S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 07:21

దేవరకొండ, మే 17: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మడ్‌మడ్‌క గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బతండాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఆడుకునేందుకు తండా సమీపంలోని మైనంపల్లి వాగులోని ఇసుక గుంతలోకి దిగిన ఇస్లావత్ పవన్ (7), ఇస్లావత్ సిద్దు (7) అనే ఇద్దరు చిన్నారులు ఇసుకదిబ్బలు కూలిపడడంతో సజీవసమాధి అయ్యారు. తండాకు సమీపంలోని వాగులో ఇసుక తవ్వేందుకు వెళ్ళిన లక్ష్మాకు భోజనం ఇచ్చేందుకు వెళ్ళారు.

05/18/2016 - 07:20

హైదరాబాద్, మే 17: తెలంగాణలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేస్తోన్న దీక్షపై టిఆర్‌ఎస్ భగ్గుమంది. టిఆర్‌ఎస్ అధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా జగన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది.

05/18/2016 - 07:19

నల్లగొండ, మే 17: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మించ తలపెట్టిన 4,400 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతుల దిశగా ఈ నెల 31న ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధమైంది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన టివోఆర్ (టర్మ్ ఆఫ్ రిఫరెన్స్) అనుమతులను గతంలోనే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల బృందం అనుమతినిచ్చింది.

05/18/2016 - 07:19

శేరిలింగంపల్లి, మే 17: జిహెచ్‌ఎంసి చందానగర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఓ క్రికెట్ కోచ్ లైంగిక వేధింపులు వెలుగుచూశాయి. యువ క్రికెటర్లను బెదిరించి అసహజ సెక్స్‌కు పాల్పడుతూ దొరికిపోయాడు. కోచ్ వేధింపులను పోలీసుల దృష్టికి బాధిత క్రీడాకారులు, తల్లిదండ్రులు తీసుకెళ్లడంతో బండారం బయటపడింది. చందానగర్‌లోని పిజెఆర్ స్టేడియంలో బార్కాస్‌కు చెందిన సలామ్‌బిన్ (32) నాలుగేళ్లుగా క్రికెట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

05/18/2016 - 07:12

శ్రీకాకుళం, మే 17: తుది దశకు ‘అణువు’ చేరుకుంటోంది. ప్రతిష్ఠాత్మకంగా భారత-అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జి.ఇ.కంపెనీ, వెస్టింగ్‌హౌస్ పర్యవేక్షణతో శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. పది వేల మెగావాట్ల సామర్థ్యంతో లక్ష కోట్ల రూపాయలతో దీనిని నిర్మిస్తున్నారు.

05/18/2016 - 07:12

కర్నూలు, మే 17 : రాష్ట్రంలో కరవును తలపై పెట్టుకుని తిరిగే నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక్కరే అని, బాబు వస్తే జాబు రాదు కానీ కరవు మాత్రం శరవేగంగా వస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు.

05/18/2016 - 07:11

గుంటూరు, మే 17: రాజధాని అమరావతి నగరంలో జోన్లకు సీఆర్డీయే కసరత్తు జరుపుతోంది. సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ప్రకారం నివాసాలు, వాణిజ్య, వ్యాపార భవనాల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నిర్దిష్టమైన అనుమతులు తప్పనిసరి చేశారు. ఈనెల 20వ తేదీతో రైతుల ప్లాట్ల పంపిణీ ప్రక్రియపై అభ్యంతరాల గడువు పూర్తవుతుంది. నెలాఖరులోగా భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రారంభించాలని సీఆర్డియే భావిస్తోంది.

05/18/2016 - 07:10

పోలవరం, మే 17: పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తికావాలంటే పక్కా ప్రణాళిక అవసరమని కేంద్ర జలవనరుల సంఘం (సిడబ్ల్యుసి) మాజీ ఛైర్మన్ ఎపి పాండ్య అన్నారు. సిడబ్ల్యుసి మాజీ సభ్యులు వైబి పాండా, డిపి భార్గవ్, పోలవరం అథారిటీ కార్యదర్శి ఆర్కె గుప్తతో కలిసి మంగళవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు.

05/18/2016 - 07:09

కర్నూలు, మే 17 : కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టులేనని ఏపి ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలులో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమైనవని తేల్చేందుకు తమ వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని, అవసరమైన సమయంలో వాటిని కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు.

05/18/2016 - 07:02

హైదరాబాద్, మే 17: ఆర్థిక వ్యవస్థకు వెనె్నముకగా నిలిచే గ్రామీణ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని, గ్రామీణ ప్రజల బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అసోచామ్ కోరింది. 11 రాష్ట్రాల్లోని 265 జిల్లాల్లో 33 కోట్ల మంది ప్రజలు కరవు కోరల్లో చిక్కుకున్నారని, రూ. 6.50 లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ అతలాకుతలమైందన్నారు.

Pages