S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/27/2016 - 00:22

హైదరాబాద్, డిసెంబర్ 26: అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటీని నిర్మిస్తున్నట్టు అందుకు ముసాయిదా బృహత్తర ప్రణాళికను రూపకల్పన చేశామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు చెప్పారు. ఇందుకోసం టిఎస్‌ఐఐసి ద్వారా 5,646 ఎకరాల 32 గుంటల విస్తీర్ణంలో భూమిని సేకరించామని అన్నారు.

12/27/2016 - 00:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: బంగారం ధరలు సోమవారం 11 నెలల కనిష్టానికి పడిపోయాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత కలిగిన పసిడి ధర 250 రూపాయలు తగ్గింది. దీంతో 27,550 రూపాయలుగా నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ధర 27,575 రూపాయలుగా ఉండగా, ఆ స్థాయికి మళ్లీ ధర చేరింది. ఇక 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర కూడా 250 రూపాయలు తగ్గి 27,400 రూపాయలు పలికింది.

12/27/2016 - 00:20

భీమవరం, డిసెంబర్ 26: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’ అన్న నానుడి సంక్రాంతి కోడిపందాలకు అతికినట్టు సరిపోతుంది. సంక్రాంతి మూడు రోజులు సంప్రదాయం ముసుగులో కోడి పందాలు, ఇతర జూదాల జాతర సాగే విషయం తెలిసిందే. ఏటా కోట్ల రూపాయలు ఈ పందాల్లో చేతులు మారుతుంటాయి. అయితే ఈ ఏడాది కరెన్సీ సంక్షోభం కారణంగా పందాల జోరు తగ్గుతుందని అంతా భావిస్తున్నారు.

12/27/2016 - 00:17

హైదరాబాద్, డిసెంబర్ 26: నూతన పారిశ్రామిక విధానం (టిఎస్-ఐపాస్) ప్రపంచంలోనే అత్యుత్తమమైందని ప్రభుత్వం గొప్పగా చెప్పు కుంటున్నప్పటికీ ఆచరణలో అంత గొప్పది కాదని, దీనివల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

12/26/2016 - 06:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశీయ విమానాల్లో ప్రయాణికులు తమకు ఇష్టమైన సీటు కావాలంటే.. ఉదాహరణకు కాళ్లుజాపుకోవడానికి ఎక్కువ స్థలం ఉండే సీటు లేదా విండోసైడ్ సీటు కావాలనుకుంటే టికెట్ చార్జీతోపాటుగా మరికాస్త ఎక్కువ చెల్లించాల్సిందే. చివరికి మధ్య సీటు కావాలన్నా అదే పరిస్థితి.

12/26/2016 - 00:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నెలకుగాను ఎఫ్‌అండ్‌ఒ డేరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో సూచీలు పడుతూలేస్తూ పయనించే వీలుందని పేర్కొంటున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా చెప్పుకోదగ్గవేమీ లేకపోవడంతో మదుపరుల ఆలోచనా సరళినే కీలకమని చెబుతున్నారు. వారి పెట్టుబడులే మార్కెట్లను నిలబెట్టడమా? పడగొట్టడమా?

12/26/2016 - 00:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి.. కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లోని గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జిఎస్‌పిసి) వాటా కొనుగోలుకు 1.2 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చిస్తోంది. కెజి బేసిన్‌లో జిఎస్‌పిసికి 80 శాతం వాటా ఉంది. అయితే దాదాపు రెండున్నరేళ్లుగా ఇక్కడ వాణిజ్య ఉత్పత్తిని చేయలేకపోతోంది జిఎస్‌పిసి. ఈ క్రమంలోనే మొత్తం వాటాను అమ్మేసింది.

12/26/2016 - 00:52

కాకినాడ, డిసెంబర్ 25: స్మార్ట్ ఫోన్లకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. నిన్నమొన్నటి వరకు సాధారణ మొబైల్ ఫోన్లను మాత్రమే వినియోగించినవారు సైతం ఇప్పుడు స్మార్ట్ఫోన్లకు అలవాటుపడుతున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలే దీనికి కారణం. గత నెల రోజుల్లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు గణనీయంగా పెరిగినట్టు సంబంధిత వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

12/26/2016 - 00:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల ప్రచారార్థం రెండు సరికొత్త పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా లక్కీ డ్రాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఐటి, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లు ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో తీశారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ డిజిటలైజేషన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.

12/26/2016 - 00:45

ముంబయి, డిసెంబర్ 25: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బిస్కట్ల అమ్మకాలను ప్రభావితం చేసింది. నోట్ల రద్దు తర్వాత తమ ఉత్పత్తుల విక్రయాలు 1.5 శాతం పడిపోయాయని పార్లే సంస్థ తెలిపింది.

Pages