S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 02:01

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జల్ నిగమ్ మర్యాదిత్ శాక ఇంజనీర్ల బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించి, మిషన్ భగరీథ పనులు పరిశీలిస్తారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్టల్రు తమ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపించాయి.

08/29/2017 - 02:00

హైదరాబాద్, ఆగస్టు 28: ప్రజలను మభ్యపెట్టడంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్సు ఇవ్వొచ్చని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావుఎద్దేవా చేశారు. గత రెండు రోజుల నుండి ముఖ్యమంత్రి భూ సర్వేపై పెద్ద ఎత్తున సమీక్షిస్తున్నారని, వాస్తవానికి సర్వే అనేది ఒక పెద్ద ఫార్సు అని అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు.

08/29/2017 - 02:00

హైదరాబాద్, ఆగస్టు 28: గిరిజన సంక్షేమ పథకాలు, పథకాల అమలుపై పరిశోధన, వినూత్న కార్యక్రమాలు అనే అంశంపై జాతీయ సదస్సును వర్శిటీ ఆడిటోరియం హాలులో ఈ నెల 29 నుండి నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి అప్పారావు సోమవారం నాడు చెప్పారు.

08/29/2017 - 01:59

హైదరాబాద్, ఆగస్టు 28: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజకీయ అభద్రతలో ఉన్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించిన పాలకులకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

08/29/2017 - 01:58

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించారు.గృహనిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమించారు.

08/29/2017 - 01:58

హైదరాబాద్, ఆగస్టు 28: బిఇడి కోర్సులో చేరేందుకు అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను ఈ నెల 30వ తేదీన జారీ చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. సర్ట్ఫికెట్ల పరిశీలన సెప్టెంబర్ 7 నుంచి 13 వరకూ జరుగుతుందని, వెబ్ ఆప్షన్లను 9వ తేదీ నుండి 16వ తేదీ వరకూ నమోదు చేసుకోవచ్చని అన్నారు.

08/29/2017 - 01:57

న్యూఢిల్లీ, ఆగస్టు 28: నూతన విద్యా విధానం అమలులో భాగంగా రానున్న రోజుల్లో పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యాస్థాయి వరకూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై పాఠ్యాంశాలను చేర్చడం ద్వారా విద్యార్థులను చైతన్య పరచాలని కేంద్రం యోచిస్తోంది.

08/29/2017 - 01:56

హైదరాబాద్, ఆగస్టు 28: నిరుద్యోగులు మరణిస్తున్నా డిఎస్‌సి ప్రకటించరా? అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఖాళీల్లో మొత్తం 40 వేల ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కృష్ణయ్య సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు.

08/29/2017 - 01:56

హైదరాబాద్, ఆగస్టు 28: శాసనసభా నియోజకవర్గాల అభివృద్ధి కోసం 225 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పరిధిలో శాసనసభా నియోజవర్గాల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం.

08/29/2017 - 01:55

హైదరాబాద్, ఆగస్టు 28: భూ సర్వేపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేవలం టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడితే సరిపోదని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

Pages