S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/20/2017 - 03:03

ముంబయి, జూలై 19: మంగళవారం భారీ నష్టాలపాలైన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 244.36 పాయింట్లు పుంజుకుని 31,955.35 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 72.45 పాయింట్లు బలపడి 9,899.60 వద్ద నిలిచింది. మెటల్, హెల్త్‌కేర్, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.

07/20/2017 - 03:03

న్యూఢిల్లీ, జూలై 19: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లో వాటాను ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసికి విక్రయించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. ఒఎన్‌జిసికి హెచ్‌పిసిఎల్‌లో 51.11 శాతం వాటాను అమ్మాలని నిర్ణయించింది.

07/20/2017 - 03:03

న్యూఢిల్లీ, జూలై 19: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నెలనెలా రేడియోలో నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియోకు దాదాపు 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ ఆదాయాన్ని ఆల్ ఇండియా రేడియో అందుకుంది. ఈ మేరకు సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోర్ ఓ లిఖితపూర్వక సమాధానంగా బుధవారం లోక్‌సభకు తెలియజేశారు.

07/20/2017 - 03:02

న్యూఢిల్లీ, జూలై 19: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సిఎ) ఇండియా.. తమ జీప్ మోడల్ శ్రేణి వాహనాల ధరలను 18.49 లక్షల రూపాయల మేర తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ద్వారా చేకూరిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంలో భాగంగానే ధరలను తగ్గిస్తున్నట్లు బుధవారం ఎఫ్‌సిఎ ప్రకటించింది. కాగా, డీజిల్ ఆధారిత వాహనాల్లో రాంగ్లర్ (అన్‌లిమిటెడ్) ధరపై రూ.

07/19/2017 - 01:03

ముంబయి, జూలై 18: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాలతో రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్న సూచీలు.. మంగళవారం మాత్రం ఈ ఏడాదిలోనే గరిష్ఠ స్థాయి నష్టాలను చవిచూశాయి. జిఎస్‌టిలో సిగరెట్లపై సెస్సును పెంచడంతో ఐటిసిసహా పలు సిగరెట్ ఆధారిత సంస్థల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ నెల 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వచ్చినది తెలిసిందే.

07/19/2017 - 01:00

న్యూఢిల్లీ, జూలై 18: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రితికా సూరి రాజీనామా చేశారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2014 సెప్టెంబర్‌లో ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా ద్వారా ఈమె సంస్థలోకి వచ్చారు. ఇన్ఫోసిస్ భారీ ఒప్పందాల్లో రితికా కీలకపాత్ర నిర్వహించగా, ఇజ్రాయెల్ ఆటోమెషన్ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలులోనూ ముఖ్యభూమిక పోషించారు.

07/19/2017 - 00:59

న్యూఢిల్లీ, జూలై 18: విఇ కమర్షియల్ వెహికిల్స్‌లో భాగమైన ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్ సంస్థ.. తమ ట్రక్కులు, బస్సుల ధరలను 5 శాతం వరకు తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ద్వారా చేకూరిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంలో భాగంగానే ఐషర్ ట్రక్స్ తమ ఉత్పత్తుల ధరలను తగ్గించింది. కాగా, ట్రక్కులు, బస్సుల ధరలపై 1.5 శాతం నుంచి 5 శాతం మేర తగ్గింపును ఐషర్ ప్రకటించింది.

07/19/2017 - 00:59

హైదరాబాద్, జూలై 18: ట్రావెల్ టూరిజం ఫెయిర్, బిజినెస్ లగ్జరీ ట్రావెల్ మార్ట్ ఉమ్మడిగా నిర్వహించిన మూడు రోజుల ట్రావెల్ ట్రేడ్ సదస్సు మంగళవారం ముగిసింది. సదస్సులో 12 దేశాలతోపాటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 249 సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న పలు సంస్థలకు ఫెయిర్‌ఫెస్ట్ మీడియా చైర్మన్ సంజీవ్ అగర్వాల్ అవార్డులను ప్రదానం చేశారు.

07/19/2017 - 00:57

న్యూఢిల్లీ, జూలై 18: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 9.28 శాతం పెరిగి 1,283 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 1,174 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. ఈ మేరకు మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు హెచ్‌యుఎల్ తెలియజేసింది.

07/19/2017 - 00:56

న్యూఢిల్లీ, జూలై 18: ఔషధ రంగ సంస్థ జుబిలెంట్ లైఫ్ సైనె్సస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 12.32 శాతం పడిపోయ 143.71 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 163.92 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,596.05 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,453.92 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages