S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 07:35

హైదరాబాద్, మే 17: అమెరికా, కెనెడాలో ఆకర్షణీయమైన వేతనంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆన్‌లైన్‌లో నిరుద్యోగులను మోసం చేసే నలుగురు ఘరానా సైబర్ నేరగాళ్ల గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. జేమ్స్ మార్టిన్, క్రిస్ట్ఫోర్ అనే ఇద్దరు నైజీరియన్లు, మిజోరంకు చెందిన లాల్చనామి అనే యువతి, ఎమాన్యూల్ లాల్తియాంగ్లిమా అనే వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

05/18/2016 - 07:35

హైదరాబాద్, మే 17: అన్ని సబ్జెక్టుల వారికీ అనువుగా ఉన్న టీచర్సు ఎలిజిబిలిటీ టెస్టు (టెట్) బయాలజీ విద్యార్థులకు మాత్రం అనువుగా లేదని, పరీక్ష విధానంలో మార్పులు చేయాలని టెట్ అభ్యర్ధులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉపాధ్యాయుల నియామకాలు భారీగా జరుగుతాయని ఆస్తున్న తమకు ఈ పరీక్ష ప్యాటర్న్ కలవరాన్ని కలిగిస్తోందని వారు చెబుతున్నారు.

05/18/2016 - 07:31

హైదరాబాద్, మే 17: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కెజిబివికి చెందిన బధిర విద్యార్థిని నాగలక్ష్మి పదో తరగతిలో జిపిఎ 10కి 10 సాధించిన నేపథ్యంలో ఆమె ఉన్నత చదువులకు రాష్ట్రప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం ఆయన నాగలక్ష్మిని ఘనంగా సత్కరించారు.

05/18/2016 - 07:30

విశాఖపట్నం(క్రైం), మే 17: ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావుపై సద్గురు రమణానంద మహర్షి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అతని శిష్యుడు పిఎస్ నారాయణ ఫిర్యాదు మేరకు ఇక్కడి నాలుగో పట్టణ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదు వివరాలివి. ఈనెల ఐదో తేదీ రాత్రి 9గంటల సమయంలో ఓ భక్తి ఛానల్‌లో నగరానికి చెందిన సద్గురు రమణానందమహర్షి ఆధ్యాత్మిక ప్రసంగం ఇచ్చారు.

05/18/2016 - 07:30

న్యూయార్క్, మే 17: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ అభ్యర్థిగా దాదాపు ఖరారైన డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో గెలిస్తే అమెరికాకు ప్రమాదమని ఆయన ప్రత్యర్థి డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ విదేశీ వ్యవహారాల సలహాదారు జేక్ సల్లివాన్ అన్నారు. ట్రంప్‌కు ఉన్న తొందరపాటుతనం.. దూకుడుతనం అమెరికా కమాండర్ ఇన్ చీఫ్‌గా ఎన్నికైతే ప్రపంచాన్ని అణ్వాయుధాల పోటీలోకి నెడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

05/18/2016 - 07:29

న్యూఢిల్లీ, మే 17: ఫిబ్రవరి 9వ తేదీన ప్రతిష్ఠాత్మకమైన జవహర్‌లాల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకులు కన్హయ్యకుమార్ బృందం దేశ ద్రోహ నినాదాలు చేసిన మాట వాస్తవమేనని స్పష్టమైంది.

05/18/2016 - 07:29

కాకినాడ, మే 17: తన కుమార్తె అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తామని బెదిరిస్తున్న నిందితులపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఒక ప్రజాప్రతినిధి అనుచరులకు, తనకు మధ్య గల భూవివాదాల కారణంగా తనపై ఈ విధంగా కక్ష గట్టినట్టు ఆయన పేర్కొన్నారు.

05/18/2016 - 07:28

వేపగుంట, మే 17: అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యల సంయుక్తంగా ఈనెల 22న విజయవాడలో నిర్వహిస్తున్న ‘విప్రోత్సవం’ మహాసభకు బ్రాహ్మణులందరూ తరలిరావాలని విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన విశాఖనగర పరిధి, చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు.

05/18/2016 - 07:27

దుబాయ్, మే 17: అమెరికా అ ధ్యక్ష పదవి నుంచి త్వరలో వైదొలగనున్న బరాక్ హుస్సేన్ ఒబామా ఇస్లామ్ మతం గురించి సరిగా అర్థం చేసుకునేందుకు వీలుగా తన సంస్థలో ఉద్యోగం ఇస్తానని దుబాయ్‌కి చెందిన ఈసా బిన్ హైదర్ అనే న్యాయవాది ప్రకటించాడు.

05/18/2016 - 07:22

మహబూబాబాద్, మే 17: అధికారుల అండతో.. అధికార పార్టీ నాయకుల భరోసాతో అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన వరంగల్ జిల్లా మానుకోటలో మరో సరికొత్త అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. మానుకోట పట్టణంలోని ఓ రైస్‌మిల్లు కేంద్రంగా తప్పుడు వేబిల్‌లు సృష్టించి పేదలకు అందాల్సిన బియ్యాన్ని యధేచ్ఛగా మానుకోట నుండి కాకినాడకు తరలిస్తున్న బడా అక్రమ వ్యాపారం విజిలెన్సు అధికారుల తనిఖీలో పట్టుబడింది.

Pages