S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 00:58

పల్లేకల్, ఆగస్టు 28: పాకిస్తాన్‌తో మ్యాచ్ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మైదానంలోకి దిగేందుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధంగా ఉంటాడు. అవసరమైతే ఒంటికాలితోనే మ్యాచ్ ఆడతానంటూ సెలక్టర్‌కు తేల్చిచెప్పిన తెంపరితనం అతనిది. ఇందుకు సంబంధించిన సంఘటనను ప్రస్తుత జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ విలేఖరులతో ముచ్చటిస్తూ ప్రస్తావించాడు.

08/29/2017 - 00:56

స్టవెలాట్‌లో జరిగిన బెల్జియం గ్రాండ్ ప్రీ విజేత లూయిస్ హామిల్టల్ (మెర్సిడిజ్). ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్, రెడ్‌బుల్‌కు ప్రాతినిధ్యం వహించిన డానియల్ రిసియార్డో వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు

08/29/2017 - 00:55

కొలంబో, ఆగస్టు 28: అటు రాజకీయ నాయకులు, ఇటు మాజీ క్రికెటర్ల మధ్య జరుగుతున్న ఆధిపత్యం పోరు శ్రీలంక క్రికెట్‌కు శాపంగా మారింది. బడా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు కూడా క్రికెట్‌పై ఆజమాయిషీని కొనసాగించడానికి వ్యూహాలను అమలు చేస్తుండడంతో సమస్య మరింత సంక్లిష్టంగా మారుతున్నది.

08/29/2017 - 00:51

ఒకప్పుడు వెలుగు జిలుగులు విరజిమ్మిన తెలుగు భాషకు పరభాషా వ్యామోహమనే గ్రహణం పట్టి మబ్బులు కమ్మేస్తున్నాయి. దాంతో మన తెలుగు భాషకు సంబంధించిన అలవాట్లు, అభిరుచులు, సంస్కృతీ సంప్రదాయాలు ఒక్కొక్కటి మరుగునపడుతున్నాయి. కొందరు తెలుగు మాట్లాడితేనే తమ అంతస్తుకి, గొప్పతనానికి భంగమనుకుంటున్నారు. వాళ్ల పిల్లలకు ‘అ’ అంటే అంకుల్ అని, ‘ఆ’ అంటే ఆంటీ అని నేర్పిస్తున్నారు.

08/29/2017 - 00:50

తమిళులకున్న భాషాభిమానం గొప్పదే! కానీ, ఇతర భాషలపట్ల వారికి ఉన్న చులకన భావమే భరించరానిది! ముఖ్యంగా దక్షిణాది భాషలన్నింటిపట్లా ఉన్న తక్కువ భావంతో ఆ భాషలని అణచివేయడానికి చేసిన ప్రయత్నం ఖండించదగ్గది! తమిళం కన్నా తెలుగు ప్రాచీనమైనదని డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి రాసిన వ్యాసాన్ని 2003లో ‘నడుస్తున్న చరిత్ర’లో ప్రచురించారు. ఈ పత్రిక సామల రమేష్‌బాబు సంపాదకత్వంలో తెలుగు భాషకి అంకితమై వచ్చిన పత్రిక.

08/29/2017 - 00:49

సుప్రీం కోర్టు గత వారం రెండు చరిత్రాత్మక తీర్పులు ఇచ్చింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కేహార్ తన పదవీ కాలం ముగుస్తున్న వేళ వెలువడిన ఈ రెండు తీర్పులు సమాజంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తాయనేది నిర్వివాదాంశం.

08/29/2017 - 00:48

డోక్‌లా పచ్చిక మైదానం నుంచి తన దళాలను ఉపసంహరించుకొనడానికి చైనా అంగీకరించ డం మన ప్రభుత్వం సాధించిన దౌత్య విజయం! చైనా అక్రమ విస్తరణకు, వ్యూహాత్మక దురాక్రమణకు తీవ్రమైన అవరోధం ఏర్పడిందనడానికి ఇది మరో నిదర్శనం!

08/29/2017 - 00:45

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్‌టిపిసిలో 5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోంది. రెండు రోజుల ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా ఈ వాటాల విక్రయం జరగనుండగా, 7,000 కోట్ల రూపాయల నిధులను మోదీ సర్కారు సమీకరించనుంది. మంగళ, బుధవారాల్లో ఒఎఫ్‌ఎస్ జరుగుతుంది. ఒక్కో షేర్‌ను 168 రూపాయల చొప్పున అమ్మనున్నామని ఓ అధికారి సోమవారం తెలిపారు.

08/29/2017 - 00:44

న్యూఢిల్లీ, ఆగస్టు 28: మరిన్ని కొత్త సెక్యురిటీ ఫీచర్లతో రిజర్వ్ బ్యాంకు త్వరలోనే 1,000 రూపాయల నోటును చలామణిలోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలనలో భాగంగా నిరుడు నవంబర్‌లో పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేసినది తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా 2,000, 500 రూపాయల నోట్లను తీసుకురాగా, వీటి మధ్య మరో కరెన్సీ ఏదీ లేకపోవడంతో చిల్లర సమస్యలు తలెత్తుతు న్నాయ. దీంతో రూ.

08/29/2017 - 00:43

హైదరాబాద్, ఆగస్టు 28: ఉద్యోగ భవిష్య నిధి ఇపిఎఫ్‌ఒ.. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో దాదాపు 3,000 కోట్ల రూపాయలను ఎఎప్లస్ కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అలాగే ఎఎఎమైనస్ కార్పొరేట్ బాండ్లలో ప్రస్తుత 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తగ్గించుకోవాలని కూడా నిర్ణయించిందని ఆయన పిటిఐకి చెప్పారు.

Pages