S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

,
07/06/2016 - 00:36

మదనపల్లె, జూలై 5: రికార్డుస్థాయలో టమోటా దిగుబడి వచ్చింది. మదనపల్లె మార్కెట్‌ను రైతులు టమోటాతో ముంచెత్తారు. అయతే ఆరుగాలం కష్టించి పండించిన టమోటాలను అమ్ముకునేందుకు మార్కెట్‌కు తరలిస్తే రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుకు ఇరువైపులా టమోటా వాహనాలతో రైతులు నిరీక్షిస్తున్నారు. టమోటా కోతలయ్యాక ఏ రోజుకు ఆ రోజు వెంటనే మార్కెట్‌లో అమ్మకాలు చేయాల్సి ఉంటుంది.

07/06/2016 - 00:09

మెల్‌బోర్న్, జూలై 5: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎన్నికల కమిషనర్ నజీమ్ జైదీ స్పష్టం చేశారు. అయితే ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు తీసుకురావాలని, అదే విధంగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని పాదుకొల్పాలని స్పష్టం చేశారు.

07/06/2016 - 05:04

న్యూఢిల్లీ, జూలై 5: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన రాజకీయ నేపథ్యం, ఓబిసి మూలాలు కలిగిన అనుప్రియ పట్టేల్ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉందా? ప్రధాని మోదీకి విధేయురాలిగా భావిస్తున్న అనుప్రియ అప్నాదళ్ టికెట్‌పై మీర్జాపూర్ నుంచి ఘన విజయం సాధించారు.

07/06/2016 - 00:04

న్యూఢిల్లీ, జూలై 5: రాజకీయంగా ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అప్పగించే ఎలాంటి బాధ్యతనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయన్న సంకేతాల నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత చేకూరింది.

07/06/2016 - 00:02

న్యూఢిల్లీ, జూలై 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన మంత్రివర్గం విస్తరణను కాంగ్రెస్ పార్టీ విమర్శలతో ముంచెత్తింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఏఐసిసి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రెండు మూడు నెలల నుండి చర్చనీయాంశంగా మారిన మంత్రివర్గం విస్తరణ తుస్సుమనిపించిందని అన్నారు.

07/06/2016 - 00:02

న్యూఢిల్లీ, జూలై 5: బొంబాయి, మద్రాసు హైకోర్టుల పేర్లు మారనున్నాయి. మారిన నగరాల పేర్లకు అనుగుణంగా ఈ హైకోర్టుల పేర్లను మార్చాలనే డిమాండ్ చాలాకాలంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్లకు అనుగుణంగా బాంబే హైకోర్టును ముంబయి హైకోర్టుగా, మద్రాసు హైకోర్టు పేరును చెన్నై హైకోర్టుగా మార్చాలని మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

07/06/2016 - 00:57

న్యూఢిల్లీ, జూలై 5: అవినీతి కేసులో సోమవారం అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ను, మరో నలుగురిని స్థానిక ప్రత్యేక కోర్టు మంగళవారం అయిదు రోజులు సిబిఐ కస్టడీకి అప్పగించింది.

07/06/2016 - 01:07

హోస్టన్, జూలై 5: రోదసి ప్రయోగాల పరంపరలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చరిత్ర సృష్టించింది. నాసా ప్రయోగించిన జునో రోదసి నౌక భూమి నుంచి అయిదు సంవత్సరాల పాటు ప్రయాణించి విజయవంతంగా గురుగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. గ్రహాలకు రాజుగా, సౌరమండలంలో అత్యంత కీలకమైన గురుగ్రహ కక్ష్యలోకి భూమి నుంచి ఒక రోదసి నౌక ప్రవేశించగలగటం అంతరిక్ష పరిశోధనల్లో అతి పెద్ద ముందడుగుగా శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.

07/05/2016 - 23:59

సంగారెడ్డి టౌన్, జూలై 5: జిల్లాలోని వెనకబడిన తరగతుల వసతి గృహాల్లో ప్రవేశాలు పెంచేందుకు కృషి చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజెసి మాట్లాడుతూ వసతి గృహాల్లో ప్రవేశాలు పెంచాలని, ఇందుకు గాను అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు.

07/05/2016 - 23:58

మెదక్, జూలై 5: గోపాలమిత్ర నెలసరి గౌరవ వేతనం చాలా తక్కువగా ఉన్నందున విధులకు రావడం లేదని జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ జి.లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం నాడు లక్ష్మారెడ్డి అధ్యక్షతన హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్ ప్రారంభించారు. ఆ తరువాత వారిరువురు మొక్కలు నాటారు.

Pages