S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 23:51

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 5: విద్యాహక్కు చట్టాన్ని ఆమలు చేయాలని ప్రైవేటు పాఠశాలల ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు 25శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎబివిపి విద్యార్థులు డిఇఓ కార్యాలయాన్ని ముట్టడించారు. డి ఇ ఓ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.

07/05/2016 - 23:50

ఆమనగల్లు, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను బహుళజాతి కంపెనీల కోసం బలవంతంగా సాగులోకి తీసుకోవడాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు.

07/05/2016 - 23:50

నాగర్‌కర్నూల్, జూలై 5: ఎంజికెఎల్‌ఐ పథకంలోని 28వ ప్యాకేజి కింద చేసిన కాలువ పనులను మంగళవారం రాష్ట్ర మంత్రులు జూపల్లికృష్ణారావు, సి.లక్ష్మారెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆల వేంకటేశ్వరరెడ్డిలు పరిశీలించారు.

07/05/2016 - 23:49

మహబూబ్‌నగర్, జూలై 5: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రైతులను భయపెట్టించి బలవంతంగా భూములు తీసుకుంటున్నారని ప్రధానంగా టిఆర్‌ఎస్ నాయకులు దళారులుగా మారి రైతుల పొట్టకొడుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ ఆరోపించారు.

07/05/2016 - 23:48

వనపర్తి, జూలై 5: అనుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగామని, ఇక పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి మండలం మెంటెపల్లి గ్రామంలో జరిగిన నియోజవకవర్గ స్థాయి టి ఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

07/05/2016 - 23:48

జడ్చర్ల, జూలై 5: 44వ జాతీయ రహాదారిపై కర్నూల్ నుండి హైదబాద్ వెళ్తున్న రెండు డిసిఎంలు ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం జడ్చర్ల మండల పరిధిలోని బూరెడ్డిపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.

07/05/2016 - 23:47

మహబూబ్‌నగర్, జూలై 5: ఎన్నికల్లో పోలింగ్ జరగకుండా గ్రామ ప్రజలంతా ఏకమై గ్రామపంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటే అందుకు ప్రభుత్వం ప్రొత్సహకంగా నిధులను ఇవ్వనుంది. అయితే 2013 జూలైలో మూడు విడతలుగా జిల్లాలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1330 గ్రామపంచాయతీలకు గాను అందులో 91 గ్రామపంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

07/05/2016 - 23:45

జగిత్యాలటౌన్, జూలై 5: మండలంలోని తాటిపెల్లికి చెందిన ఆకుల గంగారెడ్డి (40) అనే రైతు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. మృతునికి ఉన్న 4ఎకరాల వ్యవసాయ భూమిలో దాదాపు 12 బోర్లు వేసాడని, దీంతో 12లక్షల అప్పు అయ్యిందని భార్య రాధ తెలిపింది. కాగా మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

07/05/2016 - 23:45

మెట్‌పల్లిరూరల్, జూలై 5: ప్రహరీ గోడ విషయమై కుల పెద్దలు చెప్పిన పంచాయితీ తీర్పును ధిక్కరించాడని ఏడాదిన్నర కాలంగా కుల పెద్దలు కుల బహిష్కరణ పాల్పడిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది. జగిత్యాల డివిజన్ మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

07/05/2016 - 23:44

పెద్దపల్లి, జూలై 5: పెద్దపల్లి ఆర్‌డిఓగా పనిచేస్తున్న సి.నారాయణరెడ్డిని నల్లగొండ జిల్లా సూర్యపేట ఆర్‌డిఓగా ప్రభుత్వం బదిలీ చేసింది. రంగారెడ్డి అర్బన్ జిల్లాలో భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న ఆర్‌డిఓ అశోక్‌కుమార్‌ను పెద్దపల్లి ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Pages