S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/06/2016 - 07:19

చెన్నై: తమిళనాడులో అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయగీతం కచ్చితంగా ఆలపించాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం అసెంబ్లీ సందర్భంగా జనగణమన గీతం విద్యార్థులతో పాడించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలల్లోనూ జాతీయ గీతాన్ని ఆలపించేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను బెంచ్ విచారించింది.

03/06/2016 - 07:18

బృందావన్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరుపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శలు గుప్పించారు. జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని రాహుల్ పరామర్శించినందుకు ఆ పార్టీ సిగ్గుపడాలని ఆయన అన్నారు. భావస్వేచ్ఛ పేరుతో క్యాంపస్‌ను సందర్శించినందుకు కాంగ్రెస్ ప్రశ్నించాలని షా విజ్ఞప్తి చేశారు.

03/06/2016 - 07:17

బీజింగ్: టిబెట్‌ను దేశంలోని మిగతా భాగాలను అనుసంధానం చేస్తూ రెండో రైలు మార్గాన్ని చైనా నిర్మించనుంది. హిమాలయ ప్రాంతమైన టిబెట్‌కు మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ పెరగడంతో పాటుగా భారత్ సరిహద్దు ప్రాంతాలకు శరవేగంగా సైన్యాలను తరలించడానికి సైతం ఈ రైలుమార్గం ఉపయోగపడుతుంది.

03/06/2016 - 07:16

వాషింగ్టన్: ఓ వైపు భారత్, అమెరికా ప్రజా ప్రతినిధులు తీవ్ర వ్యతిరేకతల నడుమ అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించి అధికారిక ఫెడరల్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

03/06/2016 - 07:15

న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాద దాడులు జరపడానికి 1997లో పాకిస్తానీ, బంగ్లాదేశీ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడడానికి తోడ్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న లష్కరే తోయిబాకు చెందిన బాంబు తయారీ నిపుణుడు అబ్దుల్ కరీమ్ తుండాను, మరో ముగ్గురిని ఆ కేసులో ఢిల్లీ కోర్టు తగిన సాక్ష్యాధారాలు లేవంటూ నిర్దోషిగా విడుదల చేసింది.

03/06/2016 - 07:14

న్యూఢిల్లీ: దేశద్రోహ అభియోగాలను ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను కాల్చి చంపిన వారికి 11 లక్షల రూపాయల రివార్డు అందజేస్తామని ప్రకటిస్తూ సెంట్రల్ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఈ కేసులో కన్నయ్య కుమార్ బెయిలుపై జైలునుంచి విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ పోస్టర్లు వెలవడం సంచలనం సృష్టిస్తోంది.

03/06/2016 - 07:13

బోర్ఘాట్: ఇపిఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై పన్ను విధింపు ప్రతిపాదనను ఉపసంహరించుకునే దాకా తాను ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ‘ఫెయిర్ అండ్ లలీ పథకం’ ద్వారా దేశాన్ని దోచుకున్న దొంగలు తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఈ ప్రధాని అనుమతిస్తున్నారు.

03/06/2016 - 05:39

నల్లగొండ: నల్లగొండ జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం నూతన ఆలయం, బాల ఆలయ నిర్మాణ నమునాలకు, దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ల, ప్రతిపాదనలకు శనివారం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి, స్థపతి సుందర్ రాజన్ రూపొందించిన ప్రధాన ఆలయం, బాల ఆలయం డిజైన్ మ్యాప్‌లను శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి సూచనల మేరకు డిజైన్ చేశారు.

03/06/2016 - 05:38

వరంగల్/ఖమ్మం: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వాహణకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరుగనున్న ఈ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేటర్ వరంగల్‌లో మొత్తం 6,44,098 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 3,23,165 మంది, మహిళలు 3,20,814, ఇతరులు 119 మంది ఉన్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న 58 డివిజన్లలో 398 మంది అధ్యర్ధులు పోటీ పడుతున్నారు.

03/06/2016 - 05:36

నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీనగర్ నిమ్స్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఎట్టకేలకు నేడు ఆదివారం ఓపి సేవలను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి నిమ్స్‌లో ఓపి విభాగం సేవలను ఆదివారం ఉదయం 9-30గంటలకు ప్రారంభించనున్నారు.

Pages