S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/06/2016 - 21:11

సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తున.. మహేంద్రగిరులపై శివనామస్మరణ హోరెత్తే రోజు వచ్చింది. వయోవృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు ఎంతో భక్తితో ఆ గిరులను ఎక్కి ముక్కంటిని ఆర్తిగా భక్తితో తలచుకుంటారు. తూర్పు కనుమల్లో ముఖ్యమైన మహేంద్ర గిరులపై భారీ రాళ్లతో కట్టిన 3పాండవుల గుడులు2 ఎప్పటికీ ప్రత్యేక ఆకర్షణే.

03/06/2016 - 21:12

శివుడు భక్తసులభుడు. భక్తితో కొలిస్తే ఇట్టే ప్రత్యక్షమై కోరిన కోర్కెలు తీరుస్తాడనికదా అందరి విశ్వాసం. అలానే మహానందిలో నందీశ్వరుడికోసం అక్కడ వెలసిన మహాశివుడి వృత్తాంతం ఆ క్షేత్ర ప్రాభవాన్ని వివరిస్తుంది.

03/06/2016 - 18:22

రాజమహేంద్రవరం: ఏపీకి కేంద్రం సాయం చేయలేదని దుష్ప్రచారం జరుగుతోందని, కేంద్రం ఏవిధంగా సాయం చేస్తోందో తెలిపేందుకే వచ్చానని భాజపా జాతీయ అమిత్‌ షా అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో భాజపా బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్డీయే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గోదావరి తీరాన సంకల్ప ర్యాలీలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు.

03/06/2016 - 18:15

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరునికి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ మరింత పురోగతి సాధించాలని, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీకాళహస్తీశ్వరునని ప్రార్థించానన్నారు.

03/06/2016 - 18:13

హైదరాబాద్‌ : మహిళను వేధించారన్న కేసులో ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌, డ్రైవర్‌ రమేశ్‌లను అరెస్టు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు ఆదివారం తుర్కయాంజాల్‌లోని న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. అంతకుముందు వీరికి ఉస్మానియా ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు జరిపించారు.

03/06/2016 - 18:07

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గడ్‌లోని అమ్‌దాయ్‌ ఘాటి ప్రాంతం వద్ద ఆదివారం నక్సలైట్లు ల్యాండ్‌మైన్‌ పేల్చారు. దీంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. నక్సలైట్లు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులను పట్టుకోవడానికి పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

03/06/2016 - 18:03

మీరట్‌ : ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో ఈవ్‌టీజర్‌ను ఓ మహిళ చితక్కొట్టింది. రోజూ ఆమె ఆఫీసుకు వెళుతుంటే కొంతకాలంగా వేధిస్తున్నాడు. నడిరోడ్డుమీద కొడితే గానీ అతనికి బుద్ధి రాదని నిర్ణయించుకుని అతని చెంప పగలగొట్టింది.

03/06/2016 - 18:01

హైదరాబాద్: వరంగల్, ఖమ్మం కార్ఫొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయితీలో పోలింగ్ ముగిసింది. వరంగల్ కార్ఫొరేషన్‌లో 55 నుంచి 60% మధ్యలో పోలింగ్ శాతం నమోదయ్యింది. ఖమ్మం విషయానికొస్తే 65% పోలింగ్ శాతం నమోదయినట్లు అధికారులు చెబుతున్నారు. అచ్చంపేట నగర పంచాయితీలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యింది. 75% పోలింగ్ నమోదైందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

03/06/2016 - 17:58

హైదరాబాద్: గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఆయన్ను కేసీఆర్ కలిశారు. మార్చి 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల గురించి ఆయన చర్చిస్తారని సమాచారం.

03/06/2016 - 17:49

ఢాకా: ఆదివారం ఆసియా కప్ టోర్నీ ఫైనల్ టి20 మ్యాచ్ జరగనున్న ఢాకా స్టేడియంపై నల్లటి మేఘాలు ఆవరించాయి. ఇప్పటికే రెండు జట్లు స్టేడియంకు చేరుకున్నాయి. భారీ గాలులు వీస్తున్నాయి. వానపడితే తడవకుండా పిచ్‌ను కవర్ చేశారు.

Pages