S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 03:36

బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 5: రేబాల పంచాయతీ పరిధిలో గల రాఘవ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్విన్నర్‌గా పనిచేస్తున్న జక్కల శ్రీను హత్యకేసులో నలుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సిఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం నిందితులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు.

08/06/2016 - 03:35

నెల్లూరు లీగల్, ఆగస్టు 5: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. దీంతో కోర్టులో కేసులు విచారణ జరగక వాయిదాలు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల న్యాయవాదుల సమాఖ్య పిలుపు మేరకు ఈ కోర్టు విధుల బహిష్కరణ జరిగింది. బార్ అసోసియషన్ జనరల్ సెక్రటరీ జి బాలసుహ్మ్రణ్యం కార్యక్రమాలను పర్యవేక్షించారు.

08/06/2016 - 03:34

నెల్లూరు కలెక్టరేట్, ఆగస్టు 5: జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు వాటి వినియోగంపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడిఒలు, ఎపిఒలతో శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవం సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

08/06/2016 - 03:34

గూడూరుటౌన్, ఆగస్టు 5: గూడూరు పూలతోటలో నివాసం ఉంటున్న పెల్లేటి కుమారిని 2008వ సంవత్సరంలో ఆమె భర్త సురేష్ హత్యచేసినట్టు మృతురాలి తల్లి కేసు పెట్టింది. ఈ కేసుపై శుక్రవారం గూడూరు జిల్లా అదనపు కోర్టులో తీర్పు వెలువడింది. ముద్దాయి సురేష్ హత్య చేసినట్టు రుజువు కావడంతో జిల్లా అదనపు జడ్జి గురప్ప యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్టు తీర్పు చెప్పారు. శిక్షతో పాటు 15 వందల రూపాయల జరిమానా కూడా విధించారు.

08/06/2016 - 03:34

సూళ్లూరుపేట, ఆగస్టు 5: చెంగాళమ్మ ఆలయంలో శ్రావణమాస తొలి శుక్రవారం కావడంతో అమ్మవారికి పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాల మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి వివిధ రకాల పుష్పాల తెచ్చి వైభవంగా యాగాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన నంబూరు మోహన్‌రావు. సులోచన ఉభయకర్తలుగా వ్యవహరించారు.

08/06/2016 - 03:33

వెంకటాచలం, ఆగస్టు 5 : వెంకటాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పి పార్వతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యాబోధన, రికార్డులు, మధ్యాహ్న భోజనం తదితర వాటిని ఆమె పరిశీలించారు.

08/06/2016 - 03:33

నెల్లూరు కలెక్టరేట్, ఆగస్టు 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాసాధికార సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెలాఖరులోగా నూరుశాతం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఆదేశించారు. బోగోలు మండలం కోవూరుపల్లి అంబేద్కర్ కాలనీలో శుక్రవారం ప్రజా సాధికార సర్వే పనితీరును ఆయన పరిశీలించారు.

08/06/2016 - 03:32

ఉదయగిరి, ఆగస్టు 5: ప్రత్యేక హోదా సంతరించుకుంటేనే రాష్ట్రం ప్రగతి బాటలో పయణించగలదని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 130 సంవత్సరాల చరిత్ర గల మహా వృక్షం తమ పార్టీ అన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు దిక్కెవరూ లేరని విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.

08/06/2016 - 03:31

కర్నూలు సిటీ, ఆగస్టు 5:కృష్ణా పుష్కర పనుల్లో నాణ్యత లోపిస్తే టెండర్ రద్దు చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవన్‌లో శుక్రవారం జడ్పీ చైర్మన్ రాజశేఖర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

08/06/2016 - 03:30

కర్నూలు, ఆగస్టు 5 : శ్రీశైలం జలాశయం నీటి మట్టం 854 అడుగుల మేర నిర్వహించాల్సిందేనని, అంతకంటే తగ్గితే ఎట్టి పరిస్థితుల్లో దిగువకు నీరు విడుదల చేయవద్దని కర్నూలు జిల్లా పరిషత్ తీర్మానించింది. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

Pages