S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 03:12

మంగళగిరి, ఆగస్టు 5: పట్టణంలోని హోటళ్లు, స్వీట్‌షాపులు, తినుబండారాలు అమ్మే దుకాణాల్లో శుక్రవారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఆహార నియంత్రణా అధికారులు తనిఖీ నిర్వహించారు. నాణ్యతలేని తినుబండారాలను స్వాధీనం చేసుకుని రోడ్డుపై పడవేసి ధ్వంసంచేశారు. నాణ్యతలేని తినుబండారాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని దుకాణాల యజమానులను హెచ్చరించారు.

08/06/2016 - 03:11

చేబ్రోలు, ఆగస్టు 5: కృష్ణా, పశ్చిమ డెల్టాలో మేజర్ చానల్‌గా ఉన్న అప్పాపురం చానల్ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. సాగు, మంచినీటికి ఉద్దేశించిన ఈ చానల్‌లోకి వివిధ కంపెనీలు, మిల్లులు, ఇంజనీరింగ్ కళాశాలల నుండి వచ్చే వ్యర్థపు మురుగునీటిని పైపుల ద్వారా కాల్వలోకి వదలడంతో అప్పాపురం చానల్ నీరు పూర్తిగా కలుషితమై రంగుమారింది.

08/06/2016 - 03:03

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 5: జాతీయ రహదారి పనులు జాప్యం కారణంగా ఇబ్రహీంపట్నం హెచ్‌పి పెట్రోలు బంక్ వద్ద కేబుల్ మరమ్మతుల కారణంగా గత 7 రోజులుగా ఫోన్లు, ఇంటర్‌నెట్ సౌకర్యం లేక వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

08/06/2016 - 03:02

మచిలీపట్నం, ఆగస్టు 5: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చేనేత రుణాలు నేడు మాఫీ కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన చేనేత రుణమాఫీ హామీ నేడు కార్యరూపం దాల్చనుంది. చేనేత కార్మికులు అధికంగా ఉన్న అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత రుణమాఫీకి శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా చేనేత రుణమాఫీ లబ్ధిదారులకు మాఫీ పత్రాలను అందచేయనున్నారు.

08/06/2016 - 03:01

నూజివీడు, ఆగస్టు 5:పోలవరం కాలువకు పడిన గండి పనులు వేగవంతంగా నిర్వహించాలని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. గండి పడిన ప్రాంతంలో పూర్తిగా నీటిని తొలగించి శుక్రవారం కాంక్రీట్ పనులు ప్రారంభించారు. వీటిని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు.

08/06/2016 - 03:01

మచిలీపట్నం, ఆగస్టు 5: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు విమర్శించారు. ప్రత్యేక హోదా కోరుతూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కోనేరు టరులో ఒక రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.

08/06/2016 - 03:00

మచిలీపట్నం, ఆగస్టు 5: గత కొంత కాలంగా రాజకీయ తెర మరుగున ఉన్న మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమయ్యారు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో నామ్‌కే వాస్తే అన్న చందాన కొనసాగుతున్న వేదవ్యాస్ మరికొద్ది రోజుల్లో అధికార పార్టీ పక్షాన చేరేందుకు సంసిద్ధమవుతున్నారు. వేదవ్యాస్ టిడిపిలో చేరిక విషయమై గత కొంత కాలంగా సందిగ్ధత నెలకొంది.

08/06/2016 - 03:00

గుడివాడ, ఆగస్టు 5: గుడివాడ పట్టణంలోని పలు సినిమా థియేటర్లలో టికెట్ల మాయాజాలంపై ప్రత్యేక దృష్టిసారించామని, ఇటీవల విడుదలైన సర్దార్ గబ్బర్‌సింగ్, సరైనోడు వంటి చిత్రాలకు సంబంధించిన టికెట్ల విక్రయాలపై నామమాత్రంగా పన్నులు చెల్లించడాన్ని గుర్తించామని, ఇకపై అలా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టినట్టు గుడివాడ సిటివో పి జయశంకర్ చెప్పారు.

08/06/2016 - 02:59

అవనిగడ్డ, ఆగస్టు 5: మండల పరిధిలోని తుంగలవారిపాలెంలో అర్జా గోపాలం, శేషగిరికి చెందిన రాతి గోడల ఇల్లు శుక్రవారం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఇంట్లో వారంతా గ్రామంలో నిర్వహిస్తున్న సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండగా సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.35 వేలు నగదు, లక్ష రూపాయలు విలువ చేసే బంగారం, విలువైన పత్రాలు ప్రమాదంలో దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు.

08/06/2016 - 02:59

అవనిగడ్డ, ఆగస్టు 5: మండల పరిధిలోని వేకనూరులో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, శ్రీ చక్ర, కుంకుమార్చన జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చక స్వామి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.

Pages