S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/06/2016 - 07:59

మచిలీపట్నం: గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి నాగార్జునసాగర్ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీల యాక్షన్ ప్లాన్ తయారీపై శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బందరు డివిజన్‌లోని అధికారులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు.

03/06/2016 - 07:56

కీసర: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం విఘ్నేశ్వర పూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయచైర్మన్ టి.ఉమాపతిశర్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

03/06/2016 - 07:55

హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని దేవాలయాలు, పీఠాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా నగర శివారులోని నాగోలులో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ కాశీవిశే్వశ్వరాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు.

03/06/2016 - 07:54

హైదరాబాద్, మార్చి 5: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న సమన్వయ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై వెంటనే అమలు చేసేందుకు కృషి చేయాలని మహానగర పాలక సంస్థ కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు.

03/06/2016 - 07:53

హైదరాబాద్: ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవటం, ఈ సారి ఎండలు కాస్త ముందుగానే మండిపోవటం వంటి కారణాల నేపథ్యంలో మున్ముందు నగరంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయి. ఎండలు బాగా మండిపోతూ, జంట జలాశయాల్లో నీటి మట్టాలు పూర్తిగా అడుగంటి తరుణంలో నగర ప్రజలకు తాగునీటిని అందించే సింగూరు జలాశయం నుంచి ఈ సారి నీరందే పరిస్థితుల్లేకపోవటంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల అనే్వషణలో ఉన్నారు.

03/06/2016 - 07:52

హైదరాబాద్: స్వరాష్ట్రంలో మొట్టమొదటి సారిగా అక్రమ నిర్మాణాలు, లే అవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ స్కీంలపై అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టింది.

03/06/2016 - 07:45

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి. శనివారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభల సభ్యులనుద్ధేశించి ప్రసంగించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం జరిగింది.

03/06/2016 - 07:44

శ్రీకాళహస్తి: చెన్నైలోని అపోలో ఆసుపత్రి యాజమాన్యం శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెండి సింహ వాహనం విరాళంగా అందజేసింది. అపోలో అధినేత డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి పలుమార్లు ఆలయానికి వచ్చిన సందర్భంగా దేవస్థానం వారు వెండి వాహనాల తయారీపై చర్చించారు. రెండేళ్ల క్రితం వెండి నంది వాహనాన్ని విరాళంగా అందజేశారు. శనివారం 100 కిలోల వెండితో తయారుచేసిన 60 లక్షల విలువైన సింహ వాహనాన్ని ఆలయానికి అందజేశారు.

03/06/2016 - 07:43

హైదరాబాద్, మార్చి 5: ‘కాపు సామాజిక వర్గానికి మీరొక్కరే నాయకుడు కాదు, ఆ భ్రమలోంచి బయటకు రండి. నిజంగా మీరు కాపుల ప్రయోజనాలకు కట్టుబడితే, మీ వైఖరి మార్చుకోండి’ అని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని తెలుగుదేశం అధికార ప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. ఈ మేరకు బోండా బహిరంగ లేఖ రాశారు.

03/06/2016 - 07:41

హైదరాబాద్: చాలరోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయానికి వచ్చారు. ఇంటి వద్దనే పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నేరుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో ముచ్చటించారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహం ముందు నివాళులర్పించారు.

Pages