S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/22/2017 - 21:56

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ అనే ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 14 వేల ఓట్ల తేడాతో బిజెపి ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం సాధించాడు. 12 నవంబర్ 2017 నాడు ఈ ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ ప్రేమసింగ్ అనే కాంగ్రెస్ అభ్యర్థి గత నాలుగు పర్యాయాల ఎన్నికలలోను విజయాన్ని సాధించాడు. ఆయన మృతి వలన ఏర్పడిన ఖాళీని తిరిగి కాంగ్రెస్ నిలబెట్టుకుంది.

11/21/2017 - 23:26

సోషలిజం అంటే తెలుగులో సమసమాజమని తర్జుమా చేస్తున్నారు. సమ సమాజాన్ని స్థాపిస్థామని చాలామంది అంటూ ఉన్నారు. ఆ మాట తెలిసి అంటున్నారో, తెలియక అంటున్నారో తెలియదు. మానవ సమాజం సమ సమాజంగా ఎదగడం అసాధ్యమన్న సంగతి గ్రహించకుండానే అదొక ఫ్యాషన్‌గా తరచూ వాడుతూ ఉంటే అలాంటివారిని చూస్తే జాలేస్తోంది. ఆకర్షణీయంగా కనిపించే ఈ నినాదంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీలు ప్రజల మధ్యకు వస్తున్నాయి.

11/21/2017 - 00:51

ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని కళ్లముందు ఉంచే ప్రసార సాధనం టెలివిజన్. 20వ శతాబ్దంలో టివి అశేష ప్రజలను ప్రభావితం చేసింది. భూగోళంపై ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన ఇంటిలోని బుల్లితెరపై ఆ దృశ్యాలను చూపిస్తోంది. సామాజిక మాధ్యమాలకన్నా దృశ్యశ్రవణ మాధ్యమానికి చుక్కానిలాంటి టివి నిజాలకు నిలువుటద్దంగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో చూసేవన్నీ నిజాలని కాదు.

11/19/2017 - 01:37

నేడు ఇందిరాగాంధి శత జయంతి సందర్భంగా..
*

11/18/2017 - 00:47

గుజరాత్ రాష్ట్రంలో పటేల్ సామాజిక వర్గం వారు సంపన్నుల కిందకి వస్తారు. వీరు పూర్వం భూమి పుత్రులు. ప్రస్తుతం రాజకీయ, విద్య, వైద్య, వ్యాపార రంగాలలో సముచిత స్థానం సంపాదించుకున్నారు. సర్దార్ వల్లభ్ భాయి పటేల్, వాణిబెన్ పటేల్, చుమన్‌భాయి, కేశూభాయి, ఆనంది బెన్ ఇలా పటేల్ కులస్థులే గుజరాత్ రాజకీయాల్లో అనాదిగా కీలక పాత్ర పోషిస్తు వచ్చారు.

11/16/2017 - 23:28

ఈసారి నవ్యాంధ్రలో అంతా నందుల సందడి. వరుసగా మూడేళ్లకి సంబంధించిన ప్రభుత్వ సినీ అవార్డులన్నీ ఒకేసారి ప్రకటించేసరికి ఎటు చూసినా నందులే నందులు. నందులు పొందినవారికి అభినందనలు. పొందని కళాకారులకు ముందుముందు పొందాలని ఆల్ ది బెస్టులు. బహుమతి గ్రహీతలు కొందరిని పలకరిస్తే ఆ సరదా కబుర్లు ఇలా ఉండొచ్చు.
ముందుగా బాలయ్యని అడిగితే..

11/15/2017 - 22:15

కా ల్పనిక శక్తిని తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా కలిగించగలుగుతాడు. ఇదొక ప్రయోగం.
6వ తరగతిలో చుట్టుకొలతలు (పెరిమీటర్), వైశాల్యం అనే అంశం సిలబస్‌లో వుంది. 9, 4 సెంటీమీటర్ల గల దీర్ఘచతురస్రాన్ని గీయమని విద్యార్థులకు చెప్పాం. అందరూ చాలా హుషారుగా గీశారు. దీని చుట్టుకొలత ఎంత? అని అడిగాను. 26 అన్నారు.
ఎట్లా వచ్చిందని ప్రశ్నించాను.

11/15/2017 - 02:34

సుదీర్ఘకాలం జనరంజకంగా పాలన సాగించిన థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ అతుల్యదేజ్ గత సంవత్సరం మరణించారు. సంవత్సరకాలం పాటు శోక దినాలు పాటించిన అనంతరం ఇటీవల ఆ దేశ రాజధాని బ్యాంకాక్‌లో కర్మకాండలు పూర్తి చేశారు. అంతిమ సంస్కారాలకు లక్షలాది మంది ప్రజలు తలివచ్చారు. చివరిసారి తమ రాజును చూసేందుకు, వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. విషణ్ణ వదనాలతో వారంతా ఉద్వేగానికి గురయ్యారు.

11/12/2017 - 00:50

నిజామాబాదు జిల్లాలో కందికుర్తి అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ ఒక శివక్షేత్రం, నదీ సంగమం ఉంది. నరహరి శాస్ర్తీ అనే పూజారి, అసఫ్‌జాహీ ప్రభువులు పెట్టే బాధలు తట్టుకోలేక నిజాం రాష్ట్రం వదిలిపెట్టి మహారాష్ట్ర వెళ్లాడు. అక్కడ భోంస్లేల పరిపాలన ఉంది. నరహరి శాస్ర్తీగారి ఇంటిపేరు ఈడిగె వారు. అదే హెడ్గేవార్‌గా ఉచ్ఛారణలో మారింది.

11/10/2017 - 23:26

రష్యా విప్లవానికి ఈ నెలతో వందేళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కుబడిగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి. మరోసారి మూల్యాంకనం చేస్తూ మార్క్స్ అభిమానులు ముందుకొచ్చారు. తమ తమ సిద్ధాంత పాండిత్యాన్ని ప్రకటించుకున్నారు.

Pages