S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 03:17

గుంటూరు, ఆగస్టు 5: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు చెన్నై- హైదరాబాద్- విశాఖ జాతీయ రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలంగాణ ప్రాంతంలో పొందుగల వద్ద వాహనాల రాకపోకలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్రాంతానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందున ఎగువన హైదరాబాద్- గుంటూరు మార్గంలో వాహనాలను అనుమతించరు.

08/06/2016 - 03:16

గుంటూరు, ఆగస్టు 5: వ్యవసాయోత్పత్తులపై అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి, దిగుమతులకు సంబంధించి విదేశీ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అనంతపురంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (రైతు ఉత్పత్తిదార్ల సంస్థ)ను ప్రారంభిస్తారు.

08/06/2016 - 03:15

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 5: రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి హోదాపైనే ఆధారపడి ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా, విభజన చట్టంలోని హామీల సాధనకై సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహారదీక్షను శుక్రవారం చేపట్టారు.

08/06/2016 - 03:15

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 5: దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం బృందావన గార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

08/06/2016 - 03:14

అచ్చంపేట, ఆగస్టు 5: కృష్ణా, పుష్కరాల సందర్భంగా ఈనెల 12 నుంచి 24వ తేదీ వరకు మండలంలో వ్యాపించియున్న కృష్ణారేవుపై అనుమతులు లేకుండా పడవలు, బల్లకట్టు సర్వీసులను నడపవద్దని సత్తెనపల్లి గ్రామీణ సిఐ కోటేశ్వరరావు శుక్రవారం యజమానులకు సూచించారు. మాదిపాడు వద్ద పడవ, బల్లకట్టు సర్వీసు, గింజుపల్లి రేవు పడవ, తాడువాయి రేవు పడవల యజమానులకు ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీచేశారు.

08/06/2016 - 03:14

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 5: ఈనెల 12వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాలపై ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశాన్ని శుక్రవారం ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ తిక్కన కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు.

08/06/2016 - 03:14

తాడేపల్లి, ఆగస్టు 5: రాష్ట్ర నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం సీతానగరం పుష్కరఘాట్‌లు పరిశీలించారు. కేవలం రెండు రోజుల్లో పుష్కర పనులు పూర్తవ్వాలని, ఏడవ తేదీకి పుష్కర పనులు పూర్తిచేయాలని, ఇతర ఏర్పాట్లు మరొక రెండు రోజుల్లో ముగించుకుని, 9వ తేదీ నాటికి ఘాట్‌లు సంపూర్ణంగా స్నానాలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

08/06/2016 - 03:13

గుంటూరు (స్పోర్ట్స్), ఆగస్టు 5: ఇటీవల బదిలీపై గుంటూరు నూతన జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన బి శ్రీనివాసరావు క్రీడల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానన్నారు. శుక్రవారం స్థానిక బిఆర్ స్టేడియంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జి శేషయ్య, సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు.

08/06/2016 - 03:13

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 5: గుంటూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా బోనబోయిన శ్రీనివాసయాదవ్ పదవీ బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు. బ్రాడీపేట మెయిన్‌బ్రాంచ్ నందు గత ఛైర్మన్ కొత్తమాసు శ్రీనివాసరావు పదవి ముగియడంతో శ్రీనివాసయాదవ్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

08/06/2016 - 03:12

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 5: ప్రత్యేకహోదా ఇస్తామని రాష్ట్రంలో ప్రచారం నిర్వహించిన బిజెపి ఆ మాటను నిలబెట్టుకోకుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని నవ్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు ఎ అయ్యస్వామి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలో ప్రత్యేక హోదా కోరుతూ రోడ్లపై ప్రజలకు పూలు పంచుతూ నిరసన వ్యక్తంచేశారు.

Pages