S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/29/2016 - 07:04

పోలవరం, డిసెంబర్ 28: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2018 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పాక్షికంగా పూర్తిచేసి గ్రావిటీ ద్వారా పంట పొలాలకు నీరందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్‌వే కాంక్రీటు పనులకు ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుడతారని ఆయన తెలిపారు.

12/29/2016 - 07:01

సూళ్లూరుపేట/దొరవారిసత్రం/తడ, డిసెంబర్ 28: నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఫ్లెమింగో పక్షుల పండగ ఉత్సాహంగా రెండోరోజూ కొనసాగింది. సూళ్లూరుపేట,తడలోని పులికాట్ తీరం, దొరవారిసత్రం మండలం నేలపట్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఎక్కడ చూసినా సందర్శకుల సందడి కన్పించింది. సూళ్లూరుపేట వేదికగా జరుగుతున్న పక్షుల పండుగరెండో రోజు ఊపందుకొంది. పండుగ జరుగుతున్న జూనియర్ కళాశాల మైదానం సందర్శకులతో కళకళలాడింది.

12/29/2016 - 06:50

చీరాల, డిసెంబర్ 28: విజయవాడ డివిజన్ పరిధిలో నిడుబ్రోలు - చుండూరు మధ్య ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో బుధవారం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు గౌహతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు సుమారు 2 గంటలు నిలిచిపోయాయి. విజయవాడ వెళ్లే రూట్లో రాత్రి వరకు గంట నుంచి గంటన్నర ఆలస్యంగా రైళ్లు నడిచాయి.

12/29/2016 - 04:17

అమలాపురం, డిసెంబర్ 28: నిన్నటి వరకూ తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు గ్రామాలంటే పరిసర ప్రాంతాల వారికి తప్ప ఇతర ప్రాంతాల వారికి తెలిసింది చాలా తక్కువ. అది కూడా జీడిపప్పు, చేనేత ఉత్పత్తుల కేంద్రాలుగానే ఆ గ్రామాల పేర్లు చుట్టుపక్కల వారికి తెలుసు. కాని గురువారం నుండి ఆ గ్రామాలు డిజిటల్ విప్లవానికి వేదికలవుతున్నాయి.

12/29/2016 - 04:07

విశాఖపట్నం (క్రైం), డిసెంబర్ 28: ముప్పైవేల రూపాయల లంచం తీసుకుంటూ ఐటి అధికారి ఒకరు సిబికి చిక్కారు. ఆ ఇన్‌కమ్ టాక్స్ అధికారిని కోర్టులో హాజరు పరిచి, జైలుకు తరలించారు.

12/28/2016 - 04:05

చిత్రం..రాష్టప్రతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు హాజరైన సిఎం చంద్రబాబు..
ప్రణబ్‌కు బొకేను అందిస్తున్న దృశ్యం.

12/28/2016 - 04:02

చిత్రం.. రాష్టప్రతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సిఎం కెసిఆర్ మంతనాలు

12/28/2016 - 03:26

విజయవాడ (క్రైం), డిసెంబర్ 27: అవినీతి కేసుల్లో ఆస్తుల స్వాధీనానికి చట్టం చేసే యోచనలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్ ఆర్‌పి ఠాకూర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలిపారు.

12/28/2016 - 03:19

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 27: పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రానికి ఎలుగెత్తి చాటేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రచార కమిటీని నియమించింది.

12/28/2016 - 03:19

విజయవాడ, డిసెంబర్ 27: పులివెందులకు నీటి కోసం 80 శాతం నిధులు వైఎస్ ఖర్చు చేశారని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటని, ప్రజలు 38 ఏళ్లు పొలాలు ఎండబెట్టుకుంటే 80 శాతం ఖర్చు పెట్టామని జగన్ చెప్పుకుంటుంటే పూర్తిగా నీరు తీసుకురావడానికి ఇంకెన్ని దశాబ్దాలు ఎదురు చూడాలోనని పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు.

Pages