S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 14:00

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని, ఈ విషయమై ఇప్పటికే ఆర్థికమంత్రి జైట్లీ, నీతిఆయోగ్ దృష్టిసారించినట్టు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం ఇక్కడ మీడియాకు తెలిపారు. హోదా విషయమై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందన్నారు.

08/06/2016 - 14:00

అనంతపురం: ఎపి సిఎం చంద్రబాబు శనివారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ధర్మవరంలో చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. ధర్మవరంలో రైల్వేవంతనెను కూడా ఆయన ప్రారంభించారు. మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

08/06/2016 - 12:36

శ్రీశైలం: ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాల్లో నీటిమట్టాలు గురిష్ఠస్థాయికి చేరుతుండటంతో నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. 24గంటల వ్యవధిలో జలాశయంలో నీటిమట్టం 13అడుగుల మేర పెరిగింది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,54,629 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరిచుకుంది.

08/06/2016 - 12:34

దిల్లీ: లోక్‌సభలో సోమవారం జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టనున్న దృష్ట్యా పార్లమెంట్‌ సమావేశాలకు 8,9,10 తేదీల్లో తప్పనిసరిగా హాజరుకావాలని తెదేపా విప్‌ జారీ చేసింది.

08/06/2016 - 12:32

జమ్మూ: జమ్మూలోని రీసీ జిల్లా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందగా, మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. యాత్రికులు ఆలయ సమీపంలోని 3వగేటు వద్దకు రాగానే- ఒక్కసారిగా కొండ విరిగి పడటంతో నలుగురు మృతి చెందారు. పోలీసులు క్షతగాత్రులను కత్రా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

08/06/2016 - 11:47

శ్రీకాకుళం : 40 మంది ప్రయాణికులతో నాగావళి నదిలో వెళ్తున్న నాటు పడవకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జిల్లాలోని సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద చోటు చేసుకుంది. నాటు పడవ నదిలోని గుర్రపు డొక్కకు చిక్కుకుంది. పడవ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పడవను ఒడ్డుకు తీసుకొచ్చారు. పడవలో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

08/06/2016 - 11:42

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

08/06/2016 - 11:40

రాజమండ్రి: గోదావరి నీటిమట్టం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం నిలకడగా ఉంది. పుష్కరఘాట్ల వద్ద గోదావరి అంత్య పుష్కరాలు ఏడో రోజుకు చేరాయి. దీంతో గోదావరి పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. అంత్యపుష్కరాలతోపాటు శ్రావణమాసం కావడంతో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

08/06/2016 - 11:36

హైదరాబాద్: పంద్రాగస్టు వేడకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.అక్టోపస్ బృందాలు, సీఐఎస్ఎఫ్, ఇతర సాయుధ పోలీసు బలగాలు ఎయిర్‌పోర్టులో మోహరించారు.

08/06/2016 - 11:29

ఫ్రాన్స్‌ : ఉత్తర ఫ్రాన్స్‌లోని రోవన్‌ నగరంలో క్యూబా లిబ్రే బార్‌లో శుక్రవారం అర్థరాత్రి కొందరు బర్త్‌డే పార్టీ చేసుకుంటుండగా మంటలు చెలరేగి 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు.

Pages