగుతున్నారు.

08/06/2016 - 11:17

రియో డి జెనీరో: ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలనతో రియోలోని మారకానా స్టేడియంలో విశ్వ క్రీడా పోటీలకు అంకురార్పణ జరిగింది. దాదాపు 12,000 మంది క్రీడాకారుల చేతులు మారి వచ్చిన టార్చ్‌ను మారథాన్‌ రన్నర్‌ వాన్డెర్లీ కార్డిరో డి లిమా చేతికి అందించారు. జ్యోతిని వెలిగించారు. అనంతరం అథ్లెట్లు ఒలింపిక్‌ గ్రామానికి చేరుకున్నారు.

08/06/2016 - 11:14

ముంబయి : ముంబయి-గోవా రహదారిపై మహద్‌ వద్ద వంతెన కూలిన ఘటనలో 22 మంది మృతదేహాలను వెలికితీశారు. వంతెన కూలిపోయిన సంయంలో రెండు బస్సులు, పలు వాహనాలు నదిలోకి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 మంది నదిలో గల్లంతవ్వగా, ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

08/06/2016 - 08:25

రియో డి జెనీరో, ఆగస్టు 5: గతంలో ఎన్నడూ లేని విధంగా వందకుపైగా సభ్యులతో కూడిన భారత బృందం పతకాలపై భారీ అంచనాతో రియో ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నది. స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు ఇవే చివరి ఒలింపిక్స్ కావడంతో అందరి దృష్టి అతనిపై కేంద్రీకృతమైంది. ప్రారంభ వేడుకల కవాతులో భారత బృందానికి నాయకత్వం వహించిన 38 ఏళ్ల బింద్రా రియో ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్తున్నట్టు ఇది వరకే ప్రకటించాడు.

08/06/2016 - 08:23

ఆర్చరీ: అతాను దాస్ (పురుషుల ఇండివిజువల్), బొంబాల్యా దేవి, దీపికా కుమారి, లక్ష్మీరాణి మజీ (మహిళల ఇండివిజువల్), దీపికా కుమారి, బొంబాల్యా దేవి, లక్ష్మీరాణి మజీ (మహిళల టీం ఈవెంట్).

08/06/2016 - 08:22

రియో డి జెనీరో, ఆగస్టు 5: రియో ఒలింపిక్స్‌లో సాకర్ పోరు ఆరంభమైంది. పోటీలకు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్‌తో తొలి మ్యాచ్‌లో పోటీపడిన దక్షిణాఫ్రికా చక్కటి ప్రతిభ కనబరచింది. గోల్స్ చేయడానికి ప్రయత్నించకుండా పూర్తి రక్షణ విధానాన్ని అనుసరించిన ఈ జట్టు బలమైన బ్రెజిల్‌ను నిలువరించి మ్యాచ్‌ని డ్రా చేసుకోగలిగింది.

08/06/2016 - 08:22

రియో డి జెనీరో, ఆగస్టు 5: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎనిమిది పతకాలు లభిస్తాయని ‘ఒలింపిక్స్, ఎకనామిక్స్ రిపోర్ట్’ నివేదిక అంచనా వేసింది. వీటిలో ఒకటి స్వర్ణమని జోస్యం చెప్పింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జితూ రాయ్, టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో సానియా మీర్జా, రోహన్ బొపన్న జోడీ పతకాలు సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.

08/06/2016 - 08:21

రియో డి జెనీరో, ఆగస్టు 5: రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తున్న మరకానా స్టేడియం స్టార్ అట్రాక్షన్‌గా నిలిచింది. దశాబ్దకాలంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నది. ఈవెంట్ నిర్వాహణ ఎలావున్నా, ప్రారంభం అదిరిపోతే, ఆతర్వాత విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది నిర్వాహకుల అభిప్రాయం. రియోలోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది.

08/06/2016 - 08:17

న్యూఢిల్లీ, ఆగస్టు 5: రాబోయే ఐదేళ్లకుగాను ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నూతన ద్రవ్యవిధాన సంస్కరణలో భాగంగా ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కూడా కొత్తగా నిర్ణయించింది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

08/06/2016 - 08:15

మనీలా, ఆగస్టు 5: రిజల్ కమర్షియల్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఆర్‌సిబిసి)పై ఫిలిప్పీన్స్ సెంట్రల్ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. మునుపె న్నడూ లేనివిధంగా ఏకంగా 21 మిలియన్ డాలర్ల (ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే భారత కరెన్సీ ప్రకారం దాదాపు 140 కోట్ల రూపాయలు) జరిమానా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ బ్యాంక్ నుంచి హ్యాకర్లు కొట్టేసిన సొమ్ము ఆర్‌సిబిసి ద్వారా బదిలీ కావడమే దీనికి కారణం.

Pages