S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/12/2017 - 08:45

దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి దశాబ్దాల తరబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాలీనా లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే, పేదరికం నిర్మూలన అనేది మిధ్య గానే మారింది. దీనికి ప్రధాన కారణం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలలో అధిక శాతం అనర్హుల చేతిలోకి వెళ్ళడమే.

03/12/2017 - 08:44

రాజకీయ పార్టీలన్నీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా మారిన మనదేశంలో వారసత్వ రాజకీయాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. ఇప్పుడున్న అన్ని పార్టీలూ ఓనర్‌షిప్ కంపెనీలే కాబట్టి, ఎవరి కంపెనీలు వారి వారసులకే పట్టం కట్టడం సహజం. దీనికి ప్రతిభ, క్రమశిక్షణ, పనితనం వంటి పూతలు ఎన్ని పోసినా జనం నమ్మరు.

03/11/2017 - 01:09

సముద్ర మట్టం పెరగడానికి వౌలిక కారణాలు రెండు. మొదటిది- అధిక ఉష్ణోగ్రతల వల్ల ధృవాల వద్ద, ఇ తర ప్రాంతాల్లో మంచుకొండలు కరగడం, రెండవది- అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్ర జలాలు వ్యాకోచించడం. కొన్నివేల ఏళ్ల క్రితం భూగోళం నీరు ఘనీభవించిన స్థితిలో ఉండేది. ఈ కాలాన్ని ‘గ్లేసియల్ పీరియడ్’ అంటారు. ఆ దశలో భూమిపై జీవజాలం లేదు.

03/10/2017 - 00:14

సాధారణంగా మనుషులకు వచ్చే వ్యాధుల్లో రెండు రకాలు. వంశ పారంపర్యంగా సంక్రమించేవి కొన్ని రోగాలైతే, మన నిర్లక్ష్యం కారణంగా అనుకోని రీతిలో వచ్చే వ్యాధులు కొన్ని అని చెప్పుకోవాలి. మానవాళిలో దాదాపు పది శాతం మంది వరకూ తక్కువ స్థాయిలో సంక్రమించినా కొన్ని వ్యాధులు- చికిత్స లేని అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన అరుదైన వ్యాధులు కూడా ఉన్నాయి.

03/09/2017 - 05:50

తరగతి గది సమస్యలకు పరిష్కారం చెప్పే స్థలం కాదని తెలిసినా, అక్కడ సమస్యలు ఎలా ఉత్పన్నవౌతాయి? సమస్యలు, పరిష్కారాలకు తరగతి గది పరిధి కానే కాదు. ప్రతి సమాజం తన సమస్యలను తనకున్న ఆలోచనలతో పరిష్కరిస్తుంది. సమస్యలకు తగ్గ ఆలోచనలు ఉంటాయి. సమస్యలు వేరు, ఆలోచనలు వేరు. ఏ సమస్యకైనా పరిష్కారం సమాజమిచ్చిన మార్గం. కొలంబస్ అమెరికా దేశాన్ని కనుక్కోకముందు స్పెయిన్ నుంచి అమెరికాకు రోడ్డు మార్గం లేదు.

03/09/2017 - 05:48

మొదటి పారిశ్రామిక విప్లవం నాటికి ‘్భరత ఉపఖండం చీకటి ఖండం’గా ఉందని, గతమంతా వర్గపోరాటాల చరిత్ర అని జర్మన్‌కు చెందిన కారల్ మార్క్స్ పేర్కొన్నారు. లండన్‌లో ఉంటూ మానవ చరిత్రను అధ్యయనం చేశాక ఆ యన ‘పెట్టుబడి’ గ్రంథాన్ని, కమ్యూనిస్టుపార్టీ ప్రణాళికను రచించారు. భారత్ గురించి మార్క్స్ చెప్పిన ఆ రెండు మాటలను ఆయన అనుచరులు, కమ్యూనిస్టులు శిరోధార్యంగా భావిస్తుంటారు.

03/06/2017 - 07:32

డాక్టర్ సి.వి. సుబ్బన్న శతావధాని ఈనాటి అవధానులలో ప్రముఖులు. వారు పండితులు, రచయిత, పరిశోధకులు. వారి అవధాన కవిత్వం ప్రబంధ కవిత్వం వలె భాసించింది. తిరుపతి వేంకట కవులలో ఒకరైన శతావధాని చెళ్ళపిళ్ళ వెంకటశాస్ర్తీ గారు శివరాత్రి పర్వదినమున 15-2-1950 విజయవాడలో పరమపదించగా, ఆనాడే సుబ్బన్నగారు కడప జిల్లా ప్రొద్దుటూరులో అష్టావధానం చేశారు. అవధాన నిర్వహణ సన్నగిల్లుతున్న సమయంలో వారు దానిని పునరుద్ధరించారు.

03/05/2017 - 00:56

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఇప్పుడు సర్వత్రా కనిపిస్తున్నవి అసహన దృశ్యాలే. అధికార,ప్రతిపక్షాల మధ్య సుహృద్భావ, సామరస్య వైఖరి స్థానంలో కక్షపూరిత, వ్యక్తిత్వ హనన దృ శ్యాలు దర్శనమిస్తున్నాయి. ప్రకృతికి పగలు-రాత్రి ఎంత అవసరమో ప్రజాస్వామ్యంలో అధికారపార్టీతోపాటు ప్రతిపక్షం ఉంటేనే శోభ! దేశంలో ఇప్పుడు ఇలాంటి భావన ఏ పార్టీలోనూ కనిపించడం లేదు.

03/04/2017 - 01:33

వసుధైక కుటుంబం పరిఢవిల్లాలంటే, విజ్ఞానం ఆధునికంగా వెల్లివిరియాలంటే అత్యున్నత శాస్త్ర పరిశోధనల ఆవశ్యకత ఎంతగానో ఉంది. మేధావుల విజ్ఞాన శాస్త్ర పరిశోధనల మూలంగానే మానవాళి అత్యద్భతుమైన ఫలితాలతో సుఖసంతోషాలకు ఆలవాలమైన శాస్ర్తియతను పొందగలుగుతోంది. దేశంలోని అత్యుత్తమ శాస్త్ర పరిశోధనల సంస్థల పనితీరును ప్రపంచ ప్రమాణాలకు దీటుగా బలోపేతం చేసుకోవాలని కేంద్రం ఆకాంక్షిస్తోంది.

03/03/2017 - 00:43

మన దేశం ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం, అల్ప ఉద్యోగత (తగినన్ని పనిదినాలు లేకపోవడం) అతి ముఖ్యమైనవి. శ్రామిక శక్తిలో సుమారు పది శాతం మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనుల్లో పెరిగిన యాంత్రీకరణ ఫలితంగా ఆ రంగంలో శ్రామికుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నది. కూలీలకు ఇచ్చే దినసరి వేతనాలు నానాటికీ పెరిగిపోవడంతో రైతు నష్టపోతున్నాడు.

Pages