S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/23/2017 - 07:03

చుక్కల భూముల బిల్లుకు ఓకె ఆక్రమణలో ఉన్న నివేశన స్థలాల క్రమబద్ధీకరణ
రియల్ ఎస్టేట్ లాండ్ డెవలప్‌మెంట్ రూల్స్ ముసాయిదా రూపకల్పన ఫిషరీస్ ఓషన్ వర్శిటీకి ఆమోదం
డిపాజిటర్ల రక్షణ కోసం ప్రత్యేక బిల్లు రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు

03/23/2017 - 07:02

విజయవాడ, మార్చి 22: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల వ్యవహారంపై బుధవారం శాసనసభ దద్దరిల్లింది. ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలతోపాటు రైతుల ఆత్మహత్యలపై కూడా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సభలో తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన అధికారిక గణాంకాలను సభ దృష్టికి తెచ్చారు.

03/22/2017 - 03:59

విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 21: బస్సు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. బస్సు ప్రమాదాల నివారణపై ప్రైవేట్ బస్సు యాజమాన్యాలతో మంగళవారం ఆర్టీసీ బస్సు భవన్ సముదాయంలో సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి శిద్దా మాట్లాడుతూ బస్సు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

03/22/2017 - 03:58

గుంటూరు, మార్చి 21: శాసనసభలో 2017-18 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై అధికార, విపక్ష సభ్యుల మధ్య సెగలు, పొగలు రగులుకున్నాయి. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరణకు ముందు టిడిపి, బిజెపి, వైసిపి సభ్యులు భిన్నస్వరాలు వినిపించారు. వైసిపి సభ్యుడు రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ టిడిపి అంటే టెంపరరీ డెవలప్‌మెంట్ పార్టీ అని, బడ్జెట్ కేటాయింపులు అదేమాదిరిగా ఉన్నాయని చమత్కరించారు. ఆరోగ్యశ్రీకి రూ.

03/22/2017 - 03:56

అమరావతి, మార్చి 21: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిఒక్కరినీ విస్మయపరిచిన వైఎస్ కుటుంబ సభ్యుని ఓటమి వెనుక కుటుంబ కలహాలే దాగున్నాయా? జగన్ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన కుటుంబ సభ్యులే విభీషణుల పాత్ర పోషించారా? కొన్ని నెలలుగా చాపకింద నీరులా నడిచిన కథలో ‘ఆ నలుగురే’ కీలకపాత్ర పోషించారా?.. తాజాగా కడపలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పోస్ట్‌మార్టంలో వెలుగుచూసిన నిజాలివి!

03/22/2017 - 03:53

విజయవాడ, మార్చి 21: శాసనసభ సమావేశాల్లో మంగళవారం బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైన కొద్దిక్షణాల్లోనే అవినీతి, అక్రమాలు, కమీషన్లపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల పరస్పర దూషణలతో సభ హోరెత్తింది. ఈనేపథ్యంలో ‘క్విడ్‌ప్రోకో’ తెరపైకి వచ్చింది.

03/22/2017 - 02:26

చిత్తూరు, మార్చి 21: తూర్పు రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి విజయాన్ని చెల్లని ఓట్లు గండి కొట్టాయి. ఈనియోజక వర్గ పరిధిలో 14,551 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు. అందులో ఎక్కువగా టిడిపి అభ్యర్థికి చెందినవే ఉన్నట్లుగా సమాచారం . ఈఎన్నికల్లో మొత్తం 2,18.356 ఓట్లకు గాను పోలైంది 1,47,753, అందులో 14,551 ఓట్లను చెల్లనివిగా అధికారులు నిర్థారించారు.

03/22/2017 - 02:25

కాకినాడ, మార్చి 21: జస్టిస్ కెఎల్ మంజునాథ అధ్యక్షతన రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (బిసి కమిషన్) తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బుధ, గురువారాల్లో వివిధ కుల సంఘాల నుండి విజ్ఞాపనలు స్వీకరిస్తుంది. వివిధ కులాల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన మంజునాథ కమిషన్ మంగళవారం సాయంత్రానికి కాకినాడ నగరానికి చేరుకుని, స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో బసచేసింది.

03/22/2017 - 02:25

శ్రీశైలం, మార్చి 21: శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారాలు, వాహనసేవలు నిర్వహిస్తారు. 29వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి వీరభద్ర దైవజ్ఞచే పంచాంగ శ్రవణం ఉంటుంది.

03/22/2017 - 02:24

మదనపల్లె, మార్చి 21: చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ ఇంటిపై, అతని వ్యాపారసంస్థ ధనలక్ష్మీ షాపింగ్‌మాల్స్‌పై మంగళవారం తిరుపతి, చిత్తూరు ప్రాంతాలకు చెందిన ఇన్‌కమ్‌ట్యాక్స్, సేల్స్‌టాక్స్ అధికారుల బృందాలు మూకుమ్మడిగా దాడులకు దిగారు.

Pages