S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/23/2016 - 06:23

విజయవాడ, ఏప్రిల్ 22: రాజధాని నగరం అమరావతిలో తలపెట్టిన ప్రతిష్ఠాత్మక మెగా హెల్త్‌కేర్ ప్రాజెక్టుకు జూన్‌లో శంకుస్థాపన జరగనుంది. ఇండో-యుకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐయుఐహెచ్) ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ మెడికల్ ప్రాజెక్టులో భాగంగా రూ.1000 కోట్లతో వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని, వెయ్యి పడకల మెగా ఆస్పత్రిని నెలకొల్పుతారు.

04/23/2016 - 06:18

ఒంటిమిట్ట, ఏప్రిల్ 22: మరో అయోధ్యగా పేరుగాంచి, ఏకశిలానగరంలా విరాజిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజు శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఉదయం కాళీయమర్దనాలంకారంలో రాములోరు భక్తులకు కనువిందు చేశారు. ముందుగా ఉత్సవమూర్తులకు అర్చకులు స్వపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం సీతారాములకు అర్చకులు ఊంజల్ సేవ నిర్వహించారు.

04/23/2016 - 06:16

నెల్లూరు, ఏప్రిల్ 22: రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే దురాలోచనతో కొందరు పక్కా పథకంతో బ్యాంకులకు రూ.2.20కోట్ల మేర టోపీ పెట్టారు. తమ ప్రయత్నం విజయవంతం అయి రెండు జాతీయ బ్యాంకులు తమ బుట్టలో పడడంతో మరో రూ.200 కోట్లకు నొక్కేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈలోగా వారి బండారం కాస్త పోలీసుల చెవిన చేరడంతో కటకటాలు వెనక్కివెళ్లారు.

04/23/2016 - 06:16

విశాఖపట్నం, ఏప్రిల్ 22: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవాపథకం (ఆరోగ్యశ్రీ) బిల్లులు చెల్లించకుంటే ఈనెల 26 నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్టు ఎపి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు వంశీకృష్ణ తెలిపారు.

04/22/2016 - 16:34

హైదరాబాద్: ప్రస్తుత వేసవిలో ప్రయాణీకులకు ఉపశమనం కలిగేలా బస్సుల్లో ఉచితంగా మంచినీళ్లు అందించాలని ఎపిఎస్ ఆర్‌టిసి యోచిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు తుది సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ, డీలక్స్, గరుడ, ఎసి, అమరావతి బస్సులో ప్రతి ప్రయాణీకుడికి లీటర్ నీళ్ల బాటిల్ ఉచితంగా ఇస్తారు. పల్లెవెలుగు, ఆర్డినరీ బస్సుల్లో మాత్రం నీళ్ల కేన్లను పెడతారు.

04/22/2016 - 16:33

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశంలో తన వ్యాఖ్యలు సిఎంను, సభ్యులను బాధించినట్లయితే వాటిని వెనక్కితీసుకుంటానని స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు వైకాపా ఎమ్మెల్యే రోజా శుక్రవారం తెలిపారు. రాష్ట్భ్రావృద్ధికి అన్ని పార్టీలూ కలిసి పనిచేయాల్సి ఉందన్నారు.

04/22/2016 - 16:32

విశాఖ: ప్రభుత్వ శాఖల్లో 20 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ప్రజాప్రతినిధులు లేని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిపేందుకు, పట్టణాల్లో నీటి సమస్యను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, వైకాపాలో చీలిక వచ్చే అవకాశం ఉందని, ఈ కారణంగానే పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టిడిపిలో చేరుతున్నారని చెప్పారు.

04/22/2016 - 14:27

తిరుపతి: రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని టిడిపి ఎంపి జెసి దివాకర రెడ్డి అన్నారు. ఇకపై కాంగ్రెస్, బిజెపి వంటి జాతీయ పార్టీల ప్రాముఖ్యత తగ్గుతుందని, టిడిపి అధినేత చంద్రబాబు భవిష్యత్‌లో ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వైకాపా కనుమరుగవుతుందన్నారు.

04/22/2016 - 11:52

విజయనగరం: సాలూరులో హౌసింగ్ శాఖలో ఎఇగా పనిచేస్తున్న రెడ్డి వేణు ఇళ్లపై శుక్రవారం ఉదయం ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. బొబ్బిలిలోని ఆయన ఇంట్లోను, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసి, భారీగా అక్రమాస్తులున్నట్లు కనుగొన్నారని తెలిసింది.

04/22/2016 - 08:14

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలో ప్రతినిధి బృందం మహారాష్టల్రో పర్యటిస్తోంది. రెండో రోజు కార్యక్రమాలను గురువారం నాడు ముగించినట్టు స్పీకర్ కోడెల చెప్పారు. మహారాష్టల్రో మూడు రోజుల పాటు పర్యటించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ బృందంలో మొత్తం 11 మంది సభ్యులున్నారు. వీరంతా బుధవారం నాడు ముంబై చేరుకున్నారు.

Pages