S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/18/2017 - 00:12

న్యూఢిల్లీ, జూలై 17: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి.. సంస్థ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడంపై పశ్చాత్తాపం చెందారు. 2014లో ఆయన ఇన్ఫోసిస్ చైర్మన్‌గా పదవీ విరమణ పొందారు. అయితే నాడు సహచర వ్యవస్థాపకులు తనను చైర్మన్‌గానే ఉండాలని కోరారని, అయినప్పటికీ వినకుండా రాజీనామా చేశానంటూ సోమవారం బాధపడ్డారు.

07/17/2017 - 00:35

న్యూఢిల్లీ, జూలై 16: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్- జూన్)గాను వివిధ సంస్థలు వెల్లడించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

07/17/2017 - 00:33

న్యూఢిల్లీ, జూలై 16: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి).. మహీంద్ర అండ్ మహీంద్రలో (ఎమ్‌అండ్‌ఎమ్) 2 శాతం వాటాను ఉపసంహరించుకుంది. ఈ మేరకు మహీంద్ర అండ్ మహీంద్ర బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలియజేసింది. 2.001 శాతం వాటాను ఎల్‌ఐసి అమ్మేయగా, ఇప్పుడు ఎమ్‌అండ్‌ఎమ్‌లో ఎల్‌ఐసికి 9.958 శాతం వాటా ఉంది. ఇంతకుముందు ఎమ్‌అండ్‌ఎమ్‌లో ఎల్‌ఐసికి 11.959 శాతం వాటా ఉండేది.

07/17/2017 - 00:33

న్యూఢిల్లీ, జూలై 16: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 10.13 శాతం పెరిగి 133.85 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 121.54 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,547.93 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,434.96 కోట్ల రూపాయలుగా ఉంది.

07/17/2017 - 00:32

న్యూఢిల్లీ, జూలై 16: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ డిసిబి బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 39 శాతం పెరిగి 65 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 47 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 319 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 237 కోట్ల రూపాయలుగా ఉంది.

07/17/2017 - 00:30

న్యూఢిల్లీ, జూలై 16: వ్యాపారులు తమ అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి బిల్లుల అప్‌లోడింగ్‌ను ఈ నెల 24 నుంచి జిఎస్‌టిఎన్ పోర్టల్‌పై చేసుకోవచ్చని జిఎస్‌టిఎన్ చైర్మన్ నవీన్ కుమార్ పిటిఐకి తెలిపారు. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి నమోదైన బిల్లులను 24 నుంచి అప్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

07/17/2017 - 00:29

న్యూఢిల్లీ, జూలై 16: అంతర్జాతీయ స్థాయ బ్యాంకుల సృష్టికి కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మరో 3-4 ప్రపంచ శ్రేణి బ్యాంకుల ఏర్పాటు కోసం.. వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులను ఒక్కటి చేయాలనుకుం టోంది. ఎస్‌బిఐలో దాని అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో దేశీయంగా ప్రభుత్వరం గ బ్యాంకుల సంఖ్య ప్రస్తుతం 21కి చేరింది. అంతకుముందు 27 ఉండేవి.

07/17/2017 - 00:27

న్యూఢిల్లీ, జూలై 16: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతు న్నాయ. ఈ నెల దాదాపు 11,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే స్టాక్ మార్కెట్లలోకి కేవలం 498 కోట్ల రూపాయల పెట్టుబడులే రాగా, రుణ మార్కెట్లలోకి మాత్రం 10,405 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయ.

07/16/2017 - 01:10

శాన్‌ఫ్రాన్సిస్కో, జూలై 15: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల నెలవైన కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉద్యోగుల వసతి సమస్య తీవ్రతరమైంది. ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్, ఒరాకిల్, హెచ్‌పి, యూట్యూబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రముఖ వెబ్‌సైట్ల ప్రధాన కార్యాలయాలు ఉన్నది సిలికాన్ వ్యాలీలోనే. అయితే ఇప్పుడు ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇక్కడ ఉండటం పెద్ద తలనొప్పిగా పరిణమించింది.

07/16/2017 - 01:07

న్యూఢిల్లీ, జూలై 15: దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెలలో 1.71 శాతం క్షీణించాయి. నిరుడు జూన్‌లో 92,551 యూనిట్ల విక్రయాలు జరిగితే, ఈసారి జూన్‌లో 90,966 యూనిట్లకే పరిమితమైంది. ఈ విక్రయాల్లో టాటా మోటార్స్ లగ్జరీ కార్ల బ్రాండైన జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) కూడా ఉంది. ఇక ప్యాసింజర్ కార్ల విభాగంలో విదేశీ విక్రయాలు ఈసారి జూన్‌లో 60,725 యూనిట్లుగా నమోదయ్యాయి.

Pages