S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 03:23

కొత్తగూడెం టౌన్, ఆగస్టు 5: తెలుగుదేశం పార్టీ కురువృద్ధుడు, మాజీమంత్రి కోనేరు నాగేశ్వరరావు(79) శుక్రవారం మృతిచెందారు. కొత్తగూడెంలోని తన స్వగృహంలో స్నానానికి వెళ్ళిన సమయంలో బాత్‌రూంలో స్పృహకోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సమాచారం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హుటాహుటీన కోనేరు స్వగృహానికి చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

08/06/2016 - 03:22

ఖమ్మం, ఆగస్టు 5: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగులు బడ్జెట్‌తో కెసిఆర్ కుటుంబానికే న్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ దనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు. రైతు రుణాల మాఫీ, ప్రజా సమస్యల పరిష్కారం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.

08/06/2016 - 03:21

కొత్తగూడెం, ఆగస్టు 5: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పివికె-5ఇంక్లైన్ భూగర్భ గనిలో శుక్రవారం మొదటిషిప్ట్ నుండి బొగ్గు ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. గతనెల 11వ తేదీన భూగర్భ గనిలోని 91వ లెవల్, 86వ లెవల్స్ మధ్య ఉన్న సెక్షనలైజ్డ్ ఏరియాలో బొగ్గు ఫైర్ అవ్వడంతో అగ్నిప్రమాదం జరిగి ఉత్పత్తి నిలిచిపోయింది.

08/06/2016 - 03:21

కారేపల్లి/ ఇల్లెందు ఆగస్టు 5: కారేపల్లి మండలంలోని సీతారాంపురం పంచాయతీ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

08/06/2016 - 03:20

టేకులపల్లి, ఆగస్టు5: టేకులపల్లి మండలం భారీగా పోలీసు, ఫారెస్టుబలగాలు మోహరించడంతో ఒడ్డుగూడెం వణికిపోయింది. గిరిజన రైతులను గ్రామాల నుండి పోడు భూముల వద్దకు రాకుండా బెదిరించి కేసులు పెడతామని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అన్ని దారులు వెంట పోలీసులు మోహరించడంతో రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. పది ట్రాక్టర్లతో సుమారు యాభై ఎకరాలు మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారు.

08/06/2016 - 03:20

ముదిగొండ, ఆగస్టు 5: నర్సరీల్లో మొక్కలు మిగలకుండా చూడాలని అధికారులను జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ దివ్య ఆదేశించారు. మండల కేంద్రమైన ముదిగొండతో పాటు వెంకటాపురం గ్రామాల్లోని వన నర్సరీలను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు ఇంత ఎత్తు ఎదిగే వరకు పంపిణీ చేయకుండా నర్సరీల్లోనే ఎందుకు ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

08/06/2016 - 03:19

ఖమ్మం(జమ్మిబండ), ఆగస్టు 5: పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు జరుగుతున్న అభ్యర్థుల ఎంపికలకు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిఎస్పీలు 8, సిఐలు 20, ఎస్‌ఐలు 36, ఏఎస్‌ఐలు 13మంది, కానిస్టేబుళ్ళు 90, మహిళా కానిస్టేబుల్స్ 20, హోంగార్డులు 90మందితో విధులు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు జరుగుతున్న ఇవెంట్స్‌లో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

08/06/2016 - 03:19

ఖమ్మం(కల్చరల్), ఆగస్టు 5: అమరజీవి బోడెపూడి వెంకటేశ్వరరావు అలుపెరుగని పోరాట యోధుడని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు పేర్కోన్నారు. స్థానిక సుందరయ్యభవన్‌లో శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఆర్‌ప్రకాష్ అధ్యక్షతన బోడెపూడి 19వ వర్ధంతి సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిధిగా పోతినేని హాజరై బోడెపూడి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

08/06/2016 - 03:19

ఎర్రుపాలెం: పేద కుటుంబంలో పుట్టి ఉద్యమాలు చేసి అతికొద్ది కాలంలోనే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని రైతు బాంధవుడిగా ప్రజల గుండెల్లో నిలిచిన దివంగత బోడెపూడి వెంకటేశ్వరరావుకి ఎర్రుపాలెంలో ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం ఆయన 19వ వర్థంతి వేడుకలను ఎర్రుపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున ప్రదర్శన, ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోతినేని సుదర్శన్ పాల్గొని మాట్లాడారు.

08/06/2016 - 03:18

వైరా, ఆగస్టు 5: పంటపొలాల్లో విద్యుత్ మోటార్లకు లైన్లు కోసం విద్యుత్ స్తంభాల ఏర్పాట్లలో భా గంగా పనిచేస్తున్న వ్యక్తికి విద్యుత్‌షాక్ తగిలి చనిపోయిన సంఘటన శుక్రవారం జరిగింది.

Pages