S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/29/2016 - 11:18

లాస్‌ఏంజిల్స్‌: లాస్‌ఏంజిల్స్‌ (అమెరికా) ఎయిర్‌పోర్టులో సోమవారం తుపాకీ పేలిన శబ్ధం రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. భద్రతా బలగాలు విమానాశ్రయాన్ని చుట్టుముట్టాయి. ఎలాంటి కాల్పులు జరగలేదని నిర్ధారించడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణికులు పరుగులు తీయడంతోనే గందరగోళం ఏర్పడించిన పోలీసులు వెల్లడించారు.

08/29/2016 - 11:15

బీజింగ్‌: చైనాలోని గువాంగ్జీ జువాంగ్‌లో నానింగ్‌ ప్రాంతానికి వెళ్తున్న బస్సు ఆదివారం అర్ధరాత్రి బారికేడ్లను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా 10 మంది మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్‌ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.

08/29/2016 - 02:55

ఇస్లామాబాద్, ఆగస్టు 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బలూచిస్తాన్ గురించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతేకుండా ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఫెడరల్ (కేంద్ర) ప్రభుత్వాన్ని కోరింది.

08/28/2016 - 03:43

టొరంటో, ఆగస్టు 27: ఇద్దరు ప్రాణ మిత్రులు.. నాలుగు దశాబ్దాల క్రితం కేవలం మూడు రోజుల వ్యవధిలో జన్మించారు. కానీ పుట్టిన వెంటనే వారి తల్లులు మారిపోయారు. ఈ విషయం 41 సంవత్సరాల తర్వాత వెలుగులోకి రావడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇది కథ కాదు. ఈ వాస్తవిక ఘటన కెనడాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

08/28/2016 - 03:46

ఢాకా, ఆగస్టు 27: గత నెలలో ఢాకాలోని ఒక రెస్టారెంట్‌పై దాడి చేసి ఒక భారతీయ యువతిసహా 22 మందిని హతమార్చిన ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన తమీమ్ అహ్మద్ చౌదరిని బంగ్లాదేశ్ పోలీసులు మట్టుబెట్టారు. ఢాకా సమీపంలోని తమీమ్ రహస్య స్థావరంపై శనివారం దాడి చేసిన పోలీసులు అతనితోపాటు అతని సహాయకులు ఇద్దరిని కా ల్చిచంపారు.

08/28/2016 - 03:16

మాస్కో, ఆగస్టు 27: రష్యా రాజధాని మాస్కో నగరం ఉత్తర ప్రాంతంలో శనివారం ఉదయం ఒక గోదాంలో ఎగిసిపడిన మంటల్లో 16మంది మృతి చెందారు. మంటలను ఆర్పివేసిన తరువాత అక్కడ గోదాంలో విడిగా ఒక గది కనపడిందని అత్యవసర మంత్రిత్వ శాఖ ప్రెస్ సర్వీస్ ప్రాంతీయ శాఖను ఉటంకిస్తూ ‘టాస్’ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది ఆ గది గోడను పగులగొట్టి చూడగా లోపల 16మంది మృతి చెంది ఉన్నారు.

08/27/2016 - 16:06

మాస్కో: రష్యా రాజధాని మాస్కో నగరంలో శనివారం ఓ కోల్డ్ స్టోరేజీలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు చర్యలు ప్రారంభించారు.

08/27/2016 - 07:03

లా పాజ్, ఆగస్టు 26: రాయితీలు కల్పించాలని, ప్రైవేటు కంపెనీల్లో పని చేయడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ బొలీవియాలో గత వారం రోజులుగా గని కార్మికులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు చర్చలు జరపడం కోసం వచ్చిన హోం శాఖ సహాయ మంత్రి రొడోల్ఫో ఇల్లోన్స్‌ను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి చంపారు.

08/27/2016 - 07:00

అమత్రైస్ (ఇటలీ), ఆగస్టు 26: పెను భూకంపంతో విధ్వంసానికి గురైన ఇటలీని శుక్రవారం మరోసారి బలమైన ప్రకంపనలు కుదిపేశాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్న అమత్రైస్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల 28 నిమిషాలకు మరో బలమైన తదనంతర ప్రకంపన సంభవించడంతో ఇప్పటికే దెబ్బతిన్న కొన్ని భవనాలు మరింతగా బీటలు వారాయి.

08/26/2016 - 17:01

ప్రేగ్: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ హత్యకు చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో జరిగిన కుట్రను అధికారులు భగ్నం చేసినట్టు తెలుస్తోంది. సాయుధుడైన ఓ వ్యక్తి ఆమె కాన్వాయ్‌లోకి ప్రవేశించేందుకు యత్నించాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు ప్రతినిధి జోసెఫ్ బొకన్‌ను ఉటంకిస్తూ 'మిర్రర్' వార్తా కథనం ప్రచురించింది.

Pages