S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/11/2019 - 21:33

న్యూయార్క్, అక్టోబర్ 11: కాశ్మీర్‌లో నివసిస్తున్న చిన్నారులకు సంబంధించి పాకిస్తాన్ తప్పుడు కథనాలను వ్యాపింపజేస్తోందని భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. స్కూలు పిల్లలకు తీవ్రవాద సిద్ధాంతాలు నూరిపోసి వారిని ఉగ్రవాద శిబిరాల్లో చేరుస్తున్న నీచమైన ఘనత పాకిస్తాన్‌దని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 3వ కమిటీ సమావేశంలో భారత్ వెల్లడించింది.

10/11/2019 - 21:31

మొరోనీ (కామొరోస్), అక్టోబర్ 11: రక్షణ రంగంలో సహకారంసహా భారత్, కామొరోస్ దేశాల మధ్య మొత్తం ఆరు అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. కామొరోస్‌లో పర్యటిస్తున్న భారత ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కామొరోస్ అధ్యక్షుడు అజలి అసౌమనితో ఉపరాష్టప్రతి సుధీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ఆరు అంశాలపై అవగాహన కుదిరింది.

10/11/2019 - 00:30

బీజింగ్ / న్యూఢిల్లీ, అక్టోబర్ 10: భారత్-చైనాల మధ్య మరో శిఖరాగ్ర భేటీకి రంగం సిద్ధమైంది. చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్, భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలు తమిళనాడులోని మామల్లాపురంలో శుక్రవారం కీలక సమావేశం జరపనున్నారు. వీరిద్దరి మధ్య ముఖాముఖి భేటీ జరగడం ఇది రెండోసారి. చారిత్రక, ప్రస్తుత విభేదాలకు అతీతంగా ముందుకు వెళ్లి సహకార బంధాన్ని బలోపేతం చేసుకోవడం పైనే వీరిద్దరూ దృష్టిపెట్టనున్నారు.

10/11/2019 - 05:30

స్టాక్‌హోమ్: పోలాండ్ నవలా రచయిత్రి ఓల్గా టొకర్జక్, ఆస్ట్రియా నవలాకారుడు, నాటక రాచయిత పీటర్ హాండ్కేకు వరుసగా 2018, 2019 సంవత్సరాలకు నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది. నిజానికి టొకర్జక్‌ను గత ఏడాదే ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అయితే, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఈ నోబెల్ పురస్కారాలను నిలిపివేశారు. దీనితో ఆమెకు ఈ ఏడాది నోబెల్‌ను అందచేశారు.

10/10/2019 - 23:48

ఐక్యరాజ్య సమితి, అక్టోబర్ 10: ఉగ్రవాదానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు అందుతున్న సాయంపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్), ఐక్యరాజ్య సమితి (యూఎన్)కు భారత్ పిలుపునిచ్చింది. ఈ రెండు సంస్థలు పరస్పర సహకారంతో ముందుకు వెళితే, ఉగ్రవాదులకు అందుతున్న సాయాన్ని నిలిపివేయడం ద్వారా, ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనవచ్చని పేర్కొంది.

10/10/2019 - 22:15

పారిస్, అక్టోబర్ 10: ఫ్రాన్స్‌లో తన పర్యటన విజయవంతమైందని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 36 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో భాగంగా, మొదటి రాఫెల్ విమానాన్ని అధికారికంగా స్వీకరించడానికి వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటనను ముగించుకున్నారు. స్వదేశానికి బయలుదేరే ముందు ఆయన వీడ్కోలు మెసేజ్‌ను ట్వీట్ చేశారు.

10/10/2019 - 02:35

లండన్, అక్టోబర్ 9: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్)పై చర్చల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోవడానికి రంగం సిద్ధమయింది. బహుశా మంగళవారంతో ఈ చర్చల ప్రక్రియ ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాలు దెబ్బకు దెబ్బ అనే రీతిలో వ్యవహరించడం వల్ల అక్టోబర్ వరకు ఉన్న గడువులోగానే చర్చలు అర్ధంతరంగా నిలిచిపోవడానికి దారితీసే పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

10/10/2019 - 02:35

తైపీ, అక్టోబర్ 9: లెన్నాన్ గోడను దెబ్బ తీసినందుకు తైవాన్ ప్రభుత్వం ఒక చైనా పర్యాటకుడిని బహిష్కరించింది. హాంగ్-కాంగ్‌లో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా, బీజింగ్‌కు చికాకు కల్పించే విధంగా పోస్టర్లను అంటించినందుకు తైవాన్ ఈ నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఉద్యమకారులు లెన్నన్ గోడలపై రంగు రంగుల గోడ పత్రికలను అంటించారు.

10/10/2019 - 02:27

స్టాక్‌హోమ్, అక్టోబర్ 9: లీథియం ఆయాన్ బ్యాటరీలకు రూపకల్పన చేసిన శాస్తవ్రేత్త స్టాన్లీ విట్టింగ్‌హామ్, జాన్ గుడ్‌ఎనఫ్, అకిరా యోషినోకు కెమిస్ట్రీలో నోబెల్ పురస్కారం దక్కింది. రాయల్ స్వీడిష్ అకాడమీకి చెందిన ఈ ముగ్గురు శాస్తవ్రేత్తలు లీథియం ఆయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేశారు. మొబైల్ ఫోన్ల నుంచి రిమోట్ కంట్రోల్ వరకు దాదాపు ప్రతి చోట ఈ బ్యాటరీలను వాడుతున్నారు.

10/09/2019 - 22:50

బీజింగ్, అక్టోబర్ 9: తమ దేశానికి టెక్ కంపెనీలకు సాంకేతిక సహాయంపై అమెరికా విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని చైనా డిమాండ్ చేసింది. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం ఎంతమాత్రం తగదని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అమెరికాను హెచ్చరించింది. చైనా కంపెనీలకు సాంకేతిక సహకారాన్ని పూర్తిగా నిలిపివేయాలంటూ అమెరికా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది.

Pages