S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/28/2016 - 02:34

నిర్మల్, మే 27: రాష్ట్ర దేవాదాయ,గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నివాసంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మినారాయణ హృదయసైత రుతశత చంఢీయాగం శుక్రవారం రెండవ రోజుకు చేరుకుంది.

05/28/2016 - 02:33

కెరమెరి, మే 27: ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపి గెడెం నగేష్ అన్నారు. శుక్రవారం కెరమెరి మండలంలోని జోడేఘాట్ గ్రామాన్ని సందర్శించి అక్కడ నిర్మిస్తున్న పర్యాటక కేంద్రం పనులను పరిశీలించారు. అనంతరం బాబేఝరీ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

05/28/2016 - 02:33

ఆదిలాబాద్, మే 27: రాబోయే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు జూన్ మొదటి వారం నుండి మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలు నియమిస్తామని ఆ పార్టీ జిల్లా నూతన ఇంచార్జి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జిల్లా కాంగ్రెస్ నేతలతో శుక్రవారం సమావేశమై పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

05/28/2016 - 02:32

ఇచ్చోడ, మే 27: అడెగాంకె ప్రాజెక్టు కింద కాలువల నిర్మాణాని మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.2కోట్ల 8లక్షల నిధులు మంజూరు కావడంతో కాలువల పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు దశాబ్దకాలం కింద జిలయజ్ఞంలో రూ.2కోట్ల 83లక్షలు మంజూరు చేసి నిర్మించారు.

05/28/2016 - 02:32

దివ్యనగర్, మే 27: పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఎడ్‌సెట్) ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని ఐదు కేంద్రాల్లో పరీక్షను ఉదయం 11గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించారు.

05/28/2016 - 02:31

కుంటాల, మే 27: పుడమితల్లినే నమ్ముకున్న రైతులకు ప్రతీయేట పుట్టెడు కష్టాలు ఎదురవుతున్న ప్రతీ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఎంతో ఆశతో ముందుకెళ్లి పంట పొలాల్లో పనులతో బిజీ బిజీగా కనిపిస్తున్నారు.

05/28/2016 - 02:31

ఆదిలాబాద్ టౌన్, మే 27: ప్రభుత్వం విద్యాసంస్కరణల పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకోడం సరైందికాదని, ప్రస్తుత విద్యారంగంలో కామన్ స్కూల్ విధానాన్ని అమలుపర్చి అందరికి సమాన విద్యను అందించాలని డిటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

05/28/2016 - 02:30

ఆదిలాబాద్ టౌన్, మే 27: బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న చేపట్టే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐజీఈటీవోఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అలోక్‌కుమార్, బి.బాబురావులు తెలిపారు. గత మూడు రోజుల నుండి బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరహార దీక్షలను శుక్రవారం విరమించుకున్నారు.

05/28/2016 - 02:30

ఆదిలాబాద్, మే 27: పోలీసులు తమ బాధ్యతలను విస్మరించకుండా టీం వర్క్, అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు వీలుపడుతుందని, విధుల్లో తేడా వస్తేమాత్రం సహించేదిలేదని కొత్త ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్పీగా తరుణ్ జోషి నుండి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆ తర్వాత పోలీసు అధికారులతో సమావేశమై తన అభిప్రాయాలను ఎస్పీ నిర్మోహమాటంగా వెల్లడించారు.

05/28/2016 - 02:29

ఆదిలాబాద్, మే 27: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరు బావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటిలో ఓ మరుగుదొడ్డి, ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని, వాతావరణ సమతుల్యత కోసం తప్పనిసరిగా ప్రజలు మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ మండలం అనుకుంట గ్రామంలో రూ.

Pages