S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 02:23

పుణె, ఆగస్టు 28: మహారాష్టల్రోని పుణె జిల్లాలో సంభవించిన సోమవారం తెల్లవారుజామున ఘోరప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా, 12 మంది గాయపడ్డారు. నాసికా త్రయంబకేశ్వర్‌నుంచి పుణె వెళ్తున్న మహారాష్ట్ర రోడ్డు రవాం సంస్థకు చెందిన బస్సు నారాయణ్ గావ్ సమీపంలో ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని నారాయణ్ గావ్ పోలీసులు చెప్పారు.

08/29/2017 - 02:23

లండన్, ఆగస్టు 28: దక్షిణ ఇంగ్లండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో విప్రోలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ ఇంజనీర్లు ఉన్నారు. మినీ బస్సు రెండు ట్రక్కుల మధ్య చిక్కుపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు డ్రైవర్ల మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

08/29/2017 - 02:22

న్యూఢిల్లీ/వాషింగ్టన్, ఆగస్టు 28: హార్వే హరికేన్ అమెరికాను వరదలతో ముంచెత్తింది. హోస్టన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో దాదాపు 200మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం తెలిపారు. షాలిని, నిఖిల్ భాటియా అనే ఇద్దరు భారతీయ విద్యార్థులు అనారోగ్యం పాలు కావటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారని ఆమె పేర్కొన్నారు.

08/29/2017 - 02:28

న్యూఢిల్లీ, ఆగస్టు 28: తన డ్రీమ్ స్కీం జన్‌ధన్ పథకం ద్వారా లక్షలాది ప్రజల ఆకాంక్షలకు రెక్కలు వచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జన్‌ధన్ పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో దీనిపై వ్యాఖ్యానించారు. ఈ పథకం సామాజిక సురక్ష పథకాల్లో ఒకటని పేర్కొన్నారు.

08/29/2017 - 02:18

న్యూఢిల్లీ, ఆగస్టు 28: గోవాలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పనాజీలో భారీ ఓట్లతో గెలుపొందారు. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె వాల్పోయ్ స్థానాన్ని గెలుచుకున్నారు. అటు ఢిల్లీలోని బావనా నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నిక ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ ఉత్తేజాన్నిచ్చింది. ఈ స్థానంలో ఆప్ ఘనవిజయం సాధించింది.

08/29/2017 - 02:15

రోహ్‌తక్, ఆగస్టు 28: అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా అధినేత, వివాదాస్పద గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షను విధించగానే గుర్మీత్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జడ్జి శిక్షలను ప్రకటించిన వెంటనే గుర్మీత్ సింగ్ కోర్టు గదిలో ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయి భోరున విలపిస్తూ‘ ముఝే మాఫ్ కర్ దో’(నన్ను క్షమించండి) అంటూ జడ్జిని వేడుకున్నాడు.

08/29/2017 - 02:38

చండీగఢ్, ఆగస్టు 28: అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారించిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు శిక్షను ఖరారు చేసిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరగలేదని హర్యానా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

08/29/2017 - 02:11

న్యూఢిల్లీ, ఆగస్టు 28: మహారాష్ట్ర రాజకీయ గురువు, ఎన్‌సిపి అధినాయకుడు శరద్ పవార్ కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ సెప్టెంబర్ 3న చైనాలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి వెళ్లేముందే కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

08/29/2017 - 02:05

తెలంగాణ లెజిస్లేచర్ అసెంబ్లీ మీడియా సలహా కమిటీ తొలి సమావేశం శాసనమండలి చైర్మన్
స్వామిగౌడ్ అధ్యక్షతన సోమవారం జరిగింది. మీడియా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి శాసనసభ కార్యదర్శి డాక్టర్ రాజాసదారామ్ వివరించారు.

08/29/2017 - 02:02

హైదరాబాద్, ఆగస్టు 28: రబీ సీజన్‌లో వేర్వేరు పంటలబీమాకు సంబంధించి ప్రీమియం గడువును ఉన్నతస్థాయి కమిటీ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి నేతృత్వంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పంటల బీమాపై సచివాలయంలో సోమవారం జరిగిన రాష్టస్థ్రాయి సమన్వయ కమిటీ సమావేశం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Pages