S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

04/08/2016 - 22:07

మనిషి మనుగడ సవ్యంగా సాగాలంటే మంచి విద్య చాలా అవసరం. దానికి తోడు వినయం, విధేయతతో కూడిన బుద్ధి కూడా అవసరం. అంతకుమించి మంచి సంస్కారం ఉండాలి. అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్నారు. విద్యలేనివాడు గొడ్డులా చాకిరీ చేయగలడు కానీ సమయస్పూర్తితో కొన్ని పనులు చేయలేడు. అదే మంచి విద్యను అభ్యసించినవాడు కండబలంతో, బుద్ధిబలంతో అన్ని పనులు సవ్యంగా నిర్వర్తించగలడు. అదే విద్యకున్న మహిమ.

04/07/2016 - 21:31

నులివెచ్చని, తొలి కిరణాల మాటున సిగ్గులొలుకు నవ వధువు చందాన, వసుంధర వయ్యారపు నడకలతో, ప్రకృతిని పరవశింపచేస్తూ విజయోత్సవంతో మన్మధలీలలు తల్చుకుంటూ, మన్మథుడ్ని సాగనంపి, దుర్ముఖను స్వాగతిస్తూ అడుగిడుతోంది నవ్య ఉగాది.

04/07/2016 - 06:46

ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజే ఈ ఉగాది పర్వదినం. అందుకని అనాదిగా వస్తున్న ఈ యుగాది రాను రాను ఉగాది పండుగగా మారింది. శాలివాహన చక్రవర్తి (క్రీ.శే.79) ఈ సంవత్సరాదినాడే పట్ట్భాషిక్తుడయ్యాడని చెబుతారు. ఆ కారణంగా ఈ యుగాన్ని శాలివాహన శకంగా పేర్కొన్నారు.

04/05/2016 - 21:10

సనాతన ధర్మమునందుగాని ఆర్ష ధర్మమునందు గాని పురాణములయందుగాని వృక్ష జాతికి యున్న ప్రాధాన్యత తక్కువగాదు. ఆధ్యాత్మిక ఆలంబనకు ఆనవాలముగా అనాదినుండి ప్రశంశింపబడేవి వృక్షములు. రావిచెట్టుకు గల ప్రాధాన్యత చాలా గొప్పది. ఈ చెట్టును పిప్పల వృక్షమని కూడా అంటారు. ఈ అశ్వత్థ వృక్షములు దేవతల నివాస స్థానములు అని అధర్వణ వేదములో చెప్పారు. ఆదిత్య వృక్షమని కూడా ఆ చెట్టును సంబోధిస్తారు.

04/04/2016 - 01:00

రామాయణానికి నాయకుడు శ్రీరామచంద్రుడైతే సుందరకాండకు నాయకుడు ఆంజనేయస్వామి. రాములవారిని వర్ణించే శ్లోకాలలో కూడ మారుతికి ప్రాధాన్యం ఉన్నది. ‘రామం భజే శ్యామలం’ అనే శ్లోకంలో ‘వామే............. హనుమాన్’ అని చెప్పడంతో సీతామాత తర్వాత రాములవారికి విశేష ప్రీతిపాత్రుడు. అంజనీసుతుడే అని వేరే చెప్పనవసరం లేదు.

04/02/2016 - 20:06

విజ్ఞానం వృద్ధి చెందిన తర్వాత స్ఫుటనిక్ (కృత్రిమ ఉపగ్రహం) మొ.గు ఉపగ్రహముల ద్వారాను అవి ప్రసారంచేసే తీవ్ర విద్యుత్ రశ్మముల ద్వారాను మనకు అడ్డముగా క్రిందుగా కనపడే ఉత్తరధ్రువం, ధ్రువ నక్షత్రము ఇవి పై భాగమనియు దక్షిణధ్రువం మన భౌగోళమునకు క్రింది భాగమనియు తెలియుచున్నది. ఉత్తర ధ్రువము మన తలవంటిది కనుక మనము పుట్టినప్పుడు కూడ మన మధ్య తలపై గుంట ఉండును.

04/01/2016 - 22:11

ఇహ, పర, లోక జీవన సౌఖ్యాలను గురించి విశే్లషణ చేయాలంటే అందుకు తగిన ఏకాగ్రత కావాలి. విశే్లషణలో హేతుబద్ధత వుండాలి. వివేచన, లోతైన ఆలోచన, ఏకాగ్రత- ఈ మూడూ కలిస్తే అది తపస్సు అవుతుంది. విశిష్ట్భక్తులు, నిస్వార్థపరులు, విశ్వమానవ హితాభిలాషులు అయిన ఋషులు చేసే తపస్సు అలాంటిదే. ఎంతో దీక్షాదక్షులయిన మహాఋషులు చేసే తపస్సు, పరిశోధనలు, అన్నీ సర్వమానవ హితం కోసమే చేశారు.

03/31/2016 - 21:43

అనాదినుండీ పుణ్య గ్రంథాలుగా భారతం, భాగవతం, రామాయణం వ్యాసుడు, పోతన, వాల్మీకిల రచనలుగా పవిత్రతను సంతరించుకున్న పుణ్య చరిత్రలను మానవాళికి అందించాయి. వీటిలో శ్రీకృష్ణుడి లీలలు, భాగవతంలో మానవుడిగా పుట్టి, మనిషి ఎలా చరించాలో చెప్పిన శ్రీరాముడి నడతను రామాయణంలో ఆయా కవులు వ్రాయగా, భారతంలో ముఖ్యులు కౌరవులు, పాండవులు, శ్రీకృష్ణుడు.

03/30/2016 - 23:43

కోరికలు మానవ సహజం. కొన్నిసార్లు మన తాహతుకు మించి కోరికలు మరికొన్నిసార్లు ఇరుగుపొరుగు వారితో పోల్చుకుని పుట్టగొడుగుల్లా పుట్టే కోర్కెలను తీర్చుకోవడానికి ఆరాటపడి ఆయాసపడుతు వుండడం సాధారణం. ఈ సాధనలో చాలామంది జాతకాలు, శాంతులు, దోషాలు నివారణలు అంటూ దేవులాడడం సహజాతి సహజంగా ప్రతిచోటా కనిపిస్తుంది.

03/30/2016 - 00:46

తియ్యని పండ్లను కాసే చెట్లు తమ కాయలను అవి భుజింపవు. ఆవులు, గేదెలు తమ పాలను మానవాళికే అందిస్తాయి. దాహం తీర్చే నదీ జలాలు ప్రాణికోటి దాహార్తిని తీర్చి సేవ చేస్తున్నాయి. అడగకుండానే మేఘాలు వర్ష ధారలను కురిపించి పుష్కలంగా పంటలు పండడానికి దోహదం చేస్తున్నాయి.

Pages