S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 01:38

కడప: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం, వాటితో ప్రజలు అంటువ్యాధులు ప్రబలి మంచాలెక్కి వారి పరిస్థితి వర్ణణాతీతంగా తయారైంది.

08/29/2017 - 01:31

నంద్యాల: అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సర్వే ఫలితాలను లెక్క చేయకుండా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పట్టారు. ఈ నెల 23వ తేదీ జరిగిన పోలింగ్‌లో అనూహ్యంగా 79.2శాతం పోలింగ్ నమోదు కావడంతో ఒక దశలో అధికార తెలుగుదేశం పార్టీ కూడా సందిగ్ధంలో పడింది. భారీ పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందోనన్న సంశయం ఇరుపార్టీలను వెంటాడింది.

08/29/2017 - 01:31

హైదరాబాద్, ఆగస్టు 28: వచ్చే నాలుగు నెలలు క్షేత్రస్థాయి ప్రభుత్వ యంత్రాంగానికి కీలకం కానుంది. డిసెంబర్ నాటికి సమగ్ర భూ సర్వే, మిషన్ భగీరథ, 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి మూడు ప్రధాన కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం డెడ్‌లైన్‌గా విధించింది. సెప్టెంబర్ 1నుంచి డిసెంబర్ నెలాఖరుకు సమగ్ర భూ సర్వేను పూర్తి చేసే బాధ్యతను రెవిన్యూ, వ్యవసాయ శాఖకు అప్పగించింది.

08/29/2017 - 01:28

చెన్నై, ఆగస్టు 28: రోజుకో మలుపుతిరుగుతున్న తమిళ రాజకీయాల్లో సోమవారం మరో కొత్త అంకానికి తెరలేచింది. శశికళ, ఆమె మేనల్లుడిని పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లుగా అన్నాడిఎంకె పార్టీ ప్రకటించింది. సోమవారం జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ ఇప్పటివరకు జరిపిన నియామకాలేవీ చెల్లవని ప్రకటించారు.

08/29/2017 - 01:26

పాడేరు, ఆగస్టు 28: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విశాఖ మన్యం అతలాకుతలమైంది. ఏజెన్సీలో ఆది, సోమవారాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ ఏకధాటిగా వర్షం పడటంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

08/29/2017 - 01:25

పాలకొండ: ఒడిశా ప్రాంతానికి వర్షాలు కురిసినట్టయితే శ్రీకాకుళం జిల్లాకు వరదముప్పు తప్పదు. జిల్లా యంత్రాంగం జిల్లాకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల సమాచారం తెలుసుకొని నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది.

08/29/2017 - 01:23

హైదరాబాద్, ఆగస్టు 28: అధికారులు, ఉద్యోగుల విభజనపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల అధికారులు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తుందని డివోపిటి (కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) హితవు పలికింది. ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు నడుచుకుంటే వివాదాలకు తావుండదని కూడా సూచించింది.

08/29/2017 - 01:23

గరుగుబిల్లి: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం సంకల్ప సిద్ధి కార్యక్రమాన్ని రూపొందించిందని కేంద్ర పౌరవిమానాయశాఖా మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు అన్నారు. మండల పరిధిలోని ఉల్లిభద్ర గ్రామ సమీపంలో ఉద్యానవన కళాశాలలో సోమవారం ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సంకల్పసిద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.

08/29/2017 - 01:21

రోహ్తక్ (హర్యానా), ఆగస్టు 28: రేపిస్ట్ బాబాకు తగిన శిక్షే పడింది. ఇద్దరు మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాసచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్‌కు ఇరవై ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జగదీప్ సింగ్ సోమవారం తీర్పు చెప్పారు.

08/29/2017 - 01:20

రాజవొమ్మంగి: అల్పపీడనం కారణంగా మన్యంలో సోమవారం విస్తృతంగా వర్షాలు కురియడంతో వాగులూ, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలో నెల్లిమెట్ల గ్రామం సమీపంలో ఉన్న కొండవాగులో ఆటో కొట్టుకుపోయిన సంఘటన చోటుచేసుకుంది. రాజవొమ్మంగి నుండి ఎరువుల బస్తాలు, బియ్యం బస్తాలతో ఆటో వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద పెరిగింది.

Pages