S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/28/2016 - 01:16

సంగారెడ్డి టౌన్, మే 27: జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 28న ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు సిఈఓ వర్షిణి తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ రాజమణి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సభ్యులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.

05/28/2016 - 01:15

మెదక్ రూరల్, మే 27: గ్యాస్ కనెక్షన్‌లు మంజూరైనవారు పది రోజుల్లో తీసుకోకపోతే రద్దు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి హెచ్చరించారు. లబ్ధిదారుల ఇళ్లకు మంజూరు పత్రంతోపాటు తీసుకోకపోతే రద్దుచేస్తామని తెలుపుతూ నోటీసులు అతికించాలని ఎంపిడిఓలు, తహశీల్దార్లను ఆదేశించారు.

05/28/2016 - 01:15

జిన్నారం, మే 27: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, 5 ఎకరాల బైనామాతో ఉన్న భూములను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖామంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని జిన్నారం, అన్నారంకు 8కోట్ల 60లక్షలతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి శంకుస్దాపన చేశారు.

05/28/2016 - 01:14

అల్లాదుర్గం, మే 27: అల్లాదుర్గం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సాక్షర భారత్ కేంద్రం కొనసాగడం లేదని ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుండి ఎప్పుడు కూడా ఏ నలుగురికి విద్య నేర్పడం లేదని, సాక్షర భారత్ కేంద్రం పేరుతో నెలనెల వేతనాలు పొందుతున్నారే తప్పా ఈ కేంద్రంలో నిరక్షరాస్యులకు బోధన చేయడం పలువురు ఆరోపించారు.

05/28/2016 - 01:14

సంగారెడ్డి టౌన్, మే 27: తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సారధి కళాకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వీటిపై ప్రజలకు కళారూపాల ద్వారా అవగాహాన కల్పించాలన్నారు.

05/28/2016 - 01:13

సంగారెడ్డి టౌన్, మే 27: హైదరాబాద్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్‌కు నిజామాబాద్, మెదక్ రేంజ్ డిఐజిగా ప్రభుత్వం అధనపుబాధ్యతలు అప్పగించిన మేరకు శుక్రవారం నాడాయన బాధ్యతలు తీసుకున్నారు. 2001 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన అకున్ సబర్వాల్ ఆల్ ఇండియాలో 33వ ర్యాంకు సాధించి 2004 సంవత్సరంలో మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వచ్చారు. వచ్చిరాగానే అనంతపూర్ జిల్లా ఎఎస్పీగా విధులు నిర్వహించారు.

05/28/2016 - 01:10

దేవరకద్ర, మే 27: రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థను నష్టాల నుండి లాభాల్లోకి తీసుకువస్తామని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం దేవరకద్ర పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నూతనంగా ఏడు బస్సులను మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రస్తుతం రూ.220 కోట్ల అప్పుల్లో ఉందన్నారు.

05/28/2016 - 01:10

షాద్‌నగర్, మే 27: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌కాకతీయ పనులను మొక్కుబడిగా చేపడితే సహించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులోని చెరువులో మిషన్‌కాకతీయ పనులను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు.

05/28/2016 - 01:09

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడటం తరచూ ప్రమాద హేతువులవుతున్నాయి. ద్విచక్రవాహనాలు మొదలుకొని భారీ వాహనాలవరకూ డ్రైవింగ్ చేసే వారు డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం వల్ల పరధ్యానంతో ఎదురుగా వస్తున్న వాహనాలను, పాదచారులను గమనించక ఢీ కొడుతున్నారు. ఫలితంగా వారికివారే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే గాక అమాయకులనూ బలి తీసుకుంటున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

05/28/2016 - 01:09

ఊట్కూర్, మే 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వీనియోగం చేసుకోవాలని చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ వెంకటమ్మ అధ్యక్షతన నిర్వహించిన దీపం పథకం కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరై డ్వాక్రా మహిళలకు సిలిండర్లు పంపిణి చేశారు.

Pages