S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/19/2017 - 03:20

అమరావతి, జూలై 18: నంద్యాలకు చెందిన మాజీ మంత్రి ఎన్.ఎం.డి ఫరూఖ్, కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డిని గవర్నర్ కోటాలో శాసనమండలికి సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రమండలి తీర్మానించింది. ఆ మేరకు తీర్మానాన్ని గవర్నరుకు పంపింది. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్‌లోపు వారిద్దరినీ మండలికి పంపించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపించింది.

07/19/2017 - 03:17

విజయవాడ, జూలై 18: ఎర్రచందనం అమ్మకాలకు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ గ్లోబల్ టెండర్లను పిలిచిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రీ-బిడ్ సమావేశాలు బుధవారం తిరుపతిలో, 21వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పర్యావరణ, అడవులు-శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

07/19/2017 - 03:15

విజయవాడ, జూలై 18: వాల్మీకి ఫెడరేషన్ ద్వారా రూ.50 కోట్ల రుణాలు అందజేయనున్నట్లు ఆ ఫెడరేషన్ చైర్మన్ బిటి నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వమూ వాల్మీకులను ఆదుకోలేదన్నారు.

07/19/2017 - 03:13

విజయవాడ (బెంజిసర్కిల్), జూలై 18: గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజి వద్ద కనబడటం లేదా ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా 673 సార్లు చంద్రబాబును తిట్టారని అన్నారు.

07/19/2017 - 03:11

నెల్లూరు లీగల్, జూలై 18: ఒక కేసుకు సంబంధించి నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, కుమారుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డికి కోర్టు మంగళవారం అరెస్టు వారెంటు జారీ చేశారు. ఒక ప్రైవేట్ కేసులో వీరు ముగ్గురు కోర్టు వాయిదాకు హాజరుకానందున వీరిని అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరచాలని నెల్లూరు రెండవ అదనపు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు చేశారు.

07/19/2017 - 03:10

విజయవాడ, జూలై 18: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల పాలకమండళ్ల సభ్యులుగా నియమితులయిన వారందరికీ శిక్షణ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 6ఎ దేవాలయాల సహా 24 వేల దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు చాలా సందర్భాలలో స్థానిక రాజకీయ నాయకులతో పాలకమండళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

07/19/2017 - 03:09

విజయవాడ, జూలై 18: రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు రీజనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సి.అనూరాధను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. ఎపిఎండిపి గుంటూరు ఫైనాన్స్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఎవి రమణిని గుంటూరు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్‌గా నియమించారు.

07/19/2017 - 03:09

అమరావతి, జూలై 18: క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగి, త్వరలో ఉప రాష్టప్రతి పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్న వెంకయ్యనాయుడు రాజకీయ నిష్క్రమణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌ను తిరిగి ఎన్డీఏ వైపు అడుగులు వేయించేందుకు బిజెపిలోని ఒక వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది.

07/18/2017 - 02:52

కాకినాడ, జూలై 17: భారీ వర్షాల కారణంగా ఉభయ గోదావరి జిల్లాలకు రానున్న పక్షం రోజుల్లో వరదలు సంభవించే అవకాశమున్నట్టు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖాధికారుల హెచ్చరికల ప్రభుత్వ యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలకు సన్నద్ధమయ్యింది.

07/18/2017 - 02:51

విజయనగరం, జూలై 17: నాగావళి ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగావళి ఉగ్రరూపం దాల్చడంతో కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలకు చెందిన ప్రజలు ఆందోళనకు గురైన విషయం విదితమే. కొమరాడలోని పలు పంచాయతీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు కలెక్టర్ వివేక్‌యాదవ్ సోమవారం కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో పర్యటించారు.

Pages