S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/06/2016 - 07:34

మీర్పూర్: ఆసియా కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగే ఫైనల్‌కు ప్రత్యేకత ఏమీ లేదని భారత జట్టు డైరెక్టర్ రవి శాస్ర్తీ స్పష్టం చేశాడు. టోర్నీలో జరిగిన మిగతా మ్యాచ్‌ల మాదిరిగానే దీనిని కూడా చూస్తామని అన్నాడు. శనివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ఏ మ్యాచ్‌ని ఏ విధంగా ఆడాలో టీమిండియా ఆటగాళ్లకు తెలుసునని వ్యాఖ్యానించాడు.

03/06/2016 - 07:34

ముంబయి: ఇటీవలే రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న ముంబయి, రెస్ట్ఫా ఇండియా జట్ల మధ్య ఆధిపత్య పోరాటం సాగనుంది. ఆదివారం నుంచి ఐదు రోజులు జరిగే ఇరానీ ట్రోఫీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ముంబయి జట్టుకు ఆదిత్య తారే, రెస్ట్ఫా ఇండియాకు నమన్ ఓఝా నాయకత్వం వహిస్తున్నారు.

03/06/2016 - 07:32

ధర్మశాల: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని యాంటీ టెర్రరిస్టు ఫ్రంట్ (ఎటిఎఫ్) హెచ్చరించింది. టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈనెల 19న చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, భారత్ తలపడనున్నాయి. అయితే, సరిహద్దులో ఉగ్రవాద కార్యకపాలను సాగిస్తూ, ఎంతో మంది సైనికుల మృతికి కారణమైన పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

03/06/2016 - 07:32

దర్బన్: డేవిడ్ మిల్లర్ అజేయ అర్ధ శతకంతో రాణించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో గెలుపొంది శుభారంభం చేసింది. మిల్లర్ 35 బంతుల్లోనే 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫఫ్ డు ప్లెసిస్ (40) కూడా బాధ్యతాయుతమైన ఆటతో సౌతాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది.

03/06/2016 - 07:30

మీర్పూర్: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు వామప్ టోర్నీ ఆసియా కప్ టి-20 టోర్నీలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఆదివారం నాటి ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. ఏ రకంగా చూసినా ఫేవరిట్‌గా టీమిండియానే పేర్కోవాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బంగ్లాదేశ్ విజేతగా నిలవడం అసాధ్యం.

03/06/2016 - 07:29

హైదరాబాద్: ఆలోచనలకు పదును పెట్టాలని, సామర్థ్యం పెంచుకోవాలని, పనికి వెనకాడొద్దంటూ టి-హబ్ ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు బిపిఎల్ మొబైల్ వ్యవస్థాపకుడు రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని టి-హబ్ వద్ద ఆయన ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలనుద్దేశించి మాట్లాడారు.

03/06/2016 - 07:29

కోల్‌కతా: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి మధ్యంతర డివిడెండ్‌గా కేంద్ర ప్రభుత్వం 17,308 కోట్ల రూపాయలను అందుకోనుంది. శనివారం సంస్థలోని ఒక్కో షేర్‌కు 27.40 రూపాయల చొప్పున డివిడెండ్ ట్యాక్స్ కలుపుకుని మొత్తం 20,830 కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను కోల్ ఇండియా ప్రకటించింది.

03/06/2016 - 07:28

గుర్గావ్: దేశానికి అధిక బ్యాంకుల కంటే, బలమైన బ్యాంకుల అవసరమే ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకృత ఆలోచనను పరిశీలించడానికి త్వరలోనే ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

03/06/2016 - 07:27

బీజింగ్: ఈ ఏడాదికిగాను జిడిపి వృద్ధిరేటు లక్ష్యాన్ని 6.5-7 శాతానికి తగ్గించింది చైనా. ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్ శనివారం ఇక్కడ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వార్షిక సమావేశం సందర్భంగా తమ ప్రభుత్వ పనితీరుపై ఓ నివేదిక విడుదల చేశారు. ఎన్‌పిసిలోని 3,000 మంది సభ్యులకు ఈ నివేదికను సమర్పించారు.

03/06/2016 - 07:26

ముంబయి: మదుపరుల కొనుగోళ్ల ఉత్సాహం మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం భారీ లాభాలను అందుకున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత సూచీలు పెద్ద ఎత్తున పుంజుకున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌తో మదుపరులు పెట్టుబడులవైపు ఆసక్తి కనబరిచారు. బడ్జెట్ రోజున పన్ను భయాల మధ్య నష్టాలకు లోనైనప్పటికీ..

Pages