S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

11/02/2017 - 18:49

మాట మనిషి తీరును తెలుపుతుంది. మాట్లాడే పద్ధ్తి మనిషి జీవితాన్ని నిలుపుతుంథి. చక్కని మాటలతో జీవితాన్ని నందనవనం చేసుకోవచ్చు. మనం మాట్లాడుకునే మాటలు ఎదుటివానికి నొప్పి కలిగించకపోతే వారు సదా మిత్రత్వాన్ని కలిగిఉంటారు. హృదయాన్ని నొప్పించేమాటలు మాట్లాడుతూ ఉంటే ఒకవేళ అవి నిజాలు కాకపోతే మాత్రం జీవితం ముళ్లబాట అవుతుంది. సహజంగా కొంతమందికి మాటలతో పోయేదానిని ఘర్షణల వరకు తీసుకెళ్లటంఅలవాటుగా ఉంటుంది.

11/01/2017 - 18:31

లోకంలో భగవంతుని అనుగ్రహం కరుణ అదృష్టవంతులకే లభిస్తుంది. ఈ విషయానే్న భగవద్గీతలో కృష్ణపరమాత్మ ఏడవ అధ్యాయంలో ఒక శ్లోకంలో విపులీకరించారు.
మనుష్యాణాం సహస్రేషు-..... వేత్తితత్త్వతః
పెక్కు వేల మానవ సమాజంలో ఒక్కడు మాత్రమే పరమ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు అట్టి సిద్ధిని సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్ధంగా తెలుసుకోగలుగుతాడు.

10/31/2017 - 18:21

వైకుంఠవిహారి, అనంతశయనస్వామి లక్ష్మీవల్లభుడు అయన వికుంఠుడు కార్తిక ద్వాదశినాడు బృందావనానికి విచ్చేస్తాడు. ఏకాదశి ఉపవసించి ద్వాదశి రోజు బృందావనానికి విచ్చేసిన స్వామిని సేవించిన వారికి ఇహపరసుఖాలు లభిస్తాయ. వారి మనోరథాలు అన్నీ ఈడేరుతాయ. హరిని ప్రత్యేకంగా సేవించేరోజు కనుక హరిద్వాదశి అని అంటారు. ఈరోజు చలిమిడి తయారు చేయడానికి రోటిలో చెరుకు గడలతో పిండిని దంచుతారు.

10/29/2017 - 20:25

పరమ శివుని అనుగ్రహం పొందడానికి ‘శివపంచాక్షరి’ మంత్రమే అత్యంత శక్తివంతమైనది. ప్రణవం నుంచే పంచాక్షరి ప్రభవించిందనీ, పంచాక్షరి నుండి గాయత్రీ మంత్రము, దాని నుండి సర్వవేద సారస్వతం ఉద్భవించెనని శివభారతంలో చెప్పబడింది.

10/28/2017 - 19:37

శివకేశవులకు ప్రీతికరమైన కార్తికంలో దీపం దానం చేసినవారికి అనంతమైన పుణ్యం వస్తుంది. శివకేశవుల్లో ఎవరిని పూజించినా వారికి ముక్కోటి దేవతలను పూజించినఫలం ఆ పరమేశ్వరుడే కలుగచేస్తాడని స్కాందపురాణం చెప్తుంది. కార్తికంలో చేసే దీపారాధనకు ఆవునేయి, నువ్వులు, విప్ప, కొబ్బరి లాంటి నూనెలతో ఉపయోగించాలి.

10/27/2017 - 18:20

ఆదర్శ జీవనానికి సంపూర్ణ మార్గదర్శి వాల్మీకి రామాయణం. ఈ భువిపై తరులు, గిరులు, సంద్రములు నిలిచి ఉన్నంతకాలం రామాయణం నిత్యనూతనమై వెలుగొందుతూ మానవాళికి దారిచూపుతుంది. జన్మలలో నరజన్మ దుర్లభమని ఆదిశంకరులు వక్కాణించారు. అలాగే జన్మలను చరితార్థము గావించుకొనుటకు రామాయణ అనుసరణము తప్ప మరేదియు లేదు అనుట పరమ సత్యము.

10/26/2017 - 18:39

ఒక మనిషి ఒక పనిని మంచిదో చెడ్డదో రహస్యంగా చేసి ఆహా ఎవరూ చూళ్ళేదు గదా అనుకుంటాడు. కానీ ఎవరూ చూడడం లేదు అనేది నిజం కాదు. సృష్టిలోని కొన్ని మహనీయ శక్తులు మనం చేసే ప్రతి పనినీ ప్రతి నిముషం చూస్తూనే ఉంటాయి అంటుంది భారతం.

10/25/2017 - 18:35

మనుషులు నిరంతరం ఆశా పాశాలతో కాలచక్రంలో ఈదులాడుతుంటారు. నేడు ఆధునిక యుగంలో ప్రతీ ఒక్కరు వారి వారి జీవన క్రమంలో పూర్తిగా నిమగ్నం అవుతారు మరే ఇతరములతో అవసరం లేదన్నట్టుగా! ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి వరకు నిరంతర వ్యాపకాలే అందరికీ. చిన్నపిల్లలనుండి పెద్దవారి వరకు అలానే నిరుపేదనుండి ధనికుల వరకు అందరికీ అంతుపట్టని కార్యక్రమాలలో సతమతమవ్వడమే!

10/24/2017 - 17:44

గాయత్రీ దేవిని ప్రతిరోజు మూడు వేళలా ఉపాసించమని పెద్దలు చెబుతుంటారు. ఈమూడు వేళలు చాలా ప్రధానమైనవి కూడా అంటారు. సూర్యోదయానికి పూర్వమే చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయని పెద్దలు చెబుతారు.

10/22/2017 - 21:38

భారతీయులు ప్రకృతి ఆరాధకులు. భగవత్సృష్టియైన ఈ జగత్తులో స కల చరాచరమలు భారతీయులకు ఆరాధనీయమే. పంచ భూతాలతో సహా చెట్టు, పుట్ట, కొండ..ఒకటేమిటి ప్రకృతిలోని అణువణువు పూజనీయాలే! ప్రకృతి పరిరక్షణ భారతీయుడు ప్రధమ కర్తవ్యంగా భావిస్తూ వైదిక సంస్కృతి అందించిన పండుగలు, పర్వాలు జరుపుకుంటున్నాడు. అటువంటి పర్వమే కార్తీక శుద్ధ చవితి-నాగుల చవితి.

Pages