S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 01:18

న్యూఢిల్లీ, ఆగస్టు 28: భారతదేశ 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. డిసెంబర్ 16 గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నేరగాళ్లకు ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలని కూడా తీర్పు చెప్పింది ఈయనే.

08/29/2017 - 01:17

ఏలూరు: ప్రభుత్వ స్ధలాలను పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత శాఖాధికారులదేనని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు.

08/29/2017 - 01:15

న్యూఢిల్లీ, ఆగస్టు 28: డోక్లామ్ బలాబలాల పరీక్షలో చైనాపై భారత్ విజయం సాధించింది. డోక్లామ్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు రెండు దేశాలు తమ సైన్యాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాయి. ఈ మేరకు సైన్యాల ఉపసంహరణ ప్రారంభమైందని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు.

08/29/2017 - 01:13

ఈ ఉపఎన్నికలో భూమా వర్గంపై సానుభూతి బలంగా పని చేసింది. సర్కారు చేపట్టిన అభివృద్ధి దానికి మరింత బలాన్నివ్వడం వల్లే -గెలుపు తెదేపా పరమైందన్నది రాజకీయ నిపుణుల విశే్లషణ. తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడానికి రాజకీయాల్లో కొనసాగుతున్నామంటూ ప్రస్తుత మంత్రి అఖిలప్రియ నిర్వహించిన విస్తృత ప్రచారంతో సెంటిమెంట్ బలంగా వర్కౌటైందని అంటున్నారు.

08/29/2017 - 01:12

సత్తెనపల్లి:పట్టణాలకు ధీటుగా గ్రామాల్లో కూడా వౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. సత్తెనపల్లి మండల పరిధిలోని భట్లూరు, రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామాలకు శుద్ధజల పథకం కింద తాగునీటి కేంద్రాలను మంజూరు చేసినట్లు చెప్పారు.

08/29/2017 - 01:12

కర్నూలు, ఆగస్టు 28: రాష్టవ్య్రాప్తంగా ఉత్కంఠ రేపిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 27 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 97,076 ఓట్లురాగా, సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి.

08/29/2017 - 01:05

వచ్చే ఐదేళ్ల కాలానికి ఐపిఎల్ టోర్నమెంట్ మీడియా హక్కులను కేటాయించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న బిడ్స్ విధానాన్ని రద్దు చేసి, అదే స్థానంలో ఈ-ఆక్షన్ పద్ధతిని అమలు ప్రవేశపెట్టాలని బిసిసిఐని ఆదేశించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌లోని మొదటి అంశాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

08/29/2017 - 01:03

న్యూఢిల్లీ, ఆగస్టు 28: క్రీడలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని భారత ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్‌తో కలిసి నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ పోర్టల్‌ను ప్రారతభించిన ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా వౌలిక వసతులను కల్పించడంతోపాటు, క్రీడా సామాగ్రి, శిక్షణ సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తామని అన్నారు.

08/29/2017 - 01:01

గ్లాస్గో, ఆగస్టు 28: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్న భారత స్టార్, తెలుగు తేజం పివి సింధు మ్యాచ్‌లో చివరి క్షణాలే ఫలితాన్ని మార్చేశాయని వాపోయింది. పిటిఐతో ఆమె మాట్లాడుతూ మొదటి సెట్‌ను 21-19 తేడాతో తాను గెల్చుకుంటే, రెండో సెట్‌లో 20-22 ఆధిక్యంతో తన ప్రత్యర్థి నొజోమీ ఒకుహరా విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసింది.

08/29/2017 - 00:59

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు బిసిసిఐ నడుం బిగించింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ ఫైనల్ వరకూ చేరిన విషయం తెలిసిందే. టైటిల్ పోరులో ఓడినప్టపికీ, చివరి క్షణం వరకూ భారత మహిళలు చేసిన పోరాటం అందరినీ ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా క్రికెటర్లకు ఆదరణ లభించింది.

Pages