S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

08/27/2017 - 00:16

మహిళలు పురుషాధిక్యం నుండి బయటపడాలంటే ముందుగా పురుషుల మనోభావాల్లో మార్పు రావాలని కాంక్షించే ప్రముఖ కవయిత్రి శ్రీమతి భండారు విజయ వరంగల్లుకు చెందినవారు. రచయిత్రిగా, కవయిత్రిగా, వ్యాసకర్తగా, కాలమిస్టుగా, సామాజిక కార్యకర్తగా పరిచయం వున్న ఆమె వృత్తిరీత్యా గ్రంథాలయ అధికారి.

08/20/2017 - 01:39

నా చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. ఇంట్లో ఉండేది అమ్మ, నేను. డిగ్రీ పట్టా పొందిన తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అమ్మ చెప్పినట్లుగానే ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే పెళ్లి చేసుకున్నాను.

08/20/2017 - 01:38

పచ్చని చీర కట్టుకున్న ప్రకృతి
కాలుష్యం కోరల్లో చిక్కుకుంది
‘్భతాపం’ పుడమి నెత్తిపైన
పెనుభూతమై కూర్చుంది
రోజు రోజుకు పెరుగుతున్న ఉద్గారాలు
పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయి
శరవేగంగా విస్తరిస్తున్న పారిశ్రామీకరణ
పట్టణీకరణాలతో పర్యావరణ కాలుష్యం
పెరుగుతుంది నిత్యం విపరీతంగా!
పచ్చని పర్యావరణం మసకబారుతుంది అమితంగా

08/20/2017 - 01:36

బాల సాహిత్యం చిన్నారుల వ్యక్తిత్వ వికాసానికి దోహద పడాలని భావించే బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ విజేత వాసాల నరసయ్య కరీంనగర్ జిల్లా చౌలమద్ది గ్రామానికి చెందినవారు. స్కూల్ మాష్టారుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పోస్ట్‌మాస్టర్‌గా పదవీ విరమణ చేశారు.

08/12/2017 - 23:55

కథల్లో తెలంగాణ ప్రజల జీవనశైలిని

ప్రతిబింబింపజేయాలని అభిప్రాయపడే ప్రముఖ

కథా రచయిత బి.మురళీధర్ వృత్తిరీత్యా

ఆదిలాబాద్‌లో వ్యవసాయ విస్తరణాధికారిగా

మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాలా

గ్రామానికి చెందిన ఆయన 1967లో ‘అడవి

పువ్వు’ పేరుతో ఒక కథ రాశారు. ఇప్పటివరకు

పందొమ్మిది కథలు మాత్రమే ఆయన

08/12/2017 - 23:54

ఎన్నడూ లేంది సినిమా కెళ్దామని బుంగి

పిలుపునిచ్చిండు. నిజానికి సినిమా

చూడటమంటే నాకు అయిష్టం. ఫక్తు

వ్యాపారాత్మక ధోరణి. మనిషి బలహీనతలను

రెచ్చగొట్టి డబ్బు చేసుకోవడం ఆనవాయితీగా

మారింది. బుంగి మాట కాదనలేక

బయల్దేరాను. ఊర్లో ఉన్న థియేటర్స్ అన్నిట్లో

ఒకే సినిమా రిలీజ్ అయింది. చూడాల్సింది

అదొక్కటే అనే పరిస్థితి కల్పించారు. ఏమిటీ

08/12/2017 - 23:52

స్నేహం కొమ్మల్లో కోయిలమ్మ కూత

వంటిదని..ప్రకృతిలో పచ్చదనం..అమ్మ

వొడిలోని కమ్మదనం స్నేహమని..స్నేహంలోని

మాధుర్యాన్ని తెలుపుతూ ‘స్నేహమధురిమ’

గ్రంథాన్ని వెలువరించి కవి లంకా వెంకట

సుబ్రహ్మణ్యం గారు తమ సృజనను

చాటుకున్నారు. కటిక చీకటిలో దివిటి లాంటిది

స్నేహమని..అది అజ్ఞానానికి అడ్డుకట్ట

వేస్తుందని కవి తమ కవితల్లో అందంగా

08/12/2017 - 23:51

కాలపు గాలంలో చిక్కుకుని
వయసు విలవిలలాడుతోంది
వనపు ఎరచాపి ఆకట్టుకున్న కాలం
రాబోయే ముడతల చిత్రాలు చూపలేదు
అందమంతా మట్టిలా కొట్టుకుపోయి
వట్టిపోయి మిగిలిన కళేబరం
చర్మాన్ని చుట్టుకు నిలబడుతుంది
ఎముకలన్నీ లెక్కెట్టుకోండంటూ
పైకితేలి నిలబడ్డాయి
వడలిన ఆశలు వసారాలో అతుక్కున్నాయి
గోడమీద ఫోటోలు ముసలి వాసనొస్తున్నాయ్

08/06/2017 - 23:50

వివిధ సంస్థలే కాక.. ప్రభుత్వం కూడా సాహితీ పురస్కారాలను ప్రతిభావంతులను పక్కన పెట్టి.. ఆశ్రీత జనులకే అందివ్వడం జరుగుతోందని.. భజన పరులకు గాక.. సృజనకారులకు పురస్కారాలు దక్కాలని ప్రముఖ కవి, సినీగేయ రచయిత, దర్శకులు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అభిప్రాయపడ్డారు. తన 16వ యేటనే అంటే 1965లో రచనలు ప్రారంభించారు. తాను పుట్టినట్టి సిరిసిల్ల వాతావరణం.. మానేరు తీరం ఆయనలో కవితా శ్వాసను నింపింది.

08/06/2017 - 23:49

తమ జీవిత అనుభవాలను ఏర్చి, కూర్చి సూక్తి సుమాల సమాహారంగా మలిచి..కవి శతకశ్రీ అమ్మన చంద్రారెడ్డి గారు ‘సూక్తి పద్యాలు’ పేరుతో పద్య కావ్యాన్ని వెలువరించారు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా, సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు కవి ప్రయత్నం చేశారు. ఇందలి 101 పద్యాల్లో వివిధ అంశాలను ఒకటి దానికి మరోకటి సంబంధం లేకుండా చక్కగా ఆవిష్కరించారు.

Pages