S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/30/2017 - 07:25

హిరణ్య కశిపుడు వైకుంఠానికి చేరిన పిదప అతని కుమారుడైన ప్రహ్లాదుడు రాజయ్యాడు. ఎన్నో సద్గుణాలు కలిగిన ప్రహ్లాదునికి ఇంద్ర పదవిని పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రాక్షస సంతతి వాడు కావడంతో ప్రహ్లాదుడు ఏ సమయంలోనైనా తనపై దండెత్తి పదవిని చేజిక్కించుకోగలడనే అనుమానంతో ఇంద్రుడు ఒక పన్నాగం పన్నాడు.

03/30/2017 - 07:22

తరగతి గది ప్రవహించే నది. ఆ నీటి రంగు ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు. సామాజిక పరిణామాలు కూడా తరగతి గది స్వరూపాన్ని మార్చుతూ ఉంటాయి. ఒకనాడు రెండు పూటలా అన్నం దొరికిన పిల్లలు ఆ బెంచీల మీద కూర్చుంటే ఈనాడు- మధ్యాహ్న భోజనం కోసం ఎదురుచూసే పిల్లలు కూర్చున్నారు. ఒకనాడు చదువుకునేందుకు తగిన వసతి ఉండే పిల్లలుంటే ఈనాడు- కుటుంబం అంతా ఒకే గదిలో గడిపేవారి పిల్లలు కనిపిస్తారు.

03/29/2017 - 00:33

మొన్నటి యుపి అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మహిళల విడాకులకు సంబంధించిన ‘తలాక్’పై ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి కనబర్చడంతో ఆ వర్గం మహిళల ఓట్లు బిజెపికి పడేలా చేశాయి. ఎన్నికల ప్రచార సభల్లో ‘ముస్లిం మహిళలకు న్యాయం చేయడం ప్రభుత్వ, ప్రజల బాధ్యత’ అని మోదీ అన్నారు. 20 ఏళ్లకు ముందు ‘ఉమ్మడి పౌరస్మృతి’ బిజెపి అజెండాలో ఉండేది. అది మళ్ళీ ఈ ‘తలాక్’ వ్యతిరేకత రూపేణా ఇపుడు పురుడు పోసుకుంటున్నది.

03/27/2017 - 00:16

‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న నానుడి మన దేశంలోని రాజకీయ పార్టీల నాయకులకు చక్కగా సరిపోతుంది. ఎన్నికల్లో ప్రజాభిమానం పొందలేని నేతలు ఓటమిని అంగీకరించడం హుందాతనానికి నిదర్శనం. అయితే, మన రాజకీయ నాయకుల్లో హుందాతనం రానురానూ నశించిపోతున్నది. ఇందుకు నిదర్శనంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల ఫలితాలపై బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనలను చెప్పుకోవచ్చు.

03/26/2017 - 07:43

ఏపి శాసనమండలిలో స్థానిక సంస్థలు, టీచర్లు, గ్రా డ్యుయేట్ల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో వె లువడిన ఫలితాలు విభిన్న తీర్పులిచ్చాయి. స్థానిక సంస్థల నుంచి మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ గెలుపొందగా, ఆ పార్టీ మద్దతుతో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి బిజెపి విజయం సాధించింది. మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ, ఆ పార్టీ బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థులు సత్తా చాటారు.

03/25/2017 - 01:12

మార్క్సిజం పునాదిగా మావోయిస్టు పార్టీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో పనిచేస్తోంది. చట్టవ్యతిరేక కార్యక్రమాలు, విధ్వంసకర కలాపాలను నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఆ పార్టీని, దాని అనుబంధ సంఘాలను కొన్నింటిని చాలాకాలంగా నిషేధించిన సంగతి తెలిసిందే. చట్టవ్యతిరేక పనులకు సంబంధించి తగిన సాక్ష్యాధారాలుంటే మావోయిస్టులకు కోర్టులు శిక్షలు కూడా విధిస్తున్నాయి.

03/24/2017 - 00:59

ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ‘రైతులకు రుణమాఫీ’ అనే హామీ ఓటర్లపై విస్తృత ప్రభావం చూపుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ, పంజాబ్‌లో కాంగ్రెస్ ఘన విజయం సాధించాయంటే అందుకు ప్రధాన కారణాల్లో రుణమాఫీ హామీ ఒకటి. 2014 ఎన్నికల్లో ఈ హామీతోనే ఏపిలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాయి.

03/23/2017 - 06:38

ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు ఇటు యావత్ భారతదేశ ప్రజలకు, అటు పాలకపక్షాలకు ఓ గుణపాఠం కావాలి. కొత్తగా నాలుగు రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తుండవచ్చు. అయితే, పంజాబ్‌లో ఆ పార్టీ, దాని మిత్రపక్షం అయిన అకాలీదళ్ నేతృత్వంలో పదేళ్లుగా వున్న ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని బిజెపి వారు గమనించాలి.

03/23/2017 - 05:51

పిల్లల్లో లక్ష్యాలు కలిగించినంత మాత్రాన అవి అందుబాటులోకి వస్తాయనుకోకూడదు. లక్ష్యాలను అమలు చేయటానికి విద్యార్థులు తమ ఆలోచనను బట్టి మార్గాలు వేస్తూ ఉంటారు. ఆ మార్గాలు వారి మనసుల్లోనే ఉంటాయి. ఉపాధ్యాయుడు వాటిని బహిరంగ పరుస్తాడు. ఉపాధ్యాయుడు విద్యార్థితో ఒంటరిగా చర్చిస్తేనే ఆ ఆలోచన బహిర్గతవౌతుంది. వీలైనంతవరకు ఎవరి ఆలోచనల్లో వారిని కొత్త వంతెనలు వేసుకోనియ్యాలి.

03/22/2017 - 01:02

గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో తాము అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారం తమకు లభించకపోవడంపై కాంగ్రెస్ ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను కోల్పోయిన పరాజయ భారంలో పంజాబ్‌తోపాటు ఈ రెండు రాష్ట్రాలను కూడా వశం చేసుకోగలిగితే ఆ పార్టీకి తగినంత ఊరట ఉండేది. ఈ విధమైన రాజకీయ ఆలోచనలను పక్కన ఉంచి విషయంలోకి వెడితే, కాంగ్రెస్‌కు కలిసి రాని విషయాలు అనేకం కనిపిస్తున్నాయి.

Pages