S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 07:41

న్యూఢిల్లీ, ఆగస్టు 5: వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రుల్లో 34శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, సగటున 8.59కోట్లతో 76శాతం మంది కోటీశ్వరులున్నారని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. 29 రాష్ట్రాల అసెంబ్లీలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 620మంది మంత్రుల్లో 609మందిపై ఈ సర్వే జరిగింది.

08/06/2016 - 07:40

విశాఖపట్నం, ఆగస్టు 5: ‘విమానం అదృశ్యమై రెండు వారాలు అవుతోంది. సముద్రంలో శోధన పేరుతో ఏం జరుగుతుందో కనీస సమాచారాన్ని కూడా అధికారులు చెప్పడం లేదు. ఇది ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం. అత్యాధునిక పరిజ్ఞానాన్ని దశల వారీగా కాకుండా ఒకేసారి ఉపయోగించి జాడ కనుక్కోండి. మావాళ్లను సురక్షితంగా తిరిగి అప్పగించండి.

08/06/2016 - 07:36

గద్వాల, ఆగస్టు 5: ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తున్నామని చెబుతుండగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం రేవులపల్లి పుష్కరఘాట్ వద్ద కొట్టొచ్చినట్టు కన్పించింది. రేవులపల్లి గ్రామం కృష్ణానది సమీపంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్ వద్ద భక్తులకు 40 తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేశారు.

08/06/2016 - 07:35

జిన్నారం, ఆగస్టు 5: ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై పెట్రోల్‌పోసి నిప్పంటిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గురువారం ఈ ఘటన మెదక్ జిల్లా పరిధిలోని బొల్లారంలో జరిగిన విష యం తెలిసిందే. కాగా ఘట నలో క్షతగాత్రులైన బాధి తులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందు తుండగా తండ్రి సుంకయ్య (42), కుమారుడు వీరేష్ (5) శుక్రవారం మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి.

08/06/2016 - 07:34

నల్లగొండ, ఆగస్టు 5: తెలంగాణ జాగృతి బహుముఖ లక్ష్య సాధనలో స్వరాష్ట్ర సాధన తొలి అడుగు మాత్రమేనని, రాష్ట్రాన్ని దేశంలో అన్నింటా అగ్రగామిగా నిలపడమే జాగృతి అంతిమ లక్ష్యమని సంస్థ అధ్యక్షురాలు, నిజమాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నల్లగొండలో ప్రారంభమైన రెండు రోజుల తెలంగాణ జాగృతి 10వ వార్షికోత్సవ రాష్ట్ర ప్రతినిధుల సభలను ఆమె ప్రారంభించి ప్రసంగించారు.

08/06/2016 - 07:25

టేకులపల్లి, ఆగస్టు 5: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలో శుక్రవారం పోలీసుల సాయంతో ఫారెస్టు అధికారులు దాదాపు 50 ఎకరాల్లో మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి అందులో హరితహారం పేరుతో మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఫారెస్టు బలగాలు మోహరించడంతో ఒడ్డుగూడెం వణికిపోయింది.

08/06/2016 - 07:24

గజ్వేల్, ఆగస్ట్ 5 : ప్రధాని నరేంద్రమోదీ పర్యటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబందాలు బలోపేతమై బంగా రు తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు పడతాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కోమటిబండ వద్ద ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/06/2016 - 07:23

సంగారెడ్డి, ఆగస్టు 5: మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో పర్యటించడానికి వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభకు వెళ్లకుండా సాంఘిక బహిష్కరణ చేసేందుకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు. రెండు నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా జాతీయ రహదారి దిగ్బంధం చేసేందుకు వెళ్లిన నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జి చేసిన విషయం తెలిసిందే.

08/06/2016 - 07:22

కొత్తగూడెం టౌన్, ఆగస్టు 5: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోనేరు నాగేశ్వరరావు (79) గుండెపోటుతో శుక్రవారం ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు. మూడుసార్లు ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోనేరు నాగేశ్వరరావు, ఉమ్మడి రాష్ట్రంలో చిన్నతరహా నీటిపారుదల మంత్రిగా పనిచేశారు.

08/06/2016 - 07:17

భీమవరం, ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఇప్పుడే అడ్డుకోపోతే భవిష్యత్తులో గోదావరి డెల్టా ప్రాంతం ఎడారిగా మారుందని సాగునీటిరంగ నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం వెంటనే ఈ సమస్యపై దృష్టిసారించాలని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండుచేశారు.

Pages