S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 23:58

దౌల్తాబాద్, జూలై 5 : మండలపరిదిలోని మొండిచింత వద్ద ఉన్న టెక్నో గురుకుల పాఠశాల నాలుగు రోజుల క్రితం మూతబడిన విషయం తెలిసిందే. దీంతో డిప్యూటీ డిఇఒ శ్యాంసుందర్‌రెడ్డి మంగళవారం పాఠశాలను సందర్శించారు. రికార్డులన్నింటినీ స్వాదీనం చేసుకున్నారు. రెండు రోజుల్లో యాజమాన్యం తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ఆదేశించారు. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

07/05/2016 - 23:57

మెదక్ రూరల్, జూలై 5: ఉగ్రవాద చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు నిజామాబాద్ రేంజీ డిఐజి అకున్ సబర్వాల్ తెలిపారు. మంగళవారం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీచేశారు. రికార్డులు పరిశీలించారు. చట్టాన్ని ఎవరుకూడా తమ చేతుల్లోకి తీసుకోరాదన్నారు. అనవసర గొడవలతో కేసులు పెట్టుకోరాదని సూచించారు. డిఎస్‌పి నాగరాజు, సిఐ రామకృష్ణ, ఎస్‌ఐలు సంతోష్, హన్మంతులున్నారు.

07/05/2016 - 23:57

నర్సాపూర్,జూలై 5: నర్సాపూర్-గుమ్మడిదల మద్యగల దట్టమైన అటవీ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని బ్లాక్ మైలింగ్‌కు పాల్పడుతున్న పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

07/05/2016 - 23:56

సంగారెడ్డి టౌన్, జూలై 5: ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో హరితహారంలో పాల్గొని ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటి పర్యావణ పరిరక్షణకు పాటుపడాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పిలుపునిచ్చారు. ఈ నెల 8నుండి 22వరకు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

07/05/2016 - 23:56

కొండపాక, జూలై 5: మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, 2013చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని టిజెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. మంగళవారం మండలంలోని ఎర్రవల్లిలో భూనిర్వాసితులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. 2013చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇస్తేనే సరైన న్యాయం జరుగుతుందన్నారు. 123జిఓతో నిర్వాసితులకు నష్టం కలుగుతుందన్నారు.

07/05/2016 - 23:55

మెదక్, జూలై 5: నిజామాబాద్ రేంజి డిఐజి అకుల్ సబర్వాల్ మెదక్ రూరల్, మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్లను మంగళవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వివిధ దేశాల్లో ఉగ్రవాదుల సమస్య తీవ్రంగా ఉందని, ఉగ్రవాదులు హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం ఉందని, ఈ క్రమంలో ఇంటల్‌జెన్సీ నిఘా పకడ్బందీగా ఏర్పాటైందని ఆయన వివరించారు.

07/05/2016 - 23:55

మెదక్ రూరల్, జూలై 5: శిశువును విక్రయించారన్న సమాచారం అందుకున్న ఐసిడిఎస్, ఐసిపిఎస్ అధికారులు మంగళవారం శిశువిహార్‌కు తరలించారు. స్థానిక ఐసిడిఎస్ సూపర్‌వైజర్ వింద్యావాహిని కథనం ప్రకారం మండలంలోని వాడి పంచాయతీపరిధిలోని మెట్టుగడ్డ తండాకు చెందిన స్రవంతి, గణేష్‌లకు ఇద్దరు కుమార్తెలున్నారు.

07/05/2016 - 23:54

సిద్దిపేట, జూలై 5 : ప్రభుత్వ భూములపై పేదలకు హక్కులు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ జివో 58, 59 తీసుకొచ్చిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. పేదలు 120 గజాల వరకు జివో 58 ద్వారా అందచేసిందని, ప్రభుత్వ ఇళ్ల స్థలాల్లో నిర్మించుకున్నవారికి జివో 59 ద్వారా క్రమబద్ధీకరించి హక్కులు కల్పించనున్నట్లు వెల్లడించారు.

07/05/2016 - 23:52

నాగర్‌కర్నూల్, జూలై 5: కొంతమంది పనిగట్టుకొని జిల్లా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాగే మున్ముందు జరిగితే జిల్లా రైతాంగం తిరగబడి తరిమికొడుతారనే విషయాన్ని గుర్తించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

07/05/2016 - 23:51

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 5: మహబూబ్‌నగర్ మండల పరిధిలోని బోయపల్లి గ్రామంలో రూ.40లక్షల వ్యయంతో చేపట్టిన మిషన్ కాకతీయ చెరువు పునరుద్దరణ పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువు పనుల్లో కూలీలకు ఉపాధి దొరుకుతుందని అన్నారు.

Pages