S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/07/2019 - 02:47

మోదీ నేతృత్వంలో కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడడం, చట్టసభల్లో రాష్ట్రపతి ప్రసంగం, అనంతరం చర్చలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మోదీ తుది పలుకులు.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ‘హువాతో హువా’వంటి శ్యాంపిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి పిడుగుపాటై మరోసారి యూపీఏ చతికిల పడడం, ఇతర పార్టీల నుంచి భాజపాలోకి వలసలు వెల్లువెత్తడం.. ఏదో నాటకీయంగా జరుగుతున్న పరిణామం కాదు.

07/05/2019 - 21:52

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే నినాదం ఇటీవల ఊపందుకుంది. చట్టసభలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరగాలన్న వాదనను ప్రధాని మోదీ మళ్లీ వినిపించడంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో లోక్‌సభకు, అన్ని శాసనసభలకూ ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరగడం అసాధ్యంగా కనిపిస్తోంది.

07/03/2019 - 04:35

ఇటీవల ఒసాకా (జపాన్)లో జీ-20 శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. అందులో అనేక అంశాలతోపాటు డిజిటల్ ఎకానమీపై చర్చలు జరిపారు. భారతదేశం డిజిటల్ ఎకానమీని విశ్వసిస్తోందని మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అందులో భాగంగానే పెద్దసంఖ్యలో ప్రజలకు బ్యాంకు ఖాతాలు తెరిపించామని, డిజిటల్ లావాదేవీలను పెంచామని సమావేశ అనంతరం భారత ప్రతినిధి, మాజీ కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు పేర్కొన్నారు.

07/02/2019 - 02:56

గ్రామాలు, పట్టణాలు అని, పేద ధనిక అని, అక్షరాస్యుడు నిరక్షరాస్యుడని తేడాలు లేకుండా వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అది కూడా ఆంగ్ల మాధ్యమంలో అందించాలనే తపనతో తమ స్థోమతలకు మించి అధిక ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు పాఠశాలలో చదివించడం జరుగుతుంది.
మన గ్రామంలో వున్న ప్రభుత్వ పాఠశాలలకు పంపించకపోవడానికి గల కారణాలను విశే్లషిస్తే..

06/30/2019 - 03:48

ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల ఆరోగ్యంమీదే ఆధారపడి ఉంటుందనేది నగ్న సత్యం. నేటి ఆధునిక కాలంలో వైద్యం పేదలకు అందని ద్రాక్ష అయింది. నిరక్షరాస్యత, అవగాహన లోపం కారణంగా ఏటా మాతా శిశు మరణాలు కొనసాగుతుండటం విచారకరం. ఇటీవల ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలు బాధను కల్గిస్తున్నాయి. వివిధ కారణాలతో చిన్నారుల మరణాలు సంభవిస్తున్నాయి.

06/29/2019 - 00:17

అమెరికా దేశానికి చెందిన ‘మత స్వేచ్ఛా సంస్థ’ ఇటీవల విడుదల చేసిన తన వార్షిక నివేదికలో భారతదేశంలోని హిందూ అతివాద శక్తులు మైనారిటీ వారిపై ముఖ్యంగా ముస్లింలపై దాడులు జరుపుతున్నారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. సర్వమత సమభావనతో, సర్వకుల సమ్మేళనంతో సర్వసత్తాక ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయపరంగా భారత్‌లో విభిన్న మతాల వారు సహజీవనం చేస్తున్నారు.

06/28/2019 - 02:37

భారత ప్రధాన మంత్రి పదవిని అధిష్ఠించిన తొలి దక్షిణాది నేత.. అందునా తెలుగువాడైన పాములపర్తి వేంకట నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. 1921 జూన్ 28న జన్మించిన ఆయన రాజకీయాల్లోనే కాదు, బహుభాషావేత్తగా, మంచి రచయితగానూ రాణించారు. ‘పీవీ’గా లబ్దప్రతిష్ఠుడైన ఆయన స్నాతకోత్తర న్యాయశాస్త్ర పారంగతుడిగా, అపర చాణక్యునిగా పేరొందారు.

06/26/2019 - 01:32

వర్షాలు మొదలవడంతో అపుడే పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా వీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. ఈ సమయంలో ప్రజలు, స్థానిక సంస్థల అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోని పక్షంలో పలురకాల వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంది. మన ఇంటిని ఏ విధంగా శుభ్రపర్చుకుంటామో అలాగే మన పరిసరాలను సైతం అలా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు గ్రహించాలి.

06/23/2019 - 02:06

నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత దక్షిణ భారతంలోని గురవాయూర్ శ్రీకృష్ణుణ్ణి, తిరుమల వేంకటేశ్వరుణ్ణి సందర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ భాజపా దూసుకుపోవాలన్న ఆకాంక్షతో మోదీ ఇప్పటికే పావులు కదుపుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.

06/21/2019 - 21:51

రానున్న రోజుల్లో అంతరిక్షంలో ప్రత్యేకంగా సొంత కేంద్రం (స్పేస్ స్టేషన్)ను ఏర్పాటు చేయనున్నామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ ఇటీవల ప్రకటించారు. ఆ కేంద్రంలో వ్యోమగాములు 15నుంచి 20 రోజులు గడిపేందుకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రత్యేక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడం ఏ రకంగా చూసినా ఓ అద్భుత ముందడుగు.

Pages