S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

08/23/2017 - 22:01

బాబా చిరునవ్వు నవ్వాడు.
‘‘నానా! నీకు ఎందుకీ అనుమానం వచ్చింది. అయినా నీవు నేను వేరు వేరు కాదు కదా. నీవెంతో నేను అంతే. ఎక్కడినుంచి వచ్చామో మనమంతా తిరిగి అక్కడికే పోతాం కదా! మధ్యలో నీవు నేను అని ఎందుకీ చర్చలు’’ అన్నాడు.
అంతలో హేమాదిపంతు-

08/22/2017 - 21:07

బాబా దగ్గరగా పాటిల్ సంతోషంతో కూర్చున్నాడు.
అంతలో బాబా తన చేతిలోని పొడుగాటి కమ్మి చిమ్టాను నేలపై గుచ్చాడు. బుస్‌మని నీరు పైకి ఉబికి వచ్చింది. ఆ నీటిలో చేతిలో ఉన్న గుడ్డను తడిపాడు. మట్టి గొట్టం ఒక చివరను చుట్టాడు. ఈసారి మళ్లీ ఆ చిమ్టాను భూమిపై కొట్టాడు. ఒక నిప్పుకణిక వచ్చింది. వెంటనే చిలుము వెలిగించాడు. పాటిల్‌కు ఇచ్చాడు.

08/20/2017 - 21:43

అంతే వాత్సల్యానికి అనురాగానికి కట్టుబడే ఆ పరమాత్మ యశోదమ్మకు తన నోటిలో 14 భువనబోంతరాళ్లను చూపాడు. సముద్రాలు, పర్వతాలు, కొండలు, అడవులు, గుట్టలు, జలాశయాలు, మనుషులు, దేవతలు, సర్పాలు, పక్షులు, క్రిములు ఈ లోకాన ఉన్నవన్నీ ఆ నోటిలోనే చూస్తున్న ఆ యశోదమ్మ నోట మాట రాక మ్రాన్పడిపోయింది.
అంతా చూపించాక మాయలకే పెనుమాయ

08/20/2017 - 00:15

ఈ మసీదే పెద్ద దేవాలయంగా మారుతోంది. ఈ భారతదేశంలోని వారే కాక విదేశాల నుంచి కూడా నన్ను చూడడానికి గుంపులు గుంపులుగా వస్తుంటారు. వారంతా నన్ను దర్శించడానికి బారులు తీరి నిల్చుంటారు. వెనుకగా వచ్చిన వారికి నా దర్శనం లభించదేమో అన్న అశాంతితో కొట్టుమిట్టాడుతూ ప్రత్యేక దర్శనాలు అంటూ మరో దారిలో నా దగ్గరకు వస్తారు.

08/18/2017 - 22:16

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆత్మీయుడెవరో తనకోసమే వచ్చినట్టు అనిపించింది. తెలియకుండా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాడు. చేతులు చాస్తూ ‘యాసాయి’ అని పలికాడు. ఆ పలుకును వినగానే తాను ఎన్నో ఏళ లనుంచి ఎదురుచూస్తున్నట్టుగా ఆ పిలుపు కోసమే ఉన్నట్టుగా ఎంతో దూరంనుంచి వచ్చినట్లుగా ఆ రూపం కదలి ముందుకు వచ్చింది.

08/17/2017 - 22:25

ప్రశాంత వాతావరణం.. మామిడిచెట్లు, వేపచెట్టు, మఱ్ఱి చెట్లు, రాగిచెట్లు, మారేడు చెట్లు అన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. తెల్లతెల్లని గులకరాళ్ళు.. సన్నని మట్టి.. మఱ్ఱిచెట్టు ఊడలు దిగి ఉంది. పెద్ద వేపచెట్టు దానికి చుట్టూరు కాంక్రీటుతో అరుగు వేసి ఉన్నారు.

08/16/2017 - 23:47

భోగయ్యగారి కథ

08/15/2017 - 21:35

బిజ్జలునికి అది తెలిసి దిగ్భ్రాంతి చెంది బాచయ్యకు శరణు చేసి ఆ లింగానికి సోమేశ్వరుడని పేరు పెట్టి సువర్ణ మందిరం కట్టించాడు.
అరియమ కథ

08/13/2017 - 21:38

గోవూరి బ్రహ్మయ్య కథ
గోవూరు బ్రహ్మయ్య అనే భక్తుడు ఒక జైనునితో వాదించి ఓడించాడు. జైనుడు ‘ఈ వాదాలెందుకు? ఈ మర్రి చెట్టును కాలిస్తే బతికిస్తావా?’ అన్నాడు. సరేనని బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వాడు. జైనుడు మర్రిచెట్టును కాల్చాడు. బ్రహ్మయ్య దానిపై భస్మం చల్లి బతికించి జైనులందరినీ ఓడించాడు.
తేడర దానయ్య

08/12/2017 - 22:50

పిళ్లనాయనారు

Pages