S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/16/2017 - 01:05

లుథియానా (పంజాబ్)/న్యూఢిల్లీ, జూలై 15: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అనేది చాలా సరళమైన పన్ను అని, అయినప్పటికీ అవగాహన లోపంతో దీనిపై ఎన్నో అపోహాలు, పుకార్లు చెలరేగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘జిఎస్‌టి అనేది ఓ సరళమైన పన్ను. కానీ దీన్ని కొందరు కఠినమైన పన్నుగా భావిస్తున్నారు.

07/16/2017 - 01:05

వరదయ్యపాళెం/తడ, జూలై 15: చిత్తూరు, నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీలో ఊర్మిళ ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు సంబంధించి శనివారం భూమిపూజ చేశారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయసేత్, డైరెక్టర్ నందినీసేత్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నైకు చెందిన ఈ సంస్థ భారీ పరిశ్రమల నిర్మాణాలకు నిర్మాణ పరికరాలు, ఉపకరణాలు అద్దెకు ఇవ్వడంతోపాటు శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తోంది.

07/16/2017 - 01:03

హైదరాబాద్, జూలై 15: సింగరేణి సంస్థకు జాతీయ స్థాయిలో ఎక్స్‌లెన్స్ ఇన్‌కాస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు వరుసగా రెండోసారి లభించింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఆర్థిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించినందుకుగాను ఈ అవార్డును ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సింగరేణి సంస్థకు ప్రకటించింది.

07/16/2017 - 01:01

గుజరాత్‌లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)పై వస్త్ర పరిశ్రమ ఆందోళనలు కొనసాగుతున్నాయ. శనివారం అహ్మదాబాద్, సూరత్‌లలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న వ్యాపారులు. ఈ నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వచ్చినది తెలిసిందే

07/16/2017 - 00:59

హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో అగ్రికల్చర్ బయో పెస్టిసైడ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు స్పెయిన్ దేశానికి చెందిన సిపాస కంపెనీ ఆసక్తి చూపింది. యూనిట్ ఏర్పాటుకు భూమిని కేటాయిస్తే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. సిపాస కంపెనీ ప్రతినిధులు టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లును పరిశ్రమ భవన్‌లో కలిశారు కూడా.

07/15/2017 - 00:34

బెంగళూరు, జూలై 14: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించిన లాభాలు దేశీయ స్టాక్ మార్కెట్లలోని మదుపరులను ఏమాత్రం కూడా ఆకట్టుకోలేకపోయాయి.

07/15/2017 - 00:31

న్యూఢిల్లీ, జూలై 14: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ).. తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా సీనియర్ బ్యాంకర్ విక్రమ్ లిమయే సోమవారం నుంచి బాధ్యతలు చేపడుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

07/15/2017 - 00:31

న్యూఢిల్లీ, జూలై 14: పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆదాయానికి, ఖాతాల్లో డిపాజిట్ చేసిన నగదు మొత్తాలకు పొంతనలేని మరో 5.56 లక్షల మందిని ఆదాయ పన్ను (ఐటి) శాఖ గుర్తించింది. ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐటి శాఖ మొదలు పెట్టినది తెలిసిందే. ఈ క్రమంలోనే నోట్ల రద్దు తర్వాత నల్లధనం ఉనికిని కనిపెట్టే పనిలో ఐటి అధికారులు నిమగ్నమయ్యారు. దాని ఫలితమే ఈ 5.56 లక్షల మంది బహీర్గతమయ్యారు.

07/15/2017 - 00:30

న్యూఢిల్లీ, జూలై 14: ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన 2 వేల సంస్థల్లో భారత్‌కు చెందినవి 50 ఉన్నాయి. అయితే టాప్-100 సంస్థల్లో మాత్రం ఒక్కటీ లేకపోవడం గమనార్హం. ఇకపోతే ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ వార్షిక జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల విషయానికొస్తే.. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఇతర భారతీయ సంస్థలన్నింటికంటే ముందుంది.

07/15/2017 - 00:29

ముంబయి, జూలై 14: దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డు పరుగులకు బ్రేక్ పడింది. సూచీలు వరుస లాభాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. నిజానికి ఉదయం లాభాల్లోనే కదలాడిన సూచీలు.. చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే స్వల్ప నష్టాలకే గురవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 16.63 పాయింట్లు కోల్పోయి 32,020.75 వద్ద నిలిచింది.

Pages