S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 06:10

ఆదిలాబాద్, మే 17: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ కేంద్ర అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి సిఆర్‌పిఎఫ్ బేస్‌క్యాంపుపై మావోయిస్టులు తెగబడిన ఘటనలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సిఆర్‌పిఎఫ్ జవాను మృతిచెందాడు. సుమారు 20మంది నక్సలైట్లు బేస్ క్యాంపును టార్గెట్ చేసి కాల్పులకు తెగబడటంతో, సెంట్రీ విధుల్లోవున్న బోథ్ మండలం మర్లపెల్లికి చెందిన గొడిసెల సతీష్ గౌడ్ (23) మృతిచెందాడు.

05/18/2016 - 06:07

న్యూఢిల్లీ, మే 17: ఫిబ్రవరి 9వ తేదీన ప్రతిష్ఠాత్మకమైన జవహర్‌లాల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకులు కన్హయ్యకుమార్ బృందం దేశ ద్రోహ నినాదాలు చేసిన మాట వాస్తవమేనని స్పష్టమైంది.

05/18/2016 - 06:06

హైదరాబాద్, మే 17: మాలేగావ్, అజ్మీర్, మక్కా మసీదు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల వెనుక సంఘ్‌పరివార్ హస్తం ఉన్నదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్‌ఐఎ (నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ)చే దర్యాప్తు జరిపించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

05/18/2016 - 06:04

హైదరాబాద్, మే 17: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమబద్ధీకరించిన ఉద్యోగులకు నియామక ఉత్తర్వులను జూన్ 2న జరుగనున్న తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేదికపై లాంఛనప్రాయంగా సిఎం చేతులు మీదుగా అందించాలని నిర్ణయించింది.

05/18/2016 - 05:23

ప్రత్యేక ప్యాకేజీ అనేదేదీ అడగ లేదు. రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరాను.. ఇది వారి బాధ్యత. విభజన సమయంలో సమ న్యాయం చేసి ఉంటే తాను ప్రతిసారి ఢిల్లీకి వచ్చి ఇలా అడుక్కోవలసిన అవసరం ఉండేది కాదు.

05/18/2016 - 05:20

న్యూఢిల్లీ,మే 17: రాజ్యసభకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఒక సీటును బిజెపికి కేటాయించే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు మంగళవారం విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్నకు బదులిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి లభించే మూడు రాజ్యసభ సీట్లలో నుండి ఒక సీటును బిజెపికి ఇస్తారా?

05/18/2016 - 05:19

న్యూఢిల్లీ, మే 17: మెడికల్, డెంటల్ కాలేజిల్లో ప్రవేశాలకు ‘నీట్’ను ఏకైక ప్రవేశపరీక్షగా చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏడాదిపాటు వాయిదా వేయడానికి ఒక ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలియజేశాయి. సుప్రీంకోర్టు తీర్పు అమలును 12 నెలల పాటు వాయిదా వేయడానికి ఆర్డినెన్స్‌ను తీసుకు రావాలని కేంద్రం యోచిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి.

05/18/2016 - 05:18

ముదురుపాకాన కృష్ణా జలాల వివాదం
నీటి విడుదలలో కృష్ణా బోర్డు జోక్యం
సాగర్‌నుంచి 1.4 టిఎంసి విడుదలకు ఆదేశం
ఉద్దేశపూర్వకంగానే ఆర్డీఎస్ పనులకు అడ్డు
పనులు ఆపేయాలని కర్నాటకకు ఏపి లేఖ
వైఖరి మారకపోతే పులిచింతలకు ఇబ్బందులు
ఏపి సర్కార్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ ధ్వజం
ఆరోపణలు అవాస్తవమన్న ఏపి మంత్రి దేవినేని

05/18/2016 - 05:13

హైదరాబాద్, మే 17: ‘ప్రత్యేక హోదా కావాలని ప్రధానిని కోరాను’ ‘అయినా హోదా వస్తే ఏం వస్తుందండి? హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభమండి’? ‘హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏమి అభివృద్ధి చెందాయండి’?- ఇవన్నీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వేర్వేరు సందర్భాల్లో చేసిన పొంతన లేని వ్యాఖ్యలనుకుంటే, తప్పులో కాలేసినట్లే. ప్రత్యేక హోదాపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలివి.

05/18/2016 - 05:11

విజయవాడ, మే 17: గడచిన రెండేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న డిఎస్సీ 2014 అభ్యర్థుల కలలు ఎట్టకేలకు నెరవేరబోతున్నాయి. సుమారు 10,300 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం జరిగిన డిఎస్సీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు 2015 జూన్ 2వ తేదీ విడుదలయ్యాయి. కోర్టు వివాదాలతో నియామకాల ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. దీనిపై అభ్యర్థులు రెండేళ్లుగా ఆందోళన చేస్తూ వచ్చారు.

Pages